E-Paper
Advertisement

Chiranjeevi Emotional: మీరు లేనిదే నేను లేను.. ఈ ప్రేమ శాశ్వతం.. చిరు ఎమోషనల్ పోస్ట్!

Chiranjeevi Emotional: మీరు లేనిదే నేను లేను.. ఈ ప్రేమ శాశ్వతం.. చిరు ఎమోషనల్ పోస్ట్!
Advertisement

Chiranjeevi Emotional: టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) హీరోగా సంక్రాంతి పండుగ సందర్భంగా మన శంకర వరప్రసాద్ గారు(MSVPG Film) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా ఏకంగా 300 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టడంతో చిత్ర బృందం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక చాలా రోజుల తర్వాత చిరంజీవికి ఇలాంటి సక్సెస్ రావడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవు. ఇలా మన శంకర వరప్రసాద్ గారు సినిమాని ఇంత మంచి హిట్ చేసిన ప్రేక్షకులను ఉద్దేశిస్తూ మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు..

ఈ విజయం మీ అందరిదీ.

ఈ సందర్భంగా చిరంజీవి తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా స్పందిస్తూ..” మన శంకర వరప్రసాద్” గారు.. సినిమాకు ప్రేక్షక దేవుళ్ళు చూపిస్తున్న ఆదరణ మరియు అపూర్వమైన విజయాన్ని చూస్తుంటే నా మనసు కృతజ్ఞతా భావంతో నిండిపోతుంది. నేనెప్పుడూ చెప్పేది, నమ్మేది ఒకటే. నా జీవితం మీ ప్రేమాభిమానాలతో ముడిపడింది. మీరు లేనిదే నేను లేను.. ఈరోజు మళ్లీ అదే నిజమని మీరు నిరూపించారు. ఈ విజయం పూర్తిగా నా ప్రియమైన తెలుగు ప్రేక్షకులది , నా ప్రాణ సమానమైన అభిమానులు, డిస్ట్రిబ్యూటర్లు సినిమా కోసం ప్రాణం పెట్టి పనిచేసిన ప్రతి ఒక్కరిది అని తెలిపారు.. కొన్ని దశాబ్దాలుగా నా వెంటే నిలబడి ఉన్న నా అభిమానులందరిది ఈ విజయం అని తెలిపారు.

మీరు కొట్టే చప్పట్లే శక్తినిస్తాయి..

Advertisement

వెండితెర మీద నన్ను చూడగానే మీరు వేసే విజిల్స్ కొట్టే చప్పట్లు నాకు శక్తిని ఇచ్చి ముందుకు నడిపిస్తాయి. నా సినిమాలకు ఎన్నో రికార్డులు వస్తుంటాయి, పోతుంటాయి కానీ మీరు నా పట్ల కురిపించే ప్రేమ ఎప్పటికీ శాశ్వతం. ఇలాంటి బ్లాక్ బస్టర్ విజయం వెనుక ఎంతో కృషి చేసిన మా డైరెక్టర్, హిట్ మిషన్ అనిల్ రావిపూడికి నిర్మాతలకు అలాగే చిత్ర బృందానికి నాపై మీరందరూ చూపించిన నమ్మకానికి ధన్యవాదాలు. ఈ సంబరాన్ని అలాగే కొనసాగిద్దాం.. మీ అందరికీ ప్రేమతో లవ్ యు ఆల్ అంటూ చిరంజీవి ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు.

Advertisement

ఇలా ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈ విజయం వెనుక ఉన్నది ప్రేక్షకులే అంటూ చిరంజీవి ఎమోషనల్ పోస్ట్ షేర్ చేయడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక మెగాస్టార్ చిరంజీవి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన తరువాత పలు సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ఈయన మాత్రం సరైన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయారు. ఇలా సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా ఈ సినిమా ద్వారా చిరంజీవి బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడంతో మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటించగా విక్టరీ వెంకటేష్ వెంకీ గౌడ అనే పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఇలా సంక్రాంతి బరిలో ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది.

Also Read: Allu Arjun: మన శంకర వరప్రసాద్ గారు సినిమా పై బన్నీ రివ్యూ .. బాస్ ఈజ్ బ్యాక్ అంటూ!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×