E-Paper
Advertisement

Bellamkonda Sai Srinivas : గుడ్ న్యూస్ చెప్పిన యాక్షన్ హీరో.. అమ్మాయి ఎవరంటే..?

Bellamkonda Sai Srinivas : గుడ్ న్యూస్ చెప్పిన యాక్షన్ హీరో.. అమ్మాయి ఎవరంటే..?
Advertisement

Bellamkonda Sai Srinivas : టాలీవుడ్ యాక్షన్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఎన్నో సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకులను బాగా అలరించారు. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే యాక్షన్ హీరోగా మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. ఈమధ్య ఈ హీరో పెద్దగా సినిమాల్లో కనిపించలేదు.. కానీ పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే.. అంతేకాదు ఆ మధ్య ఓ అమ్మాయి తో నిశ్చితార్థం కూడా చేసుకున్నాడు అని గుసగుసలు ఇండస్ట్రీలో వినిపించాయి. అయితే ఇప్పుడు ఆయన తన బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బై చెప్పేసి పెళ్లి పీటలేక్కబోతున్నాడని తెలుస్తుంది. మరి ఆయన పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరు? ఎప్పుడూ పెళ్లి చేసుకోబోతున్నాడు అన్నది ఇప్పుడు ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

పెళ్లి పీటలు ఎక్కబోతున్న బెల్లంకొండ..

ఈ మధ్య తెలుగు హీరోలు వరుసగా పెళ్లి చేసుకుంటూ వస్తున్న సంగతి తెలిసిందే.. రీసెంట్ గా టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ, బ్యూటిఫుల్ హీరోయిన్ రష్మిక మందన్న వివాహ బంధంలోకి అడుగు పెట్టారు.. అల్లు శిరీష్ పెళ్లి ఘనంగా జరగనుంది. తాజాగా మరో హీరో కూడా బ్యాచిలర్ లైఫ్‌కి గుడ్‌బై చెప్పేందుకు సిద్ధమవుతున్నాడు. ఆయన మరెవరో కాదు మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీస్ లతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్. నిర్మాత బెల్లంకొండ సురేష్ కుమారుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సాయి శ్రీనివాస్ యాక్షన్ సినిమాలతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. గత కొద్ది రోజులుగా ఈయన పెళ్లి గురించి అనేక వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.. మరోసారి ఈ వార్తలు గుప్పు మనడంతో అందరూ నిజమే అని నమ్ముతున్నారు.. ఆమె సినీ రంగానికి చెందినవారా?, కుటుంబ సభ్యులు చూసిన సంబంధమా? అనేది ఇప్పటివరకు రహస్యంగానే ఉంది.. మరి త్వరలోనే ఆయన పెళ్లి చేసుకోబోయే అమ్మాయి గురించి వివరాలను తెలుపుతాడు ఏమో చూడాలి…

Advertisement

Also Read : ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా ‘మృత్యుంజయ్’.. ఏ ఓటీటీలో స్ట్రీమింగంటే..?

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సినిమాల విషయానికొస్తే…

నిర్మాత కొడుకుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈ హీరో అతి తక్కువ కాలంలోనే యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. 2014లో విడుదలైన ‘అల్లుడు శీను’ చిత్రంతో హీరోగా పరిచయం అయ్యారు. తొలి చిత్రంతోనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత వరుసగా కమర్షియల్ మూవీలలో నటిస్తూ మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ‘స్పీడున్నోడు’, ‘జయ జానకి నాయక’, ‘సాక్ష్యం’, ‘కవచం’, ‘సీత’, ‘రాక్షసుడు’ వంటి చిత్రాలలో నటించి మెప్పించాడు.. తన సినిమాలను హిందీలో డబ్ చేయడం ద్వారా సాయి శ్రీనివాస్ నార్త్ ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు.. ప్రస్తుతం ఈయన రామమ్, టైసన్ నాయుడు వంటి సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నాడు.. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాలు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి..

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×