E-Paper
Advertisement

గౌరీ స్ప్రాట్‌తో పెళ్లే కారణమా? ఆమిర్ ఖాన్ ని టార్గెట్ చేసిన బిష్ణోయ్ గ్యాంగ్?

గౌరీ స్ప్రాట్‌తో పెళ్లే కారణమా? ఆమిర్ ఖాన్ ని టార్గెట్ చేసిన బిష్ణోయ్ గ్యాంగ్?
Advertisement

Aamir Threat:ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్టు, అమీర్ ఖాన్ పెళ్లి చేసుకోవడం ఏంటో కాని ఆ పెళ్లి ఇపుడు అమీర్ కి ఎక్కడ లేని చిక్కులు తెచ్చిపెడుతుంది.మొన్నటికి మొన్న అయోధ్యకి చెందిన జగద్గురు పరమ హంస ఆచార్య అమీర్ ని చంపిన వారికి ఏకంగా 5 కోట్ల భారీ రివార్డు ఇస్తానని సంచలన వ్యాఖ్యలు చేయడం తెల్సిందే.ఇక ఈ మంటలు చల్లారక ముందే అమీర్ ని చంపుతామంటూ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరిట సోషల్ మీడియాలో ఒక పోస్ట్ సర్క్యులేట్ అవడం ఇపుడు హాట్ న్యూస్ అయిపొయింది.

అర్జూ,టైసన్ బిష్ణోయ్ పేర్లతో సర్క్యులేట్ అవుతున్న పోస్టు

Advertisement

ముఖ్యంగా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ లో ప్రముఖుడైన లారెన్స్ సోదరుడు అర్జూ బిష్ణోయ్, అలాగే టైసన్ బిష్ణోయ్ పేర్లతో సర్క్యులేట్ అవుతున్న పోస్టు ,దానితో పాటు వారివి అని చెప్పబడుతున్న ఒక ఆడియో క్లిప్స్ ఇప్పుడు నెట్టింట తీవ్ర దుమారం రేపుతున్నాయి.అయితే నిజంగానే ఇవి వారు అఫీషియల్ గా వదిలినవా,లేక అల్లరి మూకలు చేసిన పనా అన్నది తేలాల్సి ఉంది.

ఇక ఇందులో ఉన్న సమాచారం చూస్తే అమీర్ ఖాన్ ,గౌరీ స్ప్రాట్‌ పెళ్లిని తప్పు బడుతూ అమీర్ ఖాన్ వంటి స్టార్ హీరోలు లవ్ జీహద్ ని ఎంకరేజ్ చేస్తున్నారని,ఇది తమ సంస్కృతీ సాంప్రదాయాలను కాలరాసేలా వారి వ్యవహారం ఉందని, మీరు స్టార్ హీరోలు కదా అని ఇష్టమొచ్చినట్టుగా చేస్తే చూస్తూ ఊరుకోబోమని, ఆ అహంకారాన్ని ఎలా అణచాలో తమకు బాగా తెలుసంటూ ఘాటైన పదాలతో హెచ్చరించడం ఆ పోస్ట్ లో కనిపిస్తుంది.

Advertisement

అతనికి సహకరిస్తున్న వారికి కూడా ఇదే మా చివరి హెచ్చరిక

ఇక కేవలం పోస్ట్ తోనే సరిపెట్టకుండా ఆడియో కూడా అమీర్ ఖాన్ ని హెచ్చరిస్తూ బయట సర్క్యులేట్ అవుతుంది,ఇందులో మాట్లాడిన వ్యక్తి నేను అర్జూ బిష్ణోయ్‌ని అని చెబుతూఆమిర్ ఖాన్‌తో పాటు అతనికి సహకరిస్తున్న వారికి కూడా ఇదే మా చివరి హెచ్చరిక అంటూ మాట్లాడటం ఆడియోలో వినిపిస్తుంది.ఇక తమ సంస్కృతిని దెబ్బతీసే ఏ ఒక్క చర్యను కూడా సహించే ప్రసక్తే లేదని, ఎక్కడ కనిపించినా ఊహించని రీతిలో బుద్ధి చెబుతామంటూ ఆ వాయిస్ క్లిప్‌లో బెదిరింపులకి దిగడం కనిపిస్తుంది.

లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కన్ఫాం చేస్తుందా?

నిజానికి గతంలోనూ సల్మాన్ ఖాన్ వంటి బడా స్టార్ లకే లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ వార్నింగ్ లు ఇవ్వడం మనకి తెల్సిందే .ఇదే క్రమలో ఇపుడు అమీర్ ఖాన్ కి కూడా వార్నింగ్ ఇస్తూ ఇలా పోస్ట్ అండ్ ఆడియో వదిలారా లేక అంతా ఉత్తిదేనా అన్నది పోలీస్ ఇన్వెస్టిగేషన్ అయితే తేలేలా లేదు.అయితే విచిత్రంగా ఈ ఆడియో, పోస్ట్ లపై తమకి ఎలాంటి కంప్లైంట్ రాలేదని, వస్తే మాత్రం తప్పనిసరిగా ఇన్వెస్టిగేషన్ చేస్తామని పోలీసులు చెప్పడం గమనార్హం. చూడాలి మరి ఇవే మేమే అని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కన్ఫాం చేస్తుందా లేక అంతా ఫేక్ అని తేలిపోతుందా అన్నది కాలమే డిసైడ్ చేయాలి.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×