E-Paper
Advertisement

Aadi Sai Kumar: బాలయ్యతో బాక్సాఫీసు క్లాష్‌.. తప్పదు అంటున్న యంగ్‌ హీరో

Aadi Sai Kumar: బాలయ్యతో బాక్సాఫీసు క్లాష్‌.. తప్పదు అంటున్న యంగ్‌ హీరో
Advertisement

Aadi Sai Kumar-Akhanda 2: అఖండ 2 వాయిదాపై ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ఈ సినిమా ఫైనాన్స్‌ కష్టాలు వెంటాడుతున్నారు. సినీ పెద్దలు సైతం సాయంగా వచ్చినా అఖండ 2 ఆర్థిక కష్టాలు సమసిపోవడం లేదు. దీనికి కారణం బాలీవుడ్‌ ఫైనాన్స్‌ కంపెనీ ఏరోస్‌ సంస్థ. సినిమా విడుదలకు కొన్ని గంటల ముందు కోర్టులో పిటిషన్ వేసిన అఖండ 2 ఆగిపోయేలా చేసింది. పది, పన్నెండేళ్ల క్రితం నాటి 1 నేనొక్కడినే, ఆగడు సినిమాల ఫైనాన్స్‌ తీర్చకపోవడం. మొత్తం డబ్బులు చెల్లిస్తే తప్పా ఎనోఓసీ ఇవ్వమంటున్నాయి. అఖండ 2 వాయిదా అంశం టాలీవుడ్‌లో పెద్దలకు పెద్ద తలనొప్పిగా మారింది.

శంబాల కూడా అదే రోజు

వీలైనంత తొందరగా సమస్యను పరిష్కరించి రిలీజ్ చేయాలని నిర్మాణ సంస్థ 14 రీల్స్‌, అటూ ఇండస్ట్రీ పెద్దలు ఎంతో కృషి చేస్తున్నారు. కానీ, ఇప్పట్లో ఈ మూవీ సమస్య తీరేలా కనిపించడం లేదు. అఖండ 2 కూడా ఇప్పట్లో విడుదలయ్యే అవకాశం లేదని తేలుస్తోంది. అయితే ఈ చిత్రాన్ని డిసెంబర్‌ 25న లేదు డిసెంబర్‌ 12న విడుల చేయాలని మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు. ఈ రెండు తేదీల్లో ఎక్కువ డిసెంబర్‌ 25నే విడుదలకు ఎక్కువ అవకాశం ఉందట. అయితే అదే రోజు మరో యంగ్‌ హీరో మూవీ కూడా థియేటర్లలో విడుదల కానుంది. అదే శంబాల. ఆది సాయి కుమార్‌ హీరోగా నటించిన చిత్రం ‘శంబాల’ డిసెంబర్‌ 25న విడుదలకు సిద్దమౌతుంది. రిలీజ్ డేట్‌ని ఎప్పుడో ఫిక్స్‌ చేసుకున్న మూవీ టీం అన్ని పనులను పూర్తి చేసుకుంది.

అఖండ 2తో బాక్సాఫీసు క్లాష్

Advertisement

డిసెంబర్‌ 25న వచ్చేందుకు రెడీ అవుతోంది. సూపర్‌ నాచురల్ థ్రిల్లర్ వస్తున్న ఈ మూవీపై కూడా మంచి బజ్‌ ఉంది. ఆది నుంచి వస్తున్న మోస్ట్‌ అవైయిటెడ్‌ చిత్రమిది. అందుకే ప్రమోషన్స్‌ కూడా గట్టిగానే చేస్తుంది మూవీ టీం. ఈ సినిమా రిలీజ్ డేట్‌ దగ్గర పడుతున్నకొద్ది ఆది సాయి కుమార్‌ సోషల్‌ మీడియాలో ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటున్నాడు. ఎప్పటికప్పుడు సినిమా పోస్టర్స్‌, అప్‌డేట్స్‌ ఇస్తూ బిజీగా ఉంటున్నాడు. ఈ క్రమంలో అఖండ 2 వాయిదా పడటం, డిసెంబర్‌ 25నే మూవీ రిలీజ్ ఉంటుందంటూ ప్రచారం జరగడంతో ఓ నెటిజన్‌ ఆదిని ఓ ప్రశ్న అడిగాడు. ‘అఖండ 2 కూడా అదే రోజు విడుదల అంటున్నారు. అలా అయితే మీరు వస్తారా? పోస్ట్‌పోన్‌ చేసుకుంటారా?’ అని ప్రశ్నించారు.

Also Read: OTT Movies: సంక్రాంతి సినిమాలకు ఓటీటీ డీల్స్ అయిపోయినట్టే, కంప్లీట్ డీటెయిల్స్

తప్పదు.. అప్పుడే వస్తాం..

Advertisement

‘మేము ఇప్పటికే శంబాల మూవీ ప్రమోషన్స్‌ కోసం భారీగా పెట్టుబడి పెట్టాము. కాబట్టి ఈ పరిస్థితుల్లో సినిమాను వాయిదా వేయడం కుదరదు. ప్రస్తుతానికి మేము ఆశించిన మేర థియేటర్లు దొరకుతాయో? లేదా అనేది ఖచ్చితంగా చెప్పలేము. కానీ, వాయిదా వేయడానికి మాకు మరో ప్రత్యామ్నాయ తేదీ లేదు. మున్ముందు పరిస్థితులు ఎలా మారతాయో వేచి చూడాలి’ అని రిప్లై ఇచ్చాడు. ఆది మాటల ప్రకారం చూస్తే.. శంబాల మూవీని వాయిదా వేసే ఆలోచనలో మూవీ లేదని స్పష్టం అవుతుంది. అఖండ 2 డిసెంబర్‌ 25నే వస్తుందా? లేదా? అనేది కూడా ఖచ్చితంగా తెలియదు. అన్ని అడ్డంకులు తొలిగి ముందైనా విడుదల కావోచ్చు.. లేదా మరిత ఆలస్యంగానైనా రావచ్చు. కాబట్టి ముందు ముందు పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాలి.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×