// // Aadi Sai Kumar- మరోసారి తండ్రి కాబోతున్న టాలీవుడ్‌ యంగ్‌ హీరో.. -->
E-Paper
Advertisement

Aadi Sai Kumar: మరోసారి తండ్రి కాబోతున్న టాలీవుడ్‌ యంగ్‌ హీరో..

Aadi Sai Kumar: మరోసారి తండ్రి కాబోతున్న టాలీవుడ్‌ యంగ్‌ హీరో..
Advertisement

Aadi Sai Kumar: హీరో ఆది సాయి కుమార్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సీనియర్‌ నటుడు, హీరో సాయి కుమార్‌ నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. డెబ్యూ చిత్రంతోనే మంచి విజయం అందుకున్నాడు. ‘ప్రేమ కావాలి‘ రొమాంటిక్‌ లవ్‌స్టో రీతో వచ్చిన యూత్‌లో యమ క్రేజ్‌ సంపాదించుకున్నాడు. తొలి సినిమా సూపర్‌ హిట్‌. ఆ తర్వాత చేసిన సినిమాలు కూడా బాక్సాఫీసు వద్ద పర్వాలేదనిపించాయి. ఈ మధ్య ఆదికి పెద్దగా కలిసి రావడంతో. అతడి ఖాతాలో మంచి హిట్‌ పడి చాలా కాలం అవుతుంది.

ప్రేమ కావాలితో హీరోగా ఎంట్రీ

Advertisement

ఇంకా చెప్పాలంటే ప్రేమ కావాలి తప్ప ఆది కెరీర్‌ చెప్పకొదగ్గ హిట్‌ లేదు. గ్యాప్‌ తీసుకుంటూ సినిమాలు చేస్తున్నా అవి పెద్దగా వర్కౌట్‌ కావడం లేదు. ప్రస్తుతం ఆది ‘శంబాల‘ చిత్రంతో బిజీగా ఉన్నాడు. డిసెంబర్‌లో ఈ చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో ఆది మూవీ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నాడు. ఈ సారైనా ఆదికి గట్టి పడాలని అభిమానులంత కోరుకుంటున్నారు. ఈ క్రమంలో ఆది ఫ్యాన్స్‌ ఓ గుడ్‌ న్యూస్‌ చెప్పాడు. తన భార్య మరోసారి గర్భవతి అయినట్టు వెల్లడించారు. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్‌ లో ఓ పోస్ట్‌ షేర్‌ చేశాడు. ఫ్యామిలీ ఫోటో షేర్‌ చేస్తూ మరొ కొత్త మెంబర్‌ వస్తున్నట్టు సర్‌ప్రైజ్ చేశాడు. త్వరలోనే అతడు మరోసారి తండ్రిగా కాబోతున్నానంటూ మురిసిపోయాడు.

ముగ్గురం.. నలుగురిగా..

“3+1 = 4. 2026 జనవరిలో మా కుటుంబలోకి కొత్త మెంబర్‌ రాబోతున్నారు. త్వరోనే మా ఇంట్లో మరోసారి బుడి బుడి అడుగులు పడబోతున్నాయి” అంటూ తీపి కబురు అందించాడు. దీంతో ఆది సాయి కుమార్‌కు అభిమానులు, నెటిజన్స్‌ నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. అతడి నెక్ట్స్‌ మూవీ శంబాల కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌ అది ఇలా ఊహించని గుడ్ న్యూస్‌ చెప్పాడంటూ అభిమానులు కామెంట్స్‌ చేస్తున్నారు. 2014లో అరుణ వెలూరి అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను వివాహం చేసుకున్నాడు ఆది. పెళ్లయిన ఏడాదికే వారికి కూతురు జన్మించింది. ప్రస్తుతం పాప వయసు ఏడేనిమిది ఏళ్లు ఉంటుంది. కూతురు పుట్టిన ఇన్నేళ్ల తర్వాత ఆది మరోసారి తండ్రి కాబోతుండటం విశేషం. వచ్చే జనవరిలో తన భార్య బిడ్డకు జన్మినవ్వబోతుందంటూ తెలిపాడు.

Advertisement

క్రిస్మస్‌ కానుకగా శంబాల విడుదల

కాగా 2011లో ‘ప్రేమకావాలి’ సినిమాతో ఆది హీరోగా పరిచయమయ్యాడు. యూత్‌ఫుల్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ చిత్రం యూత్‌ని బాగా ఆకట్టుకుంది. ఫలితంగా ఈ చిత్రం సూపర్‌ డూపర్‌ హిట్‌ అయ్యింది. రెండో సినిమా ‘లవ్ లీ’ కూడా హిట్ అయింది. తొలి రెండు మంచి విజయం సాధించడంతో అదే జోష్‌ ఆది బ్యాక్‌ టూ బ్యాక్‌ సినిమాలు చేశాడు. అలా వారసుడు, శశి వంటి చిత్రాలు చేశాడు. కానీ, ఆశించిన స్థాయిలో విజయం అందుకోలేకపోయాయి. దీంతో స్క్రిప్ట్‌ ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటున్న ఆది లాంగ్‌ గ్యాప్‌ తర్వాత గతేడాది షణ్ముఖ సినిమాతో వచ్చాడు. ఈ చిత్రం కూడా అంతంత మాత్రంగానే ఉంది. థియేటర్లలో ఇలా వచ్చి అలా వెళ్లిపోయింది. ఈ ఏడాది ‘షణ్ముఖ’ అనే చిత్రంతో వచ్చాడు. క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌లో ఈ మూవీ విడుదల కానుంది.

Also Read: Riddhi Kumar: ప్రభాస్‌ ‘ది రాజాసాబ్‌’లో హీరోయిన్‌ ఛాన్స్‌.. ప్రాంక్ అనుకున్నా..

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×