E-Paper
Advertisement

AA22xA6: బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ.. అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ విడుదలకు ముహూర్తం పిక్స్!

AA22xA6: బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ.. అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ విడుదలకు ముహూర్తం పిక్స్!
Advertisement

AA22xA6: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతూ పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో అల్లు అర్జున్ (Allu Arjun)ఒకరు. అల్లు వారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బన్నీ టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా పుష్ప (Pushpa) సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక పుష్ప2 సినిమాతో ఈయన అంతర్జాతీయ స్థాయిలో ఆదరణ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకున్న నేపథ్యంలో అల్లు అర్జున్ తదుపరి సినిమాపై కూడా అదే స్థాయిలో అంచనాలు ఉన్నాయి.

సైలెంట్ గా షూటింగ్ పూర్తి చేస్తున్న అట్లీ …

ప్రస్తుతం అల్లు అర్జున్ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ (Atlee)తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ ఇద్దరి కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమా AA22xA6 అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ బయట పెట్టకుండా చాలా సైలెంట్ గా షూటింగ్ పనులను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా దాదాపు 30% షూటింగ్ పనులను పూర్తి చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

క్రిస్మస్ పండుగకు ఫస్ట్ లుక్..

Advertisement

అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమా నుంచి అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయడానికి చిత్ర బృందం ముహూర్తం ఫిక్స్ చేశారని తెలుస్తుంది. అందుతున్న సమాచారం ప్రకారం డిసెంబర్ నెలలో క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నారట. ఇది కానీ నేపథ్యంలో వచ్చే ఏడాది జనవరి 26వ తేదీ ఈ సినిమా నుంచి అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయబోతున్నట్లు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అయితే ఇప్పటివరకు ఈ వార్తలపై చిత్ర బృందం ఎక్కడ అధికారకంగా వెల్లడించలేదు.

అపజయం ఎరుగని దర్శకుడిగా అట్లీ..

Advertisement

ఇక ఈ సినిమాపై అల్లు అర్జున్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూడటమే కాకుండా భారీ అంచనాలను కూడా పెట్టుకున్నారు. ఇక అట్లీ దర్శకుడిగా ఇదివరకు పలు సినిమాలకు పనిచేశారు. అయితే ఈయన చేసిన సినిమాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన విజయాలను సొంతం చేసుకున్నాయి. అపజయం ఎరుగని దర్శకుడుగా అట్లీ కోలీవుడ్ ఇండస్ట్రీలో ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే అట్లీ డైరెక్షన్లో అల్లు అర్జున్ అనే విషయం తెలియగానే అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఇక ఈ సినిమా కోసం అల్లు అర్జున్ ముంబైలోనే ఉంటున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో దీపికా పదుకొనే, మృణాళ్ ఠాకూర్, రష్మిక వంటి తదితరులు కీలకపాత్రలలో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు ఇలాంటి నేపథ్యంలోనే ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల కాబోతుందనే వార్త బయటకు రావడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Sharwanand: మోసపోయాను..మీ ఇష్టం వచ్చింది రాసుకోండి … శర్వా కామెంట్స్ విడాకుల గురించేనా?

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×