E-Paper
Advertisement

Allu Cinemas: గ్లోబల్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్.. ఘనంగా ఆ మూవీతో అల్లు సినిమాస్ ప్రారంభం!

Allu Cinemas: గ్లోబల్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్.. ఘనంగా ఆ మూవీతో అల్లు సినిమాస్ ప్రారంభం!
Advertisement

Allu Cinemas:ఈమధ్యకాలంలో ప్రేక్షకుడి అభిరుచి పూర్తిగా మారిపోయింది. సినిమాలో ఎలా అయితే కంటెంట్ ఉండాలని కోరుకుంటున్నారో.. ఆ సినిమా చూసే ప్రాంతం కూడా అంతే హుందాగా ఉండాలని కోరుకుంటున్నారు. ముఖ్యంగా ప్రపంచ స్థాయి సినిమా అనుభూతిని కోరుకునే ఆడియన్స్ ఈ మధ్యకాలంలో మరింత ఎక్కువయ్యారు. అలాంటి వారికి ఒక శుభవార్త అనే చెప్పాలి. హైదరాబాద్ లోని కోకాపేటలో ఏర్పాటు అవుతున్న అల్లు సినిమాస్ థియేటర్ దేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమా స్క్రీన్ తో చాలా గ్రాండ్గా మార్చి 19వ తేదీన ప్రారంభం కానున్నట్లు సమాచారం.

బ్రాండ్ ఓపెనింగ్ కి సిద్ధమవుతున్న అల్లు సినిమాస్ థియేటర్..

ముఖ్యంగా ఈ గ్రాండ్ ఓపెనింగ్ కి వీరు సెలెక్ట్ చేసుకున్న సినిమా థియేటర్ ఓపెనింగ్ పై మరింత హైప్ ను క్రియేట్ చేస్తోంది. విషయంలోకి వెళ్తే ప్రముఖ బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఆదిత్య ధర్ (Adithya Dhar) దర్శకత్వంలో రణవీర్ సింగ్ హీరోగా.. చైల్డ్ ఆర్టిస్ట్ సారా అర్జున్ హీరోయిన్ గా తొలి పరిచయంలో వచ్చిన చిత్రం ధురంధర్. గత ఏడాది డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సుమారుగా 1350 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది. అలాంటి ఈ సినిమాకు సీక్వెల్ ప్రకటించారు. పైగా ధురంధర్ 2 నుంచి టీజర్ కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనికి తోడు ఆదిత్యధర్ భార్య, ప్రముఖ హీరోయిన్ యామి గౌతమ్ కూడా ఒక పది నిమిషాల పాటు పవర్ఫుల్ పాత్రలో ఇందులో కనిపించనున్నట్లు సమాచారం .మార్చి 19 2026న విడుదలకు ఈ పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ సిద్ధమవుతోంది. ఈ సినిమా రిలీజ్ తోనే అల్లు సినిమాస్ లోని భారీ 75 అడుగుల వెడల్పు సినిమా స్క్రీన్ ప్రేక్షకుల ముందుకు రానుంది.

థియేటర్ ప్రత్యేకతలు..

Advertisement

థియేటర్ ప్రత్యేకతల విషయానికి వస్తే.. డాల్బీ విజన్, 3డీ ప్రొజెక్షన్ , డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టంతో పాటు ప్రపంచ స్థాయి సినిమాటిక్ అనుభవాన్ని ఇక్కడ అందించనున్నారు. ధురంధర్ : ది రివేంజ్ మొదటి భాగం భారీ విజయం సాధించిన నేపథ్యంలో రెండో భాగం మరింత భారీ ఎక్స్పెక్టేషన్స్ తో వస్తోంది. ఇప్పటికే భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా జరిగిందని సమాచారం .ఈద్, ఉగాది వంటి పండుగలను పురస్కరించుకొని ఈ సినిమా విడుదల కాబోతుండడంతో అంచనాలు మరింత పెరిగిపోయాయి.

ALSO READ:Priyanka Chopra: తెలుగు భాషపై గ్లోబల్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్.. ఆయన లేకుంటే?

హైదరాబాద్ సినీ ప్రియులకు గొప్ప బహుమతి..

Advertisement

ఇకపోతే అల్లూ స్టూడియోస్ క్యాంపస్ లోనే ఈ ప్రీమియం మల్టీప్లెక్స్ ఏర్పడుతున్న నేపథ్యంలో హైదరాబాదు పశ్చిమ భాగంలో సినీ ప్రియులకు ఇది భారీ బహుమతిగా మారనుంది. అంతే కాదు డాల్బీ సినిమా ఫార్మాట్లో దేశంలోని అతిపెద్ద స్క్రీన్ కావడం పైగా అధునాతన సౌకర్యాలతో ఈ థియేటర్ను ఏర్పాటు చేయడం ఇవన్నీ కలసి సినిమా చూడడానికి కొత్త లెవెల్ కు తీసుకెళ్తున్నాయని సినీ వర్గాలు కూడా అంచనా వేస్తున్నాయి. ఇకపోతే అన్ని అనుమతులు సమయానికి వస్తే మాత్రం ఈ సినిమాతోనే ఈ అల్లు సినిమాస్ గ్రాండ్ ఓపెనింగ్ ఉంటుందని సమాచారం.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×