E-Paper
Advertisement

ప్రసాద్ ల్యాబ్స్‌లో ఘనంగా “1=100” టీజర్ లాంచ్ !

ప్రసాద్ ల్యాబ్స్‌లో ఘనంగా “1=100” టీజర్ లాంచ్ !
Advertisement

1=100 Teaser Launch: శకుంతల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బాబా మైలవరం దర్శకత్వంలో వస్తున్న సరికొత్త సినిమా  “1=100”.ఇక ఈ సినిమా టీజర్ ని ఈవెంట్ ని హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో ఘనంగా నిర్వహించింది మూవీ టీమ్ ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత రిజ్వాన్ ముఖ్య అతిథిగా హాజరై, టీజర్‌ను ఆవిష్కరించి మూవీ యూనిట్ కి విషెస్ తెలిపారు.

ముఖ్య అతిథి రిజ్వాన్ మాట్లాడుతూ

Advertisement

ఈ సందర్భంగా ముఖ్య అతిథి రిజ్వాన్ మాట్లాడుతూ.. టీజర్ చాలా ప్రామిసింగ్‌గా ఉందని, విజువల్స్, మ్యూజిక్ టాప్ నాచ్‌గా ఉన్నాయని ప్రశంసించారు. దర్శకుడు బాబా మైలవరం ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించినట్లు అర్థమవుతోందని, ‘1=100’ అనే టైటిల్‌లోనే మంచి వైబ్రేషన్ ఉందని చెబుతూ.. ఈ చిత్రం శకుంతల ప్రొడక్షన్స్ సంస్థకు, చిత్ర బృందానికి పెద్ద విజయాన్ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు.

దర్శకుడు బాబా మైలవరం మాట్లాడుతూ

Advertisement

ఇక దర్శకుడు బాబా మైలవరం మాట్లాడుతూ.. తమ టీజర్ లాంచ్ కార్యక్రమానికి విచ్చేసి ఆశీర్వదించిన నిర్మాత రిజ్వాన్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనిల్ కుమార్ వేగూరు సినిమాటోగ్రఫీ, కెన్నీ చైతన్య సంగీతం, నందమూరి హరి ఎడిటింగ్ ఈ చిత్రానికి ప్రధాన బలంగా నిలిచాయని, రాజు ఎంటర్‌టైనర్స్, స్పార్కిల్ డాన్స్ స్టూడియో అందించిన సపోర్ట్ మరువలేనిదని పేర్కొన్నారు. టీజర్‌కు వస్తున్న భారీ రెస్పాన్స్ మా టీమ్ అందరిలో ఎంతో ఉత్సాహాన్ని నింపిందని, సినిమా చాలా బాగా వచ్చిందని చెబుతూ.. త్వరలోనే మరిన్ని వివరాలను, విడుదల తేదీని ప్రకటిస్తామని వెల్లడించారు.

రాజు ఎంటర్‌టైనర్స్, స్పార్కిల్ డాన్స్ స్టూడియో ఆధ్వర్యంలో జరిగిన ఈ గ్రాండ్ ఈవెంట్‌లో చిత్ర యూనిట్ సభ్యులతో పాటు పలువురు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు పాల్గొని బెస్ట్ విషెస్ తెలియజేశారు.

ఎలాంటి సంచలనాన్ని స్ప్రుష్టిస్తుందో !

ఇక టీజర్ రిలీజ్ అయిన కాసేపటికే సోషల్ మీడియాలో సాలిడ్  రెస్పాన్స్‌తో దూసుకుపోతోంది. హాలీవుడ్ రేంజ్ వెస్ట్రన్ స్టైల్ విజువల్స్, అదిరిపోయే యాక్షన్ ఎలిమెంట్స్, మెస్మరైజ్ చేసే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో టీజర్ కట్ చేసిన విధానం ప్రేక్షకులను, సినీ ప్రముఖులను విశేషంగా ఆకట్టుకుంటూ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది.చూడాలి మరి త్వరలో రానున్న ఈ సినిమా చిన్న సినిమాల్లో ఎలాంటి సంచలనాన్ని స్ప్రుష్టిస్తుందో !

సాంకేతిక నిపుణులు:

బ్యానర్: శకుంతల ప్రొడక్షన్స్
దర్శకత్వం: బాబా మైలవరం
డీఓపీ:అనీల్ కుమార్ వేగూరు
సంగీతం: కెన్నీ చైతన్య
ఎడిటర్: నందమూరి హరి
కొరియోగ్రఫీ:సూర్యాస్ మాస్టర్, జోజో
ఫైట్స్: కృష్ణ ఎస్.ఎం. రాజు, డైమండ్ వెంకట్
ఆర్ట్ డైరెక్టర్: నానాజీ
పోస్ట్ ప్రొడక్షన్: డిజిక్వెస్ట్
PRO: శ్రీపాల్

also read :తారక్ ,బన్నీలు సీఎం సీటుపై కన్నేశారా ? ఏపీలో సరికొత్త ‘పొలిటికల్ మల్టీస్టారర్’!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×