E-Paper
Advertisement

Asparagus: తోటకూర ప్రయోజనాలు చూస్తే ఆశ్చర్యపోతారు

Asparagus: తోటకూర ప్రయోజనాలు చూస్తే ఆశ్చర్యపోతారు
Advertisement

Asparagus : కూరగాయల కంటే ఆకుకూరల్లో ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ఇందులో ఉండే పోషకాలు మన శరీరానికి ఎంతో మేలుని చేకూరుస్తాయి. నిత్యం ఆకుకూరలను తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. అయితే ఈ ఆకుకూరల్లో తోటకూర రారాజు. తోటకూరలో ఎన్నో పోషక విలువలు ఉంటాయి. ఈ తోటకూరలో చాలా రకాలు ఉన్నప్పటికీ అన్ని రకాల లోనూ ఒకే రకమైన పోషకాలు మనకు అందుతాయి. ఈ తోటకూరతో చేసే వంటకాలు రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా కలుగజేస్తాయి. తోటకూర తినడానికి చాలామంది ఇష్టపడరు. అసలు ఇందులో పసరు ఎక్కువగా ఉంటుందని అనుకుంటుంటారు. కానీ అది ఏ మాత్రం నిజం కాదు. తోటకూర అలా కనిపిస్తుంది. కానీ అది తింటే మన ఆరోగ్యానికి ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఈ తోటకూరలో మన శరీరానికి అవసరమైన పోషకాలు, కంటి ఆరోగ్యానికి కీలకమైన విటమిన్ ఏ అందుతుంది. అంతేకాకుండా విటమిన్ కె, సి, బి6, ఫొలైట్‌, కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఈ తోటకూర మన శరీరానికి కావలసిన శక్తిని అందిస్తుంది. ఈ ఆకుల్లో ఉండే మాంగనీస్, కాపర్ , క్యాల్షియం, పొటాషియం, ఫాస్పరస్ వల్ల మనం సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారుతాము. తోటకూరలో ఐరన్ శాతం అధికంగా ఉండటం వల్ల రక్తలేమి సమస్య నుంచి బయటపడేస్తుంది. ఈ రక్తలేమి సమస్య ఉన్నవారు ప్రతిరోజు తోటకూరలు భోజనంలో భాగంగా చేసుకుంటే మంచిది. ఆయుర్వేదిక్ మందుల్లో కూడా ఈ ఆకుల రసాన్ని ఉపయోగిస్తారు. బరువు తగ్గాలనుకునేవారు రోజువారి డైట్లో తోటకూర తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. తోటకూరలో ఉండే ఫైబర్ మన జీర్ణ క్రియను మెరుగుపరిచి కొవ్వు శాతాన్ని తగ్గిస్తుంది. ఇందులోని విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దీంతో సీజన్ మారినా గాని వచ్చే వైరస్‌ల నుంచి మనం బయటపడవచ్చు. మాంసంతో సమానంగా ప్రోటీన్లు తోటకూరలో ఉంటాయి. ఈ తోటకూర తింటే కండరాలు దృఢంగా తయారవుతాయి. నిత్యం వ్యాయామం చేసేవారు తోటకూరను తినాలి. తోటకూరలో క్యాల్షియం సమృద్ధిగా ఉంటుంది. దీంతో ఎముకలు దృఢంగా మారుతాయి. ఎదిగే పిల్లలు తోటకూర తింటే ఎదుగుదల సక్రమంగా ఉంటుంది. అంతేకాకుండా షుగర్ వ్యాధిగ్రస్తులు తోటకూర తింటే నెమ్మదిగా జీర్ణమవుతుంది. శరీరానికి కావలసిన శక్తి కూడా అందుతుంది. రక్తంలో గ్లూకోస్ అదుపులో ఉంచుతుంది. తోటకూరను వేపుడుగా కాకుండా కూరగా చేసుకుంటే పోషకాలు మన శరీరానికి మరింత అందుతాయని నిపుణులు అంటున్నారు.

Tags

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×