E-Paper
Advertisement

Yellow Watermelon Benefits: పసుపు పుచ్చకాయలకు పెరిగిన డిమాండ్.. బెనిఫిట్స్ తెలిస్తే మీరూ వదలరు!

Yellow Watermelon Benefits: పసుపు పుచ్చకాయలకు పెరిగిన డిమాండ్.. బెనిఫిట్స్ తెలిస్తే మీరూ వదలరు!
Advertisement

Yellow Watermelon Benefits: వేసవి తాపాన్ని తీర్చడమే కాకుండా, శరీరానికి బోలెడంత శక్తినిచ్చే అద్భుతమైన ఫ్రూట్ పసుపు పుచ్చకాయ. సాధారణంగా మనం ఎర్రటి పుచ్చకాయలనే ఇష్టంగా తింటాం కానీ, ఈ పసుపు రంగు పుచ్చకాయలు ఇప్పుడు ఆరోగ్య ప్రియులను అమితంగా ఆకర్షిస్తున్నాయి. రంగులోనూ, రుచిలోనూ వైవిధ్యంగా ఉండే ఈ పండులో దాగున్న ఆరోగ్య రహస్యాలు తెలిస్తే మీరు కూడా రోజూ తినేస్తారు.

ఇన్‌స్టంట్ ఎనర్జీ ఇస్తుంది..

చూడటానికి తేనె రంగులో మెరిసిపోయే ఈ పుచ్చకాయలో పోషకాలు చాలా మెండుగా ఉంటాయి. దీనిలో ఉండే సి విటమిన్ శరీరానికి ఓ రక్షణ కవచంలా పనిచేస్తుంది. తరచుగా వచ్చే జలుబు, దగ్గు వంటి ఇన్ఫెక్షన్లను దూరం పెట్టి, మన రోగనిరోధక వ్యవస్థను ఇది బలోపేతం చేస్తుంది. ముఖ్యంగా ఎండలు మండిపోయే కాలంలో నీరసం రాకుండా, తక్షణ శక్తిని ఇవ్వడంలో దీనికి సాటిలేదు.

Advertisement

Also Read: మనుషులకే కాదు.. ఈ జంతువులకూ ఉన్నాయి కమ్యూనికేషన్ స్కిల్స్!

యవ్వనంగా కనిపిస్తారు..

పసుపు పుచ్చకాయలో ఉండే బీటా కెరోటిన్ కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. రేచీకటి వంటి సమస్యలు రాకుండా చూడటమే కాకుండా, వయస్సుతో పాటు వచ్చే కంటి చూపు మందగించడాన్ని ఇది అరికడుతుంది. ఇక చర్మం విషయానికొస్తే.. ఎండ వేడికి చర్మం కమిలిపోకుండా కాపాడటంతో పాటు, సహజమైన కాంతిని ఇస్తుంది. యవ్వనంగా కనిపించాలనుకునే వాళ్లు తరచూ ఈ ఎల్లో వాటర్‌మెలన్ తినొచ్చు.

బోలెడు ప్రయోజనాలు..

Advertisement

శరీరంలో ద్రవాల సమతుల్యతను కాపాడటంలో ఈ పండు కీలక పాత్ర పోషిస్తుంది. దాదాపు తొంభై శాతం పైగా నీటిని కలిగి ఉండటం వల్ల డీహైడ్రేషన్ సమస్య తలెత్తదు. దీనిలో ఉండే పొటాషియం రక్తపోటును అదుపులో ఉంచి, గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే, పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. మలబద్ధకం వంటి ఇబ్బందులను తొలగించి, కడుపును తేలికగా ఉంచుతుంది.

Also Read: బరువు తగ్గాలన్నా, గ్లాసీ స్కిన్ కావాలన్నా.. రోజుకో దానిమ్మ తినాల్సిందేనా?

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×