E-Paper
Advertisement

ఎద్దులు ఎరుపు రంగు చూస్తే వెంటపడతాయా? అసలు నిజం తెలిస్తే.. షాక్ అవుతారు!

ఎద్దులు ఎరుపు రంగు చూస్తే వెంటపడతాయా? అసలు నిజం తెలిస్తే.. షాక్ అవుతారు!
Advertisement

Do bulls hate red color:  ఈ ప్రపంచంలో మనం నిజమని నమ్మే చాలా విషయాల వెనక పెద్ద పెద్ద అపోహలు దాగుంటాయి. అలాంటి వాటిలో టాప్ ప్లేస్‌లో ఉండేది”ఎద్దులకు లేదా గేదెలకు ఎరుపు రంగు చూస్తే కోపం వస్తుంది” అనే నమ్మకం. ఎవరైనా ఎర్రటి బట్టలు వేసుకుని రోడ్డు మీదకు వెళ్తుంటే.. “ఒరేయ్! అక్కడ ఎద్దు ఉంది, కాస్త చూసి వెళ్ళు, నిన్ను పొడిచేస్తుంది” అని పెద్దలు హెచ్చరించడం మనం వినే ఉంటాం. ముఖ్యంగా స్పానిష్ బుల్‌ఫైట్ లో ఆ ఫైటర్ ఒక పెద్ద ఎర్రటి క్లాత్ (దానిని ములేటా అంటారు) ఊపుతూ ఎద్దును రెచ్చగొట్టడం చూసి ఇది వంద శాతం నిజం అని ఫిక్స్ అయిపోయాం. కానీ.. ఇక్కడే మనం పప్పులో కాలేసాం.

కలర్ బ్లైండ్‌నెస్:

జీవ శాస్త్రం ప్రకారం.. ఆవులు, ఎద్దులు, గేదెలు వంటి పశువులకు “డిక్రోమాటిక్ విజన్” ఉంటుంది. అంటే వాటి కంటి నిర్మాణంలో కేవలం రెండు రకాల కలర్ రిసెప్టర్లు మాత్రమే ఉంటాయి. మనలాగా వాటికి రంగుల ప్రపంచం అద్భుతంగా కనిపించదు. ముఖ్యంగా వాటికి ‘కలర్ బ్లైండ్‌నెస్’ ఉంటుంది. సైన్స్ నిరూపించిన నిజం ఏంటంటే.. ఎద్దులకు ఎరుపు, ఆకుపచ్చ రంగుల మధ్య అస్సలు తేడా తెలియదు. వాటి దృష్టిలో ఎరుపు రంగు అనేది ఒక రకమైన బూడిద రంగు లేదా కాస్త ముదురు రంగులా మాత్రమే కనిపిస్తుంది. మరి అలాంటప్పుడు రంగును చూసి అవి కోపడతాయనే మాటకు అర్థమే లేదు కదా!

Advertisement

మరి ఎరుపు రంగు బట్టలను చూసి ఎందుకు అంతలా వెంటపడతాయి?

రంగు సమస్య కానప్పుడు, అసలు సమస్య ఎక్కడ ఉంది? సమాధానం చాలా సింపుల్ “కదలిక”. బుల్‌ఫైట్‌లో ఆ మటాడోర్ ప్రశాంతంగా నిలబడడు. ఆ ఎర్రటి క్లాత్‌ను పదే పదే గాల్లో విదిలిస్తూ.. వేగంగా కదుపుతూ ఉంటాడు. ఎద్దులకు రంగులు తెలియకపోయినా, వాటి కంటికి వేగంగా కదిలే వస్తువులు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. పైగా.. ఆ రింగులోకి తెచ్చే ముందే ఎద్దును ఒక చీకటి గదిలో ఉంచి, తీవ్రమైన ఒత్తిడికి, కోపానికి గురి చేస్తారు. అలా ఆల్రెడీ ఫుల్ ఫ్రస్ట్రేషన్‌లో ఉన్న ఎద్దు ముందుకు రాగానే.. దాని కళ్ళ ముందు ఒక పెద్ద వస్తువు అలా వేగంగా కదులుతూ ఉండేసరికి, అది తనను అటాక్ చేయడానికి వస్తున్న శత్రువుగా భావిస్తుంది. ఆ కదలిక ఇచ్చే విసుగు, కోపం వల్లే అది ఆ క్లాత్ వైపు దూసుకొస్తుంది తప్ప, క్లాత్ ఎరుపు రంగులో ఉందని కాదు.

Advertisement

Also Read: వర్షాకాలంలో జిడ్డు చర్మం, మొటిమలతో ఇబ్బంది పడుతున్నారా?

ఈ విషయాన్ని ఊరికే చెప్పడం లేదు, సైంటిస్టులు దీనిపై పక్కాగా ప్రయోగాలు చేశారు. ప్రసిద్ధ ‘మిత్ బస్టర్స్’షోలో దీనిపై ఒక క్రేజీ రీసెర్చ్ చేశారు. వాళ్ళు రింగులో మూడు వేర్వేరు రంగుల (ఎరుపు, నీలం, తెలుపు)క్లాత్ లను కదలకుండా పెట్టారు. అప్పుడు ఎద్దు ఏ రంగును కూడా పట్టించుకోకుండా ప్రశాంతంగా ఉంది. కానీ.. ఎప్పుడైతే ఆ మూడు క్లాత్ లను వేగంగా కదపడం ప్రారంభించారో.. ఎద్దు ఏ రంగు అనే తేడా లేకుండా.. ఏది వేగంగా కదిలితే దాని వైపు దూసుకెళ్ళింది. దీన్ని బట్టి ఎద్దులకు రంగుతో పని లేదని, కేవలం అగ్రెసివ్ మూవ్‌మెంట్స్ మాత్రమే వాటిని రెచ్చగొడతాయని వంద శాతం ప్రూవ్ అయింది. మీరు ఎరుపు రంగు బదులు నలుపు, పసుపు, లేదా ఆకుపచ్చ క్లాత్ ఊపినా అవి అలాగే రియాక్ట్ అవుతాయి.

సో బాస్.. ఇదీ అసలు మ్యాటర్! ఇకపై ఎవరైనా ఎర్రటి క్లాత్ చూసి గేదెలు, ఎద్దులు వెంటపడతాయి అని చెబితే, అది కేవలం ఒక అపోహ మాత్రమే అని వాళ్లకి సైంటిఫిక్ గా వివరించండి. జంతువుల చుట్టూ ఉన్న ఇలాంటి ఇంట్రెస్టింగ్ మిత్స్ తెలుసుకోవడం చాలా ముఖ్యం.

Tags

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×