E-Paper
Advertisement

White Tea Benefits: బ్లాక్ గ్రీన్‌లను మించి ‘వైట్ టీ’ హెల్త్ సీక్రెట్స్.. అందం, ఆరోగ్యం రెండూ ఒకే కప్పులో!

White Tea Benefits: బ్లాక్ గ్రీన్‌లను మించి ‘వైట్ టీ’ హెల్త్ సీక్రెట్స్.. అందం, ఆరోగ్యం రెండూ ఒకే కప్పులో!
Advertisement

White Tea Benefits: ఇప్పటివరకు టీ అంటే బ్లాక్ టీ, గ్రీన్ టీ అనుకుంటూ వచ్చాం. కానీ ఇప్పుడు చాయ్ ప్రపంచంలో కొత్త స్టార్ ఎంట్రీ ఇచ్చేసింది. అదే ‘వైట్ టీ’. ఇంకా ప్రపంచానికి అంతగా పరిచయం లేని ఈ వైట్ టీ.. అద్భుతమైన యాంటీ‌ ఆక్సిడెంట్లతో ఆరోగ్యాన్ని కాపాడుతూ, అందాన్ని కూడా రెట్టింపు చేస్తుంది. బరువు తగ్గడం నుంచి యాంటీ ఏజింగ్ వరకూ.. చిన్న కప్పులో పెద్ద ప్రయోజనాలు దాగి ఉన్నాయి. అందం, ఆరోగ్యం రెండూ ఒకే కప్పులో దొరికితే ఎవరు తిరస్కరిస్తారు చెప్పండి! ఈ క్రమంలో వైట్ టీ వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.

ఇమ్యూనిటీ పెరుగుతుంది:

వైట్ టీలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరాన్ని కీటకాలు, వైరస్‌లు నుండి రక్షిస్తాయి. ఫ్రీ రాడికల్స్ దాడిని అడ్డుకుని సెల్స్‌ను ఆరోగ్యంగా ఉంచుతాయి.

గుండె ఆరోగ్యం పదిలం:

Advertisement

ఈ వైట్ టీ రక్తంలో కొవ్వును తగ్గించి, బీపీని కంట్రోల్‌లో ఉంచడంలో సహాయపడుతుంది. ఇవి హార్ట్ సంబంధిత రిస్క్‌లను తగ్గించడంలో కీలకంగా ఉపయోగపడతాయి.

బరువు నియంత్రణలో:

మెటాబాలిజం రేటును పెంచే కెటెకిన్స్ వైట్ టీలో ఎక్కువగా ఉంటాయి. కాబట్టి.. ఫ్యాట్‌ బర్నింగ్ ఫాస్ట్ అవుతుంది. డైట్‌లో ఉన్నవారికి ఈ వైట్ టీ సూపర్ కాంబో.

అందం రెట్టింపు:

Advertisement

చర్మంపై ఉండే చిన్న ముడతలు, పిగ్మెంటేషన్, డల్నెస్‌ను తగ్గించడంలో వైట్ టీ ఎంతగానో సహాయపడుతుంది. కోలాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహించడంతో స్కిన్ ఫిర్మ్, గ్లోయింగ్‌గా మారుతుంది.

మెదడు ఆరోగ్యానికి బూస్ట్:

వైట్ టీలోని L-theanine అనే అమినో యాసిడ్ కారణంగా మెమరీ, ఫోకస్ ఇంప్రూవ్ అవుతాయి. స్ట్రెస్ తగ్గి, మానసిక ప్రశాంతత కలుగుతుంది.

దంతాల సంరక్షణ:

ఈ వైట్ టీలోని ఫ్లోరైడ్, టానిన్స్, కేటెకిన్స్ కారణంగా దంతాల్లో జర్మ్స్ పెరుగకుండా కాపాడుతుంది. ఈ టీతో దంతాల గమ్ ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా.. మీ శ్వాస కూడా తాజాగా ఉంటుంది.

చక్కెర నియంత్రణలో:

వైట్ టీ రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది. డయాబెటిస్ రిస్క్ తగ్గేందుకు ఇది ఒక మంచి సహజ పద్ధతి.

క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది:

వైట్ టీ మన శరీరంలో సెల్ డ్యామేజ్‌ను తగ్గించడం ద్వారా కొన్నిరకాల క్యాన్సర్‌లను నిరోధించడంలో సహాయపడుతుందని తాజా పరిశోధనలు సూచిస్తున్నాయి.

వైట్ టీ తయారీ ఇలా..

ముందుగా మీకు కావాల్సినంత నీటిని తీసుకుని మరిగించాలి. ఇది 70% నుంచి 80% వరకు మరిగాక స్టవ్ ఆఫ్ చేయాలి. తర్వాత ఓ కప్పులో ఒటీస్పూన్ వైట్ టీ లీవ్స్ వేసి, వాటిపై గోరువెచ్చని నీటిని పోయాలి. దాన్ని సుమారు 3 నుంచి 5 నిమిషాల పాటు మూతపెట్టి నాననివ్వండి. తర్వాత వడగట్టి నెమ్మదిగా తాగితే సరిపోతుంది. అయితే ఈ వైట్ టీలో పాలు గాని చక్కెర గాని కలపకూడదు. అప్పుడే వైట్ టీలో దాగున్న ఆరోగ్య ప్రయోజనాలు పొందగలుగుతారు. ఒకవేళ తీపి కావాలనుకుంటే.. కొద్దిగా తేనె కలుపుకోవచ్చు. అది కూడా చల్లారిన తర్వాతే. ఇలా చేసుకున్న వైట్ టీని రోజుకు ఒకటి లేదా రెండు కప్పులు తాగితే మంచి ఫలితాలు పొందవచ్చు.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×