E-Paper
Advertisement

Micro Cheating: చిన్న పొరపాటే కదా అని వదిలేయకండి.. మీ రిలేషన్‌షిప్‌ను ముక్కలు చేసే ‘మైక్రో చీటింగ్’ లక్షణాలు ఇవే!

Micro Cheating: చిన్న పొరపాటే కదా అని వదిలేయకండి.. మీ రిలేషన్‌షిప్‌ను ముక్కలు చేసే ‘మైక్రో చీటింగ్’ లక్షణాలు ఇవే!
Advertisement

Micro Cheating: వైవాహిక జీవితం అంటేనే ఒకరిపై ఒకరికి ఉండే నమ్మకం. అయితే.. నేటి డిజిటల్ యుగంలో ఆ నమ్మకాన్ని దెబ్బతీసేలా ‘మైక్రో చీటింగ్’ అనే కొత్త సమస్య దంపతుల మధ్య చిచ్చు పెడుతోంది. ఇది వినడానికి చిన్న విషయమే అనిపించినప్పటికీ.. తెలియకుండానే భార్యాభర్తల బంధాన్ని బలహీనపరుస్తోంది. ఈ నేపథ్యంలో అసలు మైక్రో చీటింగ్ అంటే ఏంటి? పచ్చని కాపురంలో ఎలాంటి గొడవలను సృష్టిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

మైక్రో చీటింగ్ అంటే ఏమిటి?

చాలామందికి ఇది అక్రమ సంబంధం కాదని అనిపించవచ్చు. కానీ భాగస్వామికి తెలియకుండా ఇతరులతో పరిమితులు దాటి ప్రవర్తించడమే మైక్రో చీటింగ్. అంటే.. పాత ప్రేమికులకు రహస్యంగా మెసేజ్‌లు పంపడం, సోషల్ మీడియాలో ఎవరో తెలియని వ్యక్తుల ఫొటోలకు లైకులు, కామెంట్లు పెట్టడం లేదా ఆఫీసులో కొలీగ్స్‌తో అవసరానికి మించి సాన్నిహిత్యం ప్రదర్శించడం వంటివన్నీ దీని కిందకే వస్తాయి. ఈ విషయంలో ‘మేం జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే’ అని పైకి చెప్పుకున్నా.. లోలోపల ఒకరికి తెలియకుండా మరొకరు చేసే ఇలాంటి పనులే నమ్మకాన్ని దెబ్బతీస్తాయి.

Advertisement

Also Read: చలిగా ఉందని వ్యాయామం మానేస్తున్నారా? ప్రమాదంలో పడినట్లేనని హెచ్చరిస్తున్న నిపుణులు!

నమ్మకం సన్నగిల్లితే:

సాధారణంగా ఇలాంటి పనులు చేసేవారు ‘దీనిలో తప్పేముంది?’ అని తమను తాము సమర్థించుకుంటారు. కానీ, భాగస్వామికి ఈ విషయాలు తెలిసినప్పుడు వారు తీవ్రమైన మానసిక వేదనకు గురవుతారు. ఒకరికొకరు తోడుగా ఉండాల్సిన చోట, మూడో వ్యక్తికి ప్రాధాన్యత ఇస్తున్నారనే భావన వారి మధ్య దూరాన్ని పెంచుతుంది. ఒక్కసారి నమ్మకం పోయిందంటే.. ఆ బంధంలో ప్రేమ తగ్గి అనుమానం మొదలవుతుంది. ఈ చిన్న అబద్ధాలే చిలికి చిలికి గాలివానలా మారి, చివరకు విడాకుల వరకు దారితీస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

సంబంధాన్ని కాపాడుకోవడం ఎలా?

Advertisement

మైక్రో చీటింగ్ అనే ప్రమాదం నుండి బయటపడాలంటే.. దంపతుల మధ్య దాపరికం లేని మాటలు చాలా అవసరం. మీకు ఏ విషయాలు నచ్చడం లేదో, ఏ ప్రవర్తన మిమ్మల్ని బాధపెడుతుందో మీ పార్టనర్‌తో దాని గురించి చర్చించుకోవాలి. స్నేహానికి, సాన్నిహిత్యానికి మధ్య ఉండాల్సిన ఆ చిన్న గీత ఎక్కడో ఇద్దరూ కలిసి కూర్చుని మాట్లాడుకోవాలి. ఒకరి భావాలను మరొకరు గౌరవిస్తూ.. జీవితంలో తమ భాగస్వామికి ఇచ్చే ప్రాధాన్యతను నిరూపించుకున్నప్పుడే ఏ బంధమైనా నిలబడుతుంది.

Also Read: డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం ఉండదు.. వారంలో రెండుసార్లు తలకాయ కూర తింటే జరిగేది ఇదే!

 

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×