E-Paper
Advertisement

If You Eat Curd in Winter:శీతాకాలంలో పెరుగు తింటే ఏమవుతుంది?

If You Eat Curd in Winter:శీతాకాలంలో పెరుగు తింటే ఏమవుతుంది?
Advertisement

If You Eat Curd in Winter:ప్రస్తుత కాలంలో మన ఆహారంలో పెరుగు తప్పనిసరిగా మారింది. కొద్ది మంది మాత్రమే పెరుగును ఇష్టపడరు. కొందరికైతే భోజనం చివ‌ర‌లో కొంచెం పెరుగ‌న్నం లేక‌పోతే భోజ‌నం చేసిన‌ట్టుకూడా ఉండ‌దు. మంచి గడ్డ పెరుగు వేసుకుని తింటే ఆ మజానే వేరు. పెరుగుతో రుచితో పాటు ఆరోగ్యం కూడా వస్తుంది. అయితే చ‌లికాలంలో చాలామంది పెరుగును దూరం పెడుతారు. జలుబు, దగ్గు వంటి శ్వాసకోశ సమస్యలు వస్తాయని భయాందోళన చెందుతారు. వైద్య నిపుణులు మాత్రం అది ఒట్టి అపోహేన‌ని అంటున్నారు. చ‌లికాలంలో పెరుగు తింటే న‌ష్టం లేద‌ని చెబుతున్నారు. పెరుగు తిన‌డంతో శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో మ‌న శ‌రీరం అనారోగ్య సమస్యలను చురుగ్గా ఎదుర్కొంటుంది. నిజానికి జ‌లుబు, ద‌గ్గు లాంటి సమస్యలను పెరుగు తగ్గిస్తుంది. చలికాలంలో కొంత‌మందిని మ‌ల‌బ‌ద్దకం వేధిస్తుంది. పెరుగులోని పోషకాలు మలబద్ధకాన్ని పోగొడతాయి. పెరుగులో కాల్షియం అధికంగా ఉండటం వల్ల శరీర కండరాలకు బలం వస్తుంది. ఎముకలు కూడా ధృడంగా మారుతాయి. దంత సమస్యలు కూడా దరిచేరవు. పెరుగును ప్రతిరోజు తినడం వల్ల రక్తంలో కొవ్వు స్థాయిలు బాగా తగ్గుతాయి. దీనివల్ల హార్ట్ ఎటాక్‌లు వ‌చ్చే అవ‌కాశం త‌గ్గుతుంది. రక్తపోటును కూడా పెరుగు కంట్రోల్‌ చేస్తుంది. అయితే పెరుగును పగటిపూట మాత్రమే తినాలని వైద్యులు చెబుతున్నారు. రాత్రి తింటే మ్యూకస్‌ పేరుకునే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఆస్తమా ఉన్నవారు రాత్రి సమయంలో పెరుగుకు దూరంగా ఉండాలని చెబుతున్నారు.

Tags

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×