E-Paper
Advertisement

Blood Stool: మలం నుంచి రక్తం పడుతోందా? పైల్స్ కాదు.. ఈ భయానక వ్యాధి కూడా కావచ్చు, జాగ్రత్త

Blood Stool: మలం నుంచి రక్తం పడుతోందా? పైల్స్ కాదు.. ఈ భయానక వ్యాధి కూడా కావచ్చు, జాగ్రత్త
Advertisement

Blood Stool: సాధారణంగా మల విసర్జనలో రక్తం కనిపించగానే చాలామంది మొదట భయపడతారు. తర్వాత అరే.. ఇది ఫైల్స్ అయి ఉంటుందిలే అనుకుని నిర్లక్ష్యం చేస్తుంటారు. ఇదే పెద్ద తప్పు. ఎందుకంటే.. మలం నుంచి రక్తం పడటం అనేది కేవలం పైల్స్‌కు సంబంధించిన లక్షణం మాత్రమే కాదు. కొన్ని సందర్భాల్లో ఇది ప్రాణాంతక వ్యాధులకు తొలి హెచ్చరిక కూడా కావచ్చు. రక్తం రంగు, మలం స్వభావం, శరీరంలో వచ్చే ఇతర మార్పులను గమనించకపోతే పరిస్థితి చేయి దాటే ప్రమాదం ఉంది.

మరింకేం కారణం కావొచ్చు?

మలం నుంచి రక్తం పడితే సాధారణంగా మలద్వారం దగ్గర సమస్య ఉందని అర్థం. పైల్స్, ఆనల్ ఫిషర్స్ ఇవి సాధారణ కారణాలు. అయితే ఇదే లక్షణం రెక్టమ్ లేదా కాలన్‌లో పాలిప్స్ ఉన్నప్పుడు కూడా కనిపిస్తుంది. పాలిప్స్ తొలిదశలో ప్రమాదకరం కాకపోయినా.. కాలక్రమేణా అవే క్యాన్సర్‌గా మారే అవకాశం ఉంటుంది.

రక్తం రంగు మారితే అర్థమిదే:

Advertisement

మలం రంగు ముదురు ఎర్రగా లేదా గోధుమ రంగులో ఉంటే.. రక్తస్రావం పేగుల లోపల నుంచి జరుగుతోందని అర్థం. ఇది ఇన్‌ఫ్లమేటరీ బౌల్ డిసీజ్(IBD), అల్సరేటివ్ కొలైటిస్, క్రోన్స్ డిసీజ్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు సంకేతం కావచ్చు. ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు చికిత్స తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తే.. జీవితాంతం మందుల మీదే ఆధారపబి బతకాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

అలాగే మలం నల్లగా, తారు లాగా ఉండి దుర్వాసన వస్తే.. పరిస్థితి మరింత ప్రమాదకరం. ఇది సాధారణంగా స్టమక్ అల్సర్, లోపలి బ్లీడింగ్ లేదా లివర్ సమస్యల వల్ల జరుగుతుంది. ఇలాంటి సందర్భాల్లో ఆలస్యం చేస్తే రక్తహీనత, స్పృహ కోల్పోవడం వంటి ప్రమాదాలు తలెత్తుతాయి.

ఈ లక్షణాలు కనిపిస్తే..

Advertisement

* మలం నుంచి రక్తంతో పాటు
* కారణం లేకుండా బరువు తగ్గడం
* ఎక్కువ అలసట, నీరసం
* పొట్ట నొప్పి, మలబద్ధకం లేదా విరేచనాలు
* ఆకలి తగ్గిపోవడం
* తరచూ రక్తహీనత

పై లక్షణాలన్నీ కనిపిస్తే.. నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం. ఎందుకంటే అది పెద్దపేగు(కోలన్) క్యాన్సర్ వంటి భయానక వ్యాధి సూచన కూడా కావచ్చు. ముఖ్యంగా 40 ఏళ్లు దాటినవారు ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకూడదంటున్నారు ఆరోగ్య నిపుణులు.

నిపుణులు ఏమంటున్నారంటే:

మలం నుంచి రక్తం ఒకటి రెండు సార్లు వచ్చినా సరే నిర్లక్ష్యం చేయకూడదు. స్వయంగా మందులు వాడటం, ఆయుర్వేదం లేదా హోమ్ రెమెడీస్‌పై ఆధారపడటం ప్రమాదకరం. అవసరమైతే స్టూల్ టెస్ట్, స్కాన్, కొలొనోస్కోపీ వంటి పరీక్షల ద్వారా అసలు కారణాన్ని గుర్తించాలి. తొలిదశలో గుర్తిస్తే.. చాలా వ్యాధులు పూర్తిగా నయం అయ్యే అవకాశం ఉంటుంది. పైల్స్ అనుకుని వదిలేసిన సమస్యే.. తర్వాత క్యాన్సర్‌గా బయటపడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి.. మలం నుంచి రక్తం పడితే సిగ్గు, భయం వదిలేసి వెంటనే వైద్యులను సంప్రదించడం మీ ప్రాణాలను కాపాడే మార్గం అని చెబుతున్నారు.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×