E-Paper
Advertisement

చిన్న తలనొప్పికి కూడా ట్యాబ్లెట్ వేస్తున్నారా? మీ లివర్ ప్రమాదంలో ఉన్నట్టే!

చిన్న తలనొప్పికి కూడా ట్యాబ్లెట్ వేస్తున్నారా? మీ లివర్ ప్రమాదంలో ఉన్నట్టే!
Advertisement

Paracetamol: మనకు చిన్న తలనొప్పి వచ్చినా, ఒళ్ళు నొప్పులుగా ఉన్నా వెంటనే గుర్తొచ్చే మందు ‘పారాసెటమాల్’. డాక్టర్ సలహా లేకపోయినా మెడికల్ షాపుకు వెళ్లి మరీ తెచ్చేసుకుంటాం. ఇది తొందరగా పనిచేసే ట్యాబ్లెట్ అని మన నమ్మకం. కానీ.. ఏ మందైనా పరిమితికి మించితే విషమే అవుతుంది. ముఖ్యంగా పారాసెటమాల్‌ను అలవాటుగా మార్చుకుని  తరచుగా వాడితే.. అది మీ శరీరంలోని ముఖ్య అవయవాలను సైలెంట్‌గా దెబ్బతీస్తుంది. అసలు పారాసెటమాల్ రెగ్యులర్‌గా వాడటం వల్ల వచ్చే ముప్పులేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

పారాసెటమాల్ రెగ్యులర్‌గా వాడితే వచ్చే సైడ్ ఎఫెక్ట్స్:

Advertisement

1.లివర్ డ్యామేజ్ (కాలేయానికి ముప్పు):
పారాసెటమాల్ వల్ల కలిగే అతిపెద్ద ప్రమాదం కాలేయం దెబ్బతినడం. మనం తీసుకునే మందును కాలేయం ఫిల్టర్ చేస్తుంది. మోతాదుకు మించి వాడినప్పుడు లివర్‌పై ఒత్తిడి పెరిగి ‘హెపాటోటాక్సిసిటీ’కి దారి తీస్తుంది. ఇది తీవ్రమైతే లివర్ ఫెయిల్యూర్ అయ్యే అవకాశం కూడా ఉంది.

2. కిడ్నీ సమస్యలు:
దీర్ఘకాలం పాటు పారాసెటమాల్ వాడే వారిలో కిడ్నీ పని తీరు మందగిస్తుంది. కిడ్నీలోని నెఫ్రాన్లు దెబ్బతినడం వల్ల రక్తాన్ని శుద్ధి చేసే సామర్థ్యం తగ్గిపోతుంది. దీని వల్ల కిడ్నీ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.

Advertisement

3. జీర్ణక్రియపై ప్రభావం:
పారాసెటమాల్‌ను ఖాళీ కడుపుతో లేదా తరచుగా తీసుకోవడం వల్ల కడుపులో మంట, వికారం, గ్యాస్ట్రిక్ సమస్యలు తలెత్తే ప్రమాదం కూడా ఉంటుంది. అంతే కాకుండా కొంత మందిలో అజీర్తి, ఆకలి తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

4. స్కిన్ అలర్జీలు:
చాలా అరుదుగా పారాసెటమాల్ వల్ల తీవ్రమైన చర్మ సమస్యలు రావచ్చు. చర్మంపై దద్దుర్లు, ఎర్రగా మారడం లేదా పొక్కులు రావడం వంటివి జరిగితే వెంటనే ట్యాబ్లెట్ ఆపేసి డాక్టర్‌ని సంప్రదించాలి.

Also Read: ఎయిర్ ఫ్రైయర్ ఫుడ్.. చుక్క నూనె లేదు సరే, ఆరోగ్యం సంగతేంటీ?

5. రీబౌండ్ హెడేక్ (తలనొప్పి తగ్గకపోగా పెరగడం):
తలనొప్పి కోసం పారాసెటమాల్‌ను రోజూ వాడేవారిలో ఒక విచిత్రమైన సమస్య వస్తుంది. మందు ప్రభావం పోగానే తలనొప్పి మరింత తీవ్రంగా తిరిగి వస్తుంది. దీనిని ‘మెడికేషన్ ఓవర్ యూజ్ హెడేక్’ అంటారు. అంటే నొప్పి తగ్గడానికి వేసుకునే మందే నొప్పికి కారణమవుతుంది.

ఎంత వాడాలి? ఎలా వాడాలి?
మోతాదు: సాధారణంగా ఒక ఆరోగ్యవంతుడైన వ్యక్తి రోజుకు 4 గ్రాముల కంటే ఎక్కువ పారాసెటమాల్ తీసుకోకూడదు. అంటే 650mg ట్యాబ్లెట్లు రోజుకు 4 నుంచి 5 కంటే ఎక్కువ వేసుకోకూడదు.

మద్యం వద్దు: ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉన్నవారు పారాసెటమాల్ వేసుకుంటే లివర్ డ్యామేజ్ అయ్యే రిస్క్ రెట్టింపు అవుతుంది.

కలిపి వాడకండి: కోల్డ్ మందులు, దగ్గు సిరప్‌లలో కూడా పారాసెటమాల్ ఉంటుంది. వాటితో పాటు మళ్ళీ విడిగా ట్యాబ్లెట్ వేసుకుంటే ఓవర్ డోస్ అయ్యే ప్రమాదం ఉంది.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×