E-Paper
Advertisement

Afternoon Sleep: మధ్యాహ్నం నిద్ర ముంచుకొస్తుందా? ఈ విటమిన్ లోపమే కారణం కావచ్చు!

Afternoon Sleep: మధ్యాహ్నం నిద్ర ముంచుకొస్తుందా? ఈ విటమిన్ లోపమే కారణం కావచ్చు!
Advertisement

Afternoon Sleep: మధ్యాహ్నం కాగానే కళ్లు భారమవ్వడం, ఆవలింతలు రావడం, పనిపై శ్రద్ధ తగ్గడం వంటి సమస్యలను మనం కేవలం నిద్రలేమి అనుకుంటాం. కానీ, తగినంత నిద్ర పోయినా ప్రతిరోజూ మధ్యాహ్నం నీరసంగా అనిపిస్తుంటే.. అది మీ శరీరంలోని కీలకమైన విటమిన్ లోపానికి సంకేతం కావచ్చు. ముఖ్యంగా విటమిన్ B12, విటమిన్ D లోపం వల్ల మెదడు, నాడీ వ్యవస్థ పని తీరు మందగించి తీవ్రమైన అలసట కలుగుతుంది. ఈ సమస్యను నిర్లక్ష్యం చేయకుండా.. సరైన ఆహారం, లైఫ్ స్టైల్ మార్పుల ద్వారా ఎలా అధిగమించాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

చాలా మందికి మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత కాసేపు నిద్రపోవాలని అనిపించడం సహజం. దీనిని ‘ఆఫ్టర్నూన్ స్లంప్’ అంటారు. అయితే.. ఈ అలసట రోజువారీ పనిని ప్రభావితం చేసే స్థాయిలో ఉంటే.. అది మీ శరీరంలో పోషకాల లోపాన్ని సూచిస్తుంది.

Advertisement

1. విటమిన్ B12 లోపం:

మన శరీరంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి, నాడీ వ్యవస్థ ఆరోగ్యానికి విటమిన్ B12 చాలా ముఖ్యం. దీని లోపం ఏర్పడినప్పుడు శరీరంలోని కణాలకు ఆక్సిజన్ సరఫరా తగ్గుతుంది. దీని వల్ల.. కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తాయి అవి..

Advertisement

1. తీవ్రమైన నీరసం, అలసట

2. మెదడు మొద్దుబారినట్లు అనిపించడం

3. ఏకాగ్రత లోపించడం

2. విటమిన్ D లోపం:
సూర్యరశ్మి ద్వారా లభించే ఈ విటమిన్ కేవలం ఎముకలకే కాదు, శక్తి స్థాయిలను పెంచడానికి కూడా అవసరం. విటమిన్ D తక్కువగా ఉంటే కండరాల బలహీనత, నిరంతర అలసట వేధిస్తాయి.

3. ఐరన్ లోపం:
రక్త హీనత ఉన్నవారిలో కూడా మధ్యాహ్నం వేళ విపరీతమైన నిద్ర వస్తుంది. రక్తంలో హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటే గుండె కణాలకు ఆక్సిజన్‌ను చేర వేయడానికి ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. ఫలితంగా శక్తి త్వరగా హరించుకుపోతుంది.

Also Read:రోజూ చింతపండు తింటే మీ కడుపు క్లీన్.. ఎలాగో తెలుసా?

నివారణ మార్గాలు – ఆహార నియమాలు:

ఈ సమస్య నుంచి గట్టెక్కడానికి మీ ఆహారంలో ఈ కింది మార్పులు చేసుకోండి.

B12 కోసం: పాలు, పెరుగు, పనీర్ వంటి డైరీ ఉత్పత్తులు, గుడ్లు, చేపలు తీసుకోవాలి. శాఖాహారులు డాక్టర్ సలహాతో సప్లిమెంట్స్ తీసుకోవచ్చు.

విటమిన్ D కోసం: ప్రతి రోజూ కనీసం 15-20 నిమిషాలు ఉదయం ఎండలో గడపాలి. పుట్టగొడుగులు, తృణ ధాన్యాలు ఆహారంలో చేర్చుకోవాలి.

భోజనంలో మార్పులు: మధ్యాహ్నం పూట భారీగా కార్బో హైడ్రేట్లు (ఎక్కువ అన్నం) తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరిగి మళ్ళీ తగ్గిపోతాయి.దీని వల్ల నిద్ర వస్తుంది. కాబట్టి అన్నం తగ్గించి, కూరగాయలు, ప్రొటీన్ ఎక్కువగా తీసుకోవాలి.

మధ్యాహ్న నిద్రను వదిలించుకోవడానికి టీ, కాఫీలు అతిగా తాగడం మంచిది కాదు. దానికి బదులుగా తగినంత నీరు తాగడం, చిన్నపాటి వాకింగ్ చేయడం వల్ల మెదడు చురుగ్గా మారుతుంది. అలసట మరీ ఎక్కువగా ఉంటే ఒకసారి రక్త పరీక్ష చేయించుకుని విటమిన్ స్థాయిలను చెక్ చేసుకోవడం ఉత్తమం.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×