E-Paper
Advertisement

పుచ్చకాయ తొక్కతో మతిపోయే లాభాలు.. ఇకనుంచైనా పడేయకండి!

పుచ్చకాయ తొక్కతో మతిపోయే లాభాలు.. ఇకనుంచైనా పడేయకండి!
Advertisement

Watermelon peel benefits: సమ్మర్‌లో ఎక్కడ చూసినా పుచ్చకాయలు కనిపిస్తుంటాయి. వీటి తీపి రుచి, శరీరాన్ని చల్లబరిచే గుణం వల్ల ఎక్కువ మంది తినడానికి ఆసక్తి చూపిస్తుంటారు. ఇదిలా ఉంటే అనేక మంది పుచ్చకాయ తినేసి దాని తొక్కను డస్ట్ బిన్‌లో పారేస్తారు. నిజానికి ఆ తొక్కలో కూడా అనేక పోషకాలు ఉంటాయి. ఆరోగ్యం, స్కిన్ కేర్ , కిచెన్‌లో కూడా దీనిని ఉపయోగించవచ్చు. ఈ చిన్న మార్పుతో మనం ఆహారాన్ని వృథా కాకుండా ఉపయోగించడమే కాకుండా.. బోలెడు ప్రయోజనాలు పొందవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

పుచ్చకాయ తొక్క వృథా కాదు: ఇలా ఉపయోగించండి

Advertisement

1. హెల్తీ కూరగా తయారు చేయండి:
పుచ్చకాయ తొక్కలోని తెల్ల భాగం కూడా తినవచ్చు. దీన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి కూరగా వండుకోవచ్చు. దీనిలో ఫైబర్ ఎక్కువగా ఉండటంతో జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. కొద్దిగా మసాలాలు, వెల్లుల్లి, మిరపకాయలు వేసి వండితే రుచికరమైన వంటకం సిద్ధమవుతుంది.

2. పచ్చడి లేదా చట్నీగా ఉపయోగించండి:
పుచ్చకాయ తొక్కతో ప్రత్యేకమైన పచ్చడి తయారు చేయొచ్చు. పచ్చి మిర్చి, వెల్లుల్లి, ఆవాలు, నిమ్మరసం కలిపి గ్రైండ్ చేస్తే రుచికరమైన చట్నీ సిద్ధమవుతుంది. ఇది అన్నం, రొట్టెలతో చాలా బాగుంటుంది.

Advertisement

3. జ్యూస్ లేదా స్మూతీగా:
పుచ్చకాయ తొక్కను జ్యూస్‌గా కూడా తయారు చేయవచ్చు. తొక్కలోని తెల్ల భాగాన్ని తీసుకుని మిక్సీలో వేసి కొద్దిగా తేనె, నిమ్మరసం కలిపితే డిటాక్స్ డ్రింక్‌గా ఉపయోగించవచ్చు. ఇది శరీరాన్ని శుభ్రపరచడంలో సహాయ పడుతుంది. అంతే కాకుండా అవసరం అయిన ఎనర్జీ అందిస్తుంది.

4. స్కిన్ కేర్ కోసం:
పుచ్చకాయ తొక్క చర్మానికి కూడా ఉపయోగ పడుతుంది. దీని లోపలి భాగాన్ని ముఖంపై రుద్దితే చర్మం చల్లబడుతుంది. టాన్ కూడా తగ్గుతుంది. సహజ మాయిశ్చరైజర్‌లా కూడా ఇది పనిచేస్తుంది. వేసవిలో ఇది చర్మానికి శాంతిని ఇస్తుంది.

5. పికిల్ (ఆవకాయ స్టైల్) తయారు చేయండి:
పుచ్చకాయ తొక్కతో ప్రత్యేకమైన పచ్చడి తయారు చేయవచ్చు. ఉప్పు, కారం, ఆవాల పొడి, నూనె కలిపి కొన్ని రోజులు ఉంచితే మంచి రుచికరమైన పికిల్ సిద్ధమవుతుంది. ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది.

6. గార్డెనింగ్‌లో ఉపయోగం:
పుచ్చకాయ తొక్కను కంపోస్ట్‌గా కూడా ఉపయోగించవచ్చు. ఇది మట్టిలో పోషకాలను పెంచి మొక్కల పెరుగుదలకు సహాయ పడుతుంది. కిచెన్ వ్యర్థాన్ని ఉపయోగ కరంగా మార్చే మంచి మార్గం ఇది.

Also Read: వేసవిలో మజ్జిగ తాగుతున్నారా? వీళ్లు దూరంగా ఉంటేనే బెటర్

ఎందుకు తొక్కను ఉపయోగించాలి?

1.ఫుడ్ వేస్ట్ తగ్గుతుంది

2.అదనపు పోషకాలు పొందవచ్చు

3.పర్యావరణానికి మేలు

4. డబ్బు ఆదా అవుతుంది

పుచ్చ కాయ తొక్కను పారేయడం కంటే దాన్ని వాడటం ద్వారా మనం ఆరోగ్యపరంగా, ఆర్థికంగా లాభపడవచ్చు. చిన్న చిన్న మార్పు లతో పెద్ద ప్రయోజనాలు పొందవచ్చు. ఇకపై పుచ్చ కాయ తిన్న తర్వాత తొక్కను వ్యర్థంగా పారేయ కుండా.. స్మార్ట్‌గా ఉపయోగించండి.

Also Read:  కిచెన్ స్పాంజిలో కోట్ల బ్యాక్టీరియా.. మార్చడానికి సరైన సమయం ఇదే!

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×