E-Paper
Advertisement

Vitamin E Capsule: విటమిన్ ఈ క్యాప్యూల్స్‌తో ఇలా చేస్తే.. గ్లాసీ స్కిన్ మీ సొంతం

Vitamin E Capsule: విటమిన్ ఈ క్యాప్యూల్స్‌తో ఇలా చేస్తే.. గ్లాసీ స్కిన్ మీ సొంతం
Advertisement

Vitamin E Capsule: విటమిన్ ఈ క్యాప్స్యూల్స్ చర్మానికి చాలా మేలు చేస్తుంది. మార్కెట్‌లో లభించే ఈ క్యాప్సూల్స్‌ను చర్మ సంరక్షణలో ఉపయోగించవచ్చు. వీటిని తరుచుగా వాడటం వల్ల చర్మం మెరుస్తూ ఉంటుంది. అంతే కాకుండా వివిధ చర్మ సమస్యలను తొలగించడంలో సహాయపడే విటమిన్-ఇ క్యాప్సూల్స్ నుండి కొన్ని ఫేస్ మాస్క్‌లను తయారు చేయవచ్చు.

యాంటీఆక్సిడెంట్ లక్షణాలకు ప్రసిద్ధి చెందిన విటమిన్ ఈ చర్మ సంరక్షణలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి, చర్మాన్ని తేమగా మార్చడానికి, మచ్చలను తగ్గించడానికి సహాయపడుతుంది. అందువల్ల, విటమిన్ ఇ మాత్రలను చర్మ సంరక్షణలో విస్తృతంగా ఉపయోగిస్తారు. (విటమిన్-ఇ టాబ్లెట్‌లతో ఇంట్లోనే ఫేస్ మాస్క్‌లను తయారు చేసుకుని వాడటం ద్వారా మీ చర్మాన్ని సులభంగా మెరిసేలా చేసుకోవచ్చు. విటమిన్ ఈ క్యాప్స్యూల్స్ తో ఫేస్ మాస్క్ లు ఎలా తయారు చేసుకోవాలో వాటి ప్రయోజనాలు ఏంటీ అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

చర్మానికి విటమిన్-ఇ యొక్క ప్రయోజనాలు: 

మాయిశ్చరైజేషన్- విటమిన్ ఇ చర్మాన్ని తేమగా చేస్తుంది. చర్మాన్ని మృదువుగా మారుస్తుంది.

Advertisement

యాంటీఆక్సిడెంట్- ఇది ఫ్రీ రాడికల్స్‌తో పోరాడడం ద్వారా చర్మాన్ని దెబ్బతినకుండా కాపాడుతుంది. వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తుంది.

మచ్చలను తగ్గిస్తుంది- విటమిన్ ఇ చర్మపు మచ్చలను తగ్గించడంలో సహాయపడుతుంది .

మంటను తగ్గిస్తుంది – ఇది చర్మం మంటను తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంటుంది.

చర్మ ఛాయను మెరుగుపరుస్తుంది – విటమిన్ ఇ చర్మ ఛాయను మెరుగుపరుస్తుంది. అంతే కాకుండా మెరసేలా చేస్తుంది.

విటమిన్ ఇ క్యాప్స్యూల్స్ తో ఫేస్ మాస్క్‌లు ఎలా తయారు చేయాలంటే?

1. విటమిన్ ఇ క్యాప్స్యూల్స్ , అలోవెరాతో ఫేస్ మాస్క్‌:
కావలసినవి:
ఇ క్యాప్సూల్ -1
అలోవెరా జెల్- 2 టీస్పూన్

తయారీ విధానం: విటమిన్-ఇ క్యాప్సూల్‌నుంచి జెల్ తీసి, అలోవెరా జెల్‌తో కలపండి. ఈ మిశ్రమాన్ని శుభ్రమైన ముఖంపై అప్లై చేసి 20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తరువాత
చల్లటి నీటితో కడగాలి.

2. విటమిన్ E క్యాప్స్యూల్స్, తేనెతో ఫేస్ మాస్క్‌:
కావలసినవి: 
విటమిన్ ఇ క్యాప్సూల్- 1
తేనె-1 టీస్పూన్

తయారీ విధానం: విటమిన్-ఇ క్యాప్సూల్‌ను పగలగొట్టి తేనెతో కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తరువాత
గోరువెచ్చని నీటితో కడగాలి.

3. విటమిన్ E, పెరుగుతో ఫేస్ మాస్క్‌:

కావలసినవి:
విటమిన్ ఇ క్యాప్సూల్ – 1
పెరుగు- 1 టేబుల్ స్పూన్

తయారీ విధానం: విటమిన్-ఇ క్యాప్సూల్‌ని పగలగొట్టి పెరుగులో కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 15-20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తరువాత
చల్లటి నీటితో కడగాలి.

Also Read: శనగపిండిలో ఇవి కలిపి రాస్తే.. ఎవ్వరైనా తెల్లగా అవ్వాల్సిందే !

విటమిన్ ఇ ఫేస్ మాస్క్ ఎలా అప్లై చేయాలి ?
ముఖాన్ని బాగా శుభ్రం చేసుకోవాలి.

ఫేస్ మాస్క్‌ను ముఖంపై పలుచగా అప్లై చేయాలి.

కళ్ళు , పెదవుల చుట్టూ ఉన్న ప్రాంతాలపై అప్లై చేయడం మానుకోండి.

15-20 నిమిషాలు వదిలివేయండి.

చల్లటి నీటితో కడగండి.

ఈ ఫేస్ మాస్క్ ను వారానికి 2-3 సార్లు ఉపయోగించండి.

 

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×