E-Paper
Advertisement

వైట్ వెనిగర్, డిష్‌వాష్ లిక్విడ్ కలిపి వాడితే.. అద్భుతమైన ఫలితాలు చూస్తారు!

వైట్ వెనిగర్, డిష్‌వాష్ లిక్విడ్ కలిపి వాడితే.. అద్భుతమైన ఫలితాలు చూస్తారు!
Advertisement

Cleaning Hacks: సాధారణంగా కిచెన్‌లో వంట చేసేటప్పుడు లేదంటే పాత్రలు కడిగేటప్పుడు ఫ్లోర్ మీద లేదంటే కిటికీ అద్దాల పైన మరకలు పడుతుంటాయి. కిచెన్‌లోనే కాకుండా కొన్నిసార్లు హాల్లో కిటికీలకు ఉన్న అద్దాల పైన కూడా కొన్ని మొండి మరకలు కనిపిస్తుంటాయి. అయితే వాటిని ప్రతిసారీ క్లీన్ చేయడం అంత తేలిక కాదు. చాలాసేపు రుద్దాల్సి ఉంటుంది.

ఇప్పుడీ సమస్యకు ఒక సులువైన మార్గం దొరికింది. వైట్ వెనిగర్, డిష్‌వాష్ లిక్విడ్ కలిపి వాడితే ఖరీదైన కెమికల్ క్లీనర్లతో పనిలేకుండా ఇల్లు తలతలా మెరిసిపోతుందట. డిష్‌వాష్ లిక్విడ్ నూనె జిడ్డును సులువుగా తొలగిస్తే.. వెనిగర్ గట్టిపడిన నీటి మరకలను, మురికిని చాలా వేగంగా కరిగిస్తుంది.

ఎక్కడెక్కడ ఉపయోగించవచ్చు?

Advertisement

ఈ మిశ్రమం వంటగది, బాత్రూమ్ క్లీనింగ్‌కు అద్భుతంగా పనిచేస్తుంది. వంటగదిలోని స్టవ్, కౌంటర్ టాప్‌లు, టైల్స్, చివరికి కలప క్యాబినెట్లపై పేరుకుపోయిన జిడ్డును ఇది తేలికగా వదిలిస్తుంది. అలాగే బాత్రూమ్‌లోని కుళాయిలు, గ్లాస్ డోర్లు, సింక్‌లు, టబ్‌లపై పడిన మొండి నీటి మరకలను క్లీన్ చేయడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది.

Also Read: వాట్సప్‌లో ఫొటోలు, వీడియోలు ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్ కాకుండా ఎలా ఆపాలి?

లిక్విడ్ తయారీ విధానం:

Advertisement

ఒక కప్పు వైట్ వెనిగర్, ఒక కప్పు డిష్‌వాష్ లిక్విడ్ తీసుకోవాలి. ఈ రెండు మిశ్రమాన్ని ఒక ఖాళీ స్ప్రే బాటిల్‌లో నిదానంగా పోసి కలపాలి. ఎక్కువగా నురుగు రాకుండా జాగ్రత్త పడాలి. ఈ మిశ్రమాన్ని మురికి ఉన్న చోట స్ప్రే చేసి.. 5 నుంచి 10 నిమిషాల పాటు అలానే వదిలేయాలి. ఆ తర్వాత మంచి నీటితో శుభ్రంగా కడిగి, పొడి గుడ్డతో తుడిచేస్తే సరిపోతుంది.

పాటించాల్సిన జాగ్రత్తలు:

ఈ మిశ్రమం ఇంట్లో తయారు చేసుకునేదే అయినా కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. దీన్ని బ్లీచ్ లేదా ఇతర కెమికల్ క్లీనర్లతో కలపకూడదు. అలా కలిపితే విషపూరితమైన వాయువులు విడుదలయ్యే ప్రమాదం ఉంది. అలాగే మార్బుల్, గ్రానైట్ లాంటి సహజమైన రాతి నేలలపై ఈ మిశ్రమాన్ని వాడకూడదు. వెనిగర్‌లోని యాసిడ్ వల్ల ఆ రాళ్ల షైనింగ్ పాడయ్యే అవకాశం ఉంది.

Also Read: 25 రోజుల బ్యాటరీ.. వాచ్ ఫీచర్లతో క్యాసియో ‘స్మార్ట్ రింగ్’ వచ్చేసింది, ధర ఎంతంటే?

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×