E-Paper
Advertisement

Skin Glow tips: ఉల్లిపాయ రసాన్ని ఇలా వాడారంటే చర్మం కొత్త కాంతితో మెరిసిపోతుంది

Skin Glow tips: ఉల్లిపాయ రసాన్ని ఇలా వాడారంటే చర్మం కొత్త కాంతితో మెరిసిపోతుంది
Advertisement

చర్మాన్ని మెరిపించడం కోసం ఖరీదైన క్రీములు, బ్యూటీ సెలూన్ల చుట్టూ తిరిగే వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. కానీ మన వంటింట్లో ఉన్న కొన్ని పదార్థాలతోనే చర్మాన్ని మెరిపించుకోవచ్చు. అందులో ముఖ్యమైనది ఉల్లిపాయ. ఉల్లిపాయ రసం అనగానే కేవలం జుట్టు కోసమే అనుకుంటారు కానీ ఉల్లిపాయ రసాన్ని చర్మానికి అప్లై చేస్తే కాంతివంతంగా మారుతుందని బ్యూటీషియన్లు చెబుతున్నారు. ఉల్లిపాయలలో యాంటీ ఆక్సిడెంట్లు, సల్ఫర్, విటమిన్లు వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని పరిశుభ్రంగా ఉంచి మచ్చలు తగ్గించడంలో సహాయపడతాయి. సహజ కాంతిని తీసుకురావడంలో ముందుంటాయి. ఉల్లిపాయతో ఇంట్లోనే సులభంగా కొన్ని ఫేస్ ప్యాక్ లు తయారు చేసుకోవచ్చు. అవేంటో తెలుసుకోండి.

ఉల్లిపాయ రసం తేనే కలిపి

Advertisement

ఉల్లిపాయ రసాన్ని తేనెతో కలిపి ముఖానికి రాస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఉల్లిపాయ రసం చర్మ రంధ్రాల్లోని మలినాలను తొలగిస్తుంది. ఇక తేనే చర్మానికి తేమను అందించి మృదుత్వాన్ని అందిస్తుంది. ముఖానికి ఫేస్ ప్యాక్ ను అప్లై చేశాక 15 నుంచి 20 నిమిషాల పాటు వదిలేయాలి. తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేస్తే చర్మం తాజాగా ఉంటుంది. అలాగే ఉల్లిపాయ రసము, పెరుగు ఫేస్ ప్యాక్ కూడా అద్భుతంగా పనిచేస్తుంది. పెరుగులో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఇది మృత కణాలను తొలగించే చర్మాన్ని సహజంగానే మెరిసేలా చేస్తుంది. ఈ ఫేస్ ప్యాక్ ను వారానికి ఒక్కసారి వాడితే సరిపోతుంది. ఉల్లిపాయ రసము పెరుగు బాగా కలిపి ముఖానికి పట్టించడమే.

Also read: Best 5 Bikes: ప్రతి నెలా లక్షల మంది కొనుగోలు చేస్తున్న టాప్ 5 బైకులు ఇవే

Advertisement

అలోవెర్ జెల్ కలిపి

ఇక సున్నితమైన చర్మ తత్వం కలవారికి ఉల్లిపాయ రసం, అలోవెరా జెల్ కలిపి వాడితే మంచిది. అలోవెరా చర్మాన్ని చల్లబరుస్తుంది. ఉల్లిపాయ రసం వల్ల కలిగే చిన్నపాటి మంటను కూడా అలోవెరా తగ్గిస్తుంది. ఈ ఫేస్ ప్యాక్ చర్మాన్ని హైడ్రేట్ చేసే సహజమైన కాంతిని పెంచుతుంది. మరోవైపు ఆయిలీ స్కిన్ ఉన్నవారు కూడా ఉల్లిపాయ రసాన్ని వాడొచ్చు. ఇందుకోసం మీరు ఉల్లిపాయ రసంలో సెనగపిండి లేదా బియ్యప్పిండి వేసి బాగా కలుపుకోవాలి. దీన్ని ముఖానికి పట్టించాలి. అది ముఖంపై ఉన్న నూనెను నియంత్రిస్తుంది. చర్మ రంధ్రాలను శుభ్రపరుస్తుంది. క్రమం తప్పకుండా వాడితే చర్మం మెరుస్తుంది.

Also read: Karthika deepam: కార్తీకదీపంలో నటిస్తున్నందుకు నిరుపమ్ పరిటాల తీసుకునే రెమ్యునరేషన్ ఎంత?

ఉల్లిపాయతో చేసే ఫేస్ ప్యాక్ లు ఉపయోగించే ముందు కొన్ని జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలి. ముందుగా ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి. అక్కడ ఎర్రదనం, దురద వంటివి లేకపోతే వీటిని వాడొచ్చు. అలాగే ఈ ఫేస్ ప్యాక్ లో వారానికి ఒకటి లేదా రెండుసార్లు వాడితే చాలు. సహజ పదార్థాలే కదా అనుకోవచ్చు కానీ మంచి మోతాదులో వాడితేనే మంచి ఫలితాలు వస్తాయి. ఖరీదైన కాస్మెటిక్ ఉత్పత్తులతో పోలిస్తే ఇక్కడ ఇచ్చిన ఫేస్ ప్యాక్ లన్నీ చాలా తక్కువ ఖర్చులో పూర్తయ్యేవే.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×