// // Drinks For Kidney Function: కిడ్నీ డిటాక్స్ కోసం.. ఈ డ్రింక్స్ తాగాల్సిందే -->
E-Paper
Advertisement

Drinks For Kidney Function: కిడ్నీ డిటాక్స్ కోసం.. ఈ డ్రింక్స్ తాగాల్సిందే

Drinks For Kidney Function: కిడ్నీ డిటాక్స్ కోసం.. ఈ డ్రింక్స్ తాగాల్సిందే
Advertisement

Drinks For Kidney Function: మన కిడ్నీలు శరీరంలోని అతి ముఖ్యమైన వడపోత వ్యవస్థ. ఇది రక్తం నుంచి వ్యర్థాలను తొలగించడం ద్వారా శరీరాన్ని శుభ్ర పరచడంలో సహాయ పడుతుంది. అయితే.. లైప్ స్టైల్‌లో మార్పులు అంతే కాకుండా.. తక్కువ నీరు తాగడం, అధిక మొత్తంలో జంక్ ఫుడ్, మందులు తీసుకోవడం వల్ల కిడ్నీలకు అదనపు ఒత్తిడి వస్తుంది. అందుకే.. ఎప్పటి కప్పుడు కిడ్నీలను డిటాక్స్ చేయడం చాలా ముఖ్యం.

కిడ్నీ డిటాక్స్‌కు ఖరీదైన చికిత్సలు లేదా మందులు అవసరం లేదు. మన వంట గదిలో తయారు చేసుకునే సాధారణ హోం రెమెడీస్ మన కిడ్నీలను సహజంగా శుభ్ర పరచడానికి అంతే కాకుండా బలోపేతం చేయడానికి సహాయ పడతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

హోం రెమెడీస్:

నీరు పుష్కలంగా తాగండి:
మీ కిడ్నీల డీటాక్స్ కోసం సులభమైన, అత్యంత ప్రభావ వంతమైన మార్గం నీరు పుష్కలంగా తాగడం. నీరు యూరిన్ ద్వారా వ్యర్థ పదార్థాలను బయటకు పంపడంలో సహాయ పడుతుంది. అంతే కాకుండా కిడ్నీల్లో రాళ్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అందుకే రోజుకు 8-10 గ్లాసుల నీరు తగడం అలవాటు చేసుకోండి. ఉదయం ఖాళీ కడుపుతో గోరు వెచ్చని నీరు తాగడం మరింత ప్రయోజన కరంగా ఉంటుంది.

Advertisement

కొత్తిమీర నీరు తాగండి:
కొత్తిమీర సహజ డిటక్స్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఒక టీస్పూన్ కొత్తి మీర గింజలను రాత్రంతా నీటిలో నానబెట్టి.. ఉదయం మరిగించి, వడకట్టండి. ఈ నీటిని తాగడం వల్ల కిడ్నీల వాపు తగ్గుతుంది.. అంతే కాకుండ మూత్రం ద్వారా మలినాలను బయటకు పంపడంలో కూడా సహాయ పడుతుంది.

నిమ్మ నీరు:
నిమ్మ కాయలలోని సిట్రిక్ ఆమ్లం కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా నిరోధించడంలో సహాయ పడుతుంది. అందుకే ప్రతి రోజు ఉదయం గోరు వెచ్చని నీటిలో సగం నిమ్మకాయను పిండి తాగడం వల్ల కిడ్నీలు శుభ్ర పడతాయి. అంతే కాకుండా జీవ క్రియను కూడా ఇది మెరుగు పరుస్తుంది. నీటిలో ఉప్పు లేదా చక్కెర కలపకుండా జాగ్రత్తలు తీసుకోండి.

ఆహారంలో కొబ్బరి నీరు:
కొబ్బరి నీరు కిడ్నీ హైడ్రేట్‌గా ఉంచే సహజ ఎలక్ట్రోలైట్ డ్రింక్. ఇది కిడ్నీ ప్రవాహాన్ని పెంచడంలో సహాయ పడుతుంది. అంతే కాకుండా ఇది సులభంగా తొలగించడానికి వీలు కల్పిస్తుంది.వారానికి 3-4 సార్లు తాజా కొబ్బరి నీళ్ళు తాగడం వల్ల కిడ్నీల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.

Also Read: హార్ట్ ఎటాక్ రాకుండా ఉండాలంటే.. మీ నిద్రలో ఈ మార్పు తప్పనిసరి !

యాపిల్స్, ఆపిల్ సైడర్ వెనిగర్:
యాపిల్స్‌లో ఫైబర్ , యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కిడ్నీలను శుభ్రంగా ఉంచడంలో సహాయ పడతాయి. యాపిల్ సైడర్ వెనిగర్ శరీరంలోని విషాన్ని విచ్ఛిన్నం చేయడంలో కూడా సహాయ పడుతుంది. మీరు రోజుకు ఒకసారి ఒక గ్లాసు నీటిలో ఒక టీస్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ కలిపి కూడా తాగవచ్చు. కానీ ఏవైనా తీవ్రమైన సమస్యలు ఉన్నప్పడు మాత్రం కొన్ని తప్పకుండా డాక్టర్‌ని సంప్రదించాలి.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×