E-Paper
Advertisement

Throat Pain: మందులు లేకుండా ఉపశమనం.. చలికాలపు గొంతు నొప్పికి 5 దివ్యౌషధాలు !

Throat Pain: మందులు లేకుండా ఉపశమనం.. చలికాలపు గొంతు నొప్పికి 5 దివ్యౌషధాలు !
Advertisement

Throat Pain: చలికాలంలో గొంతు నొప్పి చాలా మంది ఎదుర్కునే సమస్య. అది చలి, పొడి గాలి, వైరల్ ఇన్ఫెక్షన్ల లేదా కాలుష్యం వల్ల వస్తుంది. గొంతు కణజాలం వాపుకు గురైనప్పుడు, మింగడం, మాట్లాడటం కష్టతరం అయినప్పుడు కూడా గొంతు నొప్పి వస్తుంది. ఇలాంటి సమయంలో తక్షణ ఉపశమనం కోసం కొన్ని రకాల హోం రెమెడీస్ వాడటం మంచిది. ఇవి అద్భుతమైన ప్రయోజనాలు అందిస్తాయి. అంతే కాకుండా ఇవి గొంతులోని బ్యాక్టీరియాను చంపడం, శ్లేష్మాన్ని పలుచబడటం, నొప్పి నుంచి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి. గొంతు నొప్పిని తగ్గించే హోం రెమెడీస్ గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

1. ఉప్పు నీరు:
గొంతు నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి సులభమైన, అత్యంత ప్రభావవంతమైన మార్గం గోరు వెచ్చని ఉప్పు నీటితో పుక్కిలించడం. ఒక గ్లాసు గోరు వెచ్చని నీటిలో అర టీస్పూన్ సాల్ట్ కలిపి రోజుకు 3 నుంచి 4 సార్లు పుక్కిలించండి.ఈ ఉప్పు గొంతు కణాల నుంచి అదనపు ద్రవాన్ని బయటకు పంపి.. మంటను తగ్గిస్తుంది. అంతే కాకుండా గొంతులోని బ్యాక్టీరియాను చంపుతుంది.

Advertisement

2. తేనె, అల్లం మిశ్రమం:
తేనె, అల్లం మిశ్రమం గొంతు నొప్పికి “దివ్యౌషధం”. ఒక టీస్పూన్ తాజా అల్లం రసాన్ని ఒక టీస్పూన్ స్వచ్ఛమైన తేనెతో కలిపి నెమ్మదిగా తీసుకోండి. తేనె గొంతుకు ఉపశమనాన్ని అందిస్తుంది. అంతే కాకుండా అల్లంలో ఉండే జింజెరాల్ నొప్పి, మంటను త్వరగా తగ్గించడానికి పనిచేస్తుంది.

3. పసుపు పాలు:
పసుపు పాలు అంతర్గత ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి అద్భుతంగా పనిచేస్తుంది. అంతే కాకుండా ఇది గోరు వెచ్చని పాలలో చిటికెడు పసుపు , కొద్దిగా నల్ల మిరియాలు కలిపి పడుకునే ముందు తాగాలి. పసుపులో ఉండే క్రియాశీల సమ్మేళనం కర్కుమిన్ ఒక శక్తివంతమైన శోథ నిరోధక ఏజెంట్. ఇది గొంతు ఇన్ఫెక్షన్లను త్వరగా నయం చేయడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా శరీరాన్ని లోపలి నుంచి కూడా వేడిగా చేస్తుంది.

Advertisement

4. తులసి, వాము ఆవిరి:
గొంతు, శ్వాసకోశంలో మంటను తగ్గించడానికి ఆవిరి పీల్చడం చాలా అవసరం. 5-6 తులసి ఆకులు, అర టీస్పూన్ వాము విత్తనాలను వేడి నీటిలో ఉడకబెట్టండి. తర్వాత మీ తలను టవల్‌తో కప్పి, ఆవిరిని పీల్చుకోండి. తులసి వాము విత్తనాల నుంచి వచ్చే ఆవిరి శ్లేష్మాన్ని సన్నగా చేసి, గొంతు నొప్పి, ముక్కు దిబ్బడ నుంచి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×