E-Paper
Advertisement

వైన్ తాగితే ఏం కాదు అనుకుంటున్నారా? 10,000 స్కాన్స్ చూశాక వైద్యులు చెప్పిన ఆ చేదు నిజం తెలిస్తే..

వైన్ తాగితే ఏం కాదు అనుకుంటున్నారా? 10,000 స్కాన్స్ చూశాక వైద్యులు చెప్పిన ఆ చేదు నిజం తెలిస్తే..
Advertisement

Liver Damage Habits: మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవాల్లో కాలేయం (లివర్) ఒకటి. ఇది రక్తాన్ని శుద్ధి చేయడం, శక్తిని నిల్వ చేయడం, జీర్ణక్రియకు సహాయపడటం వంటి వందలాది పనులను సైలెంట్‌గా చేసుకుపోతుంది. అయితే, మనకు తెలియకుండానే మనం చేసే కొన్ని రోజువారీ అలవాట్లు లివర్‌ను తీవ్రంగా దెబ్బతీస్తాయని ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ సౌరభ్ సేథి ఒక వీడియో ద్వారా సమాచారాన్ని పంచుకున్నారు. ఎయిమ్స్, హార్వర్డ్, స్టాన్‌ఫోర్డ్ వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో శిక్షణ పొందిన ఆయన.. దాదాపు 10,000 స్కాన్‌లను పరిశీలించిన తర్వాత లివర్ ఆరోగ్యాన్ని పాడుచేసే మూడు ముఖ్యమైన అలవాట్లను పంచుకున్నారు. అవేంటంటే..

రోజూ మద్యం సేవించడం:

చాలామంది రోజుకు ఒక పెగ్ లేదా ఒక గ్లాసు రెడ్ వైన్ తాగడం వల్ల ఆరోగ్యానికి ఏమీ కాదు, పైగా మంచిదే అనుకుంటారు. కానీ లివర్ ఆరోగ్యానికి సంబంధించి ఈ నమ్మకం తప్పు అని డాక్టర్ సేథి స్పష్టం చేశారు. మద్యం విషయంలో లివర్‌కు సురక్షితమైన పరిమితి అంటూ ఏదీ లేదు. మనం తాగే ప్రతి డ్రాప్ మద్యం లివర్‌పై అదనపు భారాన్ని పెంచుతుంది. రోజువారీగా తక్కువ మొత్తంలో తాగినా కూడా అది కాలక్రమేణా కోలుకోలేని నష్టానికి దారితీస్తుంది. మితిమీరని రీతిలో మద్యం తాగే వారిలో కూడా దాదాపు 40 శాతం మందికి ఫ్యాటీ లివర్ లక్షణాలు కనిపిస్తున్నాయని స్కానింగ్ నివేదికలు చెబుతున్నాయి.

Advertisement

Also Read:

ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువగా తినడం:

ఈ రోజుల్లో ప్యాక్ చేసిన ఆహారాలు, జంక్ ఫుడ్స్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. రిఫైన్డ్ కార్బోహైడ్రేట్లు, శాచురేటెడ్ ఫ్యాట్స్, అధిక ఫ్రక్టోజ్ ఉండే ఇలాంటి అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్ లివర్ శత్రువులని చెప్పవచ్చు. ఇవి శరీరంలో చేరి నేరుగా ఫ్యాటీ లివర్ వ్యాధికి కారణమవుతున్నాయి. ఒక దశాబ్దం క్రితంతో పోలిస్తే ప్రస్తుతం 20, 30 ఏళ్ల వయసున్న యువతలోనే కాకుండా చిన్న పిల్లల్లో కూడా ఈ సమస్య 40 శాతం పెరగడం ఆందోళనకరం.

మానసిక ఒత్తిడి, నిద్రలేమి:

Advertisement

ఒత్తిడి, నిద్రలేమి మానసిక సమస్యలనే కాకుండా నేరుగా లివర్‌ను కూడా దెబ్బతీస్తాయి. నిరంతర ఒత్తిడి వల్ల శరీరంలో ‘కార్టిసాల్’ అనే హార్మోన్ అసమతుల్యత ఏర్పడుతుంది. ఇది పొట్ట భాగంలో కొవ్వు పెరగడానికి దారితీస్తుంది. ఈ కొవ్వే ఫ్యాటీ లివర్ వ్యాధికి ప్రధాన కారణం. ఆరోగ్యంగా ఉన్నవారితో పోలిస్తే.. ఫ్యాటీ లివర్ ఉన్న రోగుల్లో కార్టిసాల్ స్థాయిలు 65 శాతం ఎక్కువగా ఉంటున్నాయని డాక్టర్ తెలిపారు. కాబట్టి లివర్ పదిలంగా ఉండాలంటే ఒత్తిడిని తగ్గించుకుని, ప్రశాంతంగా నిద్రపోవడం చాలా ముఖ్యం.

Also Read:

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×