E-Paper
Advertisement

Leafy Vegetables : ఆవుపాలను మించిన పోషకాలు ఈ ఆకు సొంతం

Leafy Vegetables : ఆవుపాలను మించిన పోషకాలు ఈ ఆకు సొంతం
Advertisement

Leafy Vegetables : ఆకుకూరల్లో చాలా రకాల పోషకాలు, విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. అయితే ఆవకూర గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యపోక తప్పదు. దీన్ని భూమి మీద పండే ఆకుపచ్చ వజ్రం అని పిలుస్తారు. 100 గ్రాముల ఆవకూరలో 90 గ్రాములు నీటి శాతమే ఉంటుంది. దీంతో పాటు క్యాలరీల శక్తి కూడా అధికంగానే ఉంటుంది. కార్బోహైడ్రేట్స్ 4 గ్రాములు, ఫ్యాట్ 0.4 గ్రాములు, ప్రోటీన్స్ 3 గ్రాములు ఉంటాయి. వీటితోపాటు ఫైబర్ 5 గ్రాములు, విటమిన్ సి 70 MLG,కాల్షియం 115 MLG ఉంటాయి. 70శాతం విటమిన్ సి ఉన్న ఏకైక ఆకుకూర ఇదే. వండిన తర్వాత కూడా ఇందులో 40 శాతం సి విటమిన్ అలాగే ఉంటుంది. సాధారణంగా మనకు 50 గ్రాముల విటమిన్ సి సరిపోతుంది. ఈ ఆవకూరలో ఆవు పాలలో ఉన్నంత కాల్షియం మనకు లభిస్తుంది. ఈ ఆకును యాంటీ క్యాన్సర్ ఆకుగా కూడా మనం చెప్పుకోవచ్చు. హెరిడేటరీగా క్యాన్సర్‌ వచ్చేవారు ఎక్కువశాతం ఉంటారు. కణాల్లో డీఎన్ఏ డ్యామేజ్ కావడంతో క్యాన్సర్ కణాలుగా మారుతాయి. అలాంటప్పుడు ఈ ఆకు తినడం వల్ల మన డీఎన్‌ఏని రిపేర్ చేసి క్యాన్సర్ కణంగా మారకుండా కాపాడుతుంది. అలాగే ఆవకూరలో గ్లూకోస్ సైనోలేట్‌ అనే కెమికల్ కాంపాండ్స్‌ సమృద్ధిగా ఉన్నాయి. ఎక్కువ మొత్తంలో ఉండటం వల్ల లంగ్ క్యాన్సర్ మొదటి దశలో ఉన్నప్పుడు పూర్తిగా నిర్మూలిస్తుంది. ఇది సైంటిఫిక్‌ గా కూడా నిరూపితమైంది. ప్రపంచవ్యాప్తంగా మగవారిని ఇబ్బంది పెట్టే క్యాన్సర్ లంగ్ క్యాన్సర్. ఆడవారికైతే బెస్ట్ క్యాన్సర్. ఈ క్యాన్సర్లకు అద్భుత ఔషధం ఈ ఆవకూర. తర్వాత కోలన్‌ క్యాన్సర్. ఈ క్యాన్సర్ మొదటి దశలో ఉన్నవారికి ఈ ఆకును వాడితే పూర్తిగా నయమవుతుంది. 2016లో మణిపాల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఇదే విషయాన్ని నిరూపించారు. ఆవకూర లైట్‌గా పెప్పర్ రుచిని కలిగి ఉంటుంది. చేదుగా కూడా ఉంటుంది. అందుకని ఉప్పు లేకపోయినా ఎలాంటి తేడా ఉండదు. దీనిని పప్పులో వేసి వండుకుంటే బాగుంటుంది. కూర వండుకున్నా స్పెషల్‌గా ఉంటుంది. ఇంట్లోనే దీన్ని పెంచుకోని తింటే ఎంతో ఆరోగ్యంగా ఉంటారు.

Tags

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×