E-Paper
Advertisement

Husband and wife: భార్యభర్తలు ఇలా చేస్తే ఎప్పటికీ విడిపోరట…ఇంతకీ ఏం చేయాలో తెలుసా..?

Husband and wife: భార్యభర్తలు ఇలా చేస్తే ఎప్పటికీ విడిపోరట…ఇంతకీ ఏం చేయాలో తెలుసా..?
Advertisement

Husband and wife: భార్యాభర్తలు ఇలా చేస్తే ఎప్పటికీ విడిపోరట. వారి మధ్య ఎప్పటికీ పొరపచ్చాలు, అభిప్రాయబేధాలు రావట. వారు నిండు నూరేళ్లు హ్యాపీగా కలిసిమెలిసి జీవిస్తారు. అయితే ఏం చేస్తే భార్యాభర్తలు ఎప్పటికీ విడిపోరో ఇప్పుడు తెలుసుకుందాం.

భార్యాభర్తల బంధం కలకాలం నిలవాలంటే కేవలం ప్రేమ ఉంటే సరిపోదు, దానిని నిలబెట్టుకునే పద్ధతులు కూడా తెలియాలని పెద్దలు మరియు మానసిక నిపుణులు చెబుతుంటారట. విద్వాంసులైన చాణక్యుడు, విదురుడు వంటి వారు సూచించిన కొన్ని సూత్రాలు నేటి కాలానికి తగిన మరికొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

భార్య భర్తల పరస్పర గౌరవం (Mutual Respect): ప్రేమ కంటే గౌరవం గొప్పది. ఎంతటి గొడవ జరిగినా ఒకరినొకరు కించపరచుకోకూడదట. ముఖ్యంగా మూడవ వ్యక్తి ముందు లేదా పిల్లల ముందు భాగస్వామిని తక్కువ చేసి మాట్లాడకూడదట. గౌరవం ఉన్నచోట ప్రేమ సహజంగానే పెరుగుతుందట.

రహస్యాలను దాచకపోవడం: భార్యాభర్తల మధ్య పారదర్శకత ఉండాలట. ముఖ్యంగా ఆర్థిక విషయాలు స్నేహాలు మరియు కెరీర్ నిర్ణయాల్లో ఒకరికొకరు తోడుగా ఉండాలట. నమ్మకం దెబ్బతిన్న చోట బంధం బలహీనపడుతుందట.

Advertisement

ఇతరులతో పోల్చకూడదు: పక్కింటి వారు అలా ఉన్నారు.. నీ స్నేహితుడు ఇలా ఉన్నాడు అంటూ పోలికలు తీసుకురావడం బంధానికి విషం లాంటిదట. ప్రతి మనిషికి ఒక ప్రత్యేక వ్యక్తిత్వం ఉంటుంది. మీ భాగస్వామిలో ఉన్న ప్లస్ పాయింట్స్ (సానుకూలతలు) మీద దృష్టి పెడితే సంతోషంగా ఉంటారట.

వినే ఓపిక ఉండాలి (Listening): సమస్యలు వచ్చినప్పుడు వాదింకోవడం కంటే, అవతలి వారు ఏం చెప్పాలనుకుంటున్నారో వినడం ముఖ్యమట. భాగస్వామికి ఏదైనా బాధ కలిగినప్పుడు వారు చెప్పేది ఓపికగా వింటే సగం సమస్య అక్కడే తీరిపోతుందట.

సాయంత్రం వేళ ప్రశాంతత: చాణక్య నీతి ప్రకారం, రోజంతా పనుల ఒత్తిడిలో ఉన్నా, సాయంత్రం ఇంటికి వచ్చాక దంపతులు కనీసం కొద్దిసేపు ప్రశాంతంగా మాట్లాడుకోవాలట. ఆ సమయంలో ఫోన్లు, టీవీలు పక్కన పెట్టి ఒకరి కోసం ఒకరు సమయం కేటాయించుకోవాలట.

గతాన్ని తవ్వుకోకూడదు: ఏదైనా చిన్న గొడవ జరిగినప్పుడు పాత విషయాలను మళ్ళీ మళ్ళీ ప్రస్తావించడం చాలా మంది చేసే పెద్ద తప్పట. జరిగిన తప్పును క్షమించి, అక్కడితో వదిలేయడం వల్ల బంధం విడిపోకుండా ఉంటుందట.

చిన్న చిన్న సంతోషాలు: సంసారంలో కొత్తదనం ఉండాలంటే అప్పుడప్పుడు సర్ ప్రైజ్ లు ఇవ్వడం, కలిసి బయటకు వెళ్లడం లేదా ఒకరి పనిలో ఒకరు సాయం చేసుకోవడం వంటివి చేయాలట. ఇవి బంధాన్ని మరింత గట్టిపరుస్తాయట.

ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం: ఏ బంధంలోనైనా సర్దుబాటు (Adjustment) అనేది ఇద్దరి వైపు నుండి ఉండాలట. ఒకరినే తగ్గమంటే అది భారమవుతుందట ఇద్దరూ కలిసి అడుగు వేస్తే అది అందమైన ప్రయాణమవుతుందట.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: ఆ తేదీలో పుట్టిన వారి జీవితం ఎప్పుడూ స్థిరంగా ఉండదట

 

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×