E-Paper
Advertisement

Costly Mistakes: మీరు చేసే ఈ చిన్న తప్పిదాలే.. మిమ్మల్ని పేదోడిలా మార్చేస్తాయట!

Costly Mistakes: మీరు చేసే ఈ చిన్న తప్పిదాలే.. మిమ్మల్ని పేదోడిలా మార్చేస్తాయట!
Advertisement

Costly Mistakes: జీవితాంతం కష్టపడినా ఆర్థికంగా వెనకబడి ఉండే వారిని మనం చాలా మందిని నిజ జీవితంలో చూస్తుంటాం. అయితే ఇందుకు కారణం వారి ఆలోచనా విధానం మాత్రమే. సంపన్నులుగా మారడం అనేది కేవలం వారి అదృష్టం మీద ఆధారపడి ఉండదు, అది తీసుకునే నిర్ణయాలపై మాత్రమే ఆధారపడి ఉంటుంది. సరైన టైం కోసం వెయిట్ చేయడం, కేవలం పొదుపుపై మాత్రమే ఆధారపడటం అంతే కాకుండా రిస్క్ తీసుకోవడానికి భయపడటం వంటి అలవాట్లు మనల్ని పేదరికంలోనే ఉంచుతాయి.

ఈ పొరపాట్లను అధిగమించి సరైన ప్లాన్ తో ముందడుగు వేసినప్పుడు మాత్రమే ఉన్నత శిఖరాలను చేరుకోవడం సాధ్యం అవుతుంది. ధనవంతులు అవడం లేదా జీవితంతో సక్సెస్ అవడం అనేవి కేవలం మనం అనుసరించే క్రమశిక్షణపై ఆధారపడి మాత్రమే ఉంటుంది. మనం చేసే చిన్న చిన్న తప్పులు మనల్ని ఆర్థికంగా ఎదగనీయకుండా చేస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

సరైన సమయం కోసం వేచి చూడటం:
చాలా మంది ఏదైన పని ప్రారంభించడానికి మంచి రోజు లేదా సరైన సమయం కోసం వేచి చేస్తుంటారు. కానీ నిజం ఏమిటంటే.. ప్రస్తుతమే అత్యంత సరైన సమయం. మీరు ఒక వ్యాపారం ప్రారంభించాలన్నా లేదా పెట్టుబడి పెట్టాలన్నా కూడా రేపు అనేది ఎప్పటికీ రాదు. ఇప్పుడే ప్రారంభించడం అనేది మీ విజయానికి మొదటి మెట్టు అని గుర్తించాలి. ఆలస్యం చేస్తే అవకాశాలు చేజారిపోతాయి.

కేవలం నగదు పొదుపు చేయడం:
చాలా మంది డబ్బును బ్యాంకుల్లో పొదుపు చేయడం లేదా, బీరువాల్లో దాచడం వంటివి చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల ధనవంతులం అయిపోతామని భావిస్తారు. కానీ పొదుపుతో సంపదను సృష్టించలేమని గుర్తించాలి. సంపన్నులు డబ్బును దాచరు దానిని పెట్టుబడి చేస్తారు. స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేట్ లేదా ఇతర వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టినప్పుడే మీ డబ్బు మీ కోసం పనిచేస్తుందని మీరు గుర్తించాలి.

Advertisement

ఆశయాలు లేని ఫ్రెండ్స్:
మీరు ఎవరితో సమయం గడుపుతారో మీ భవిష్యత్తు కూడా అలాగే ఉంటుందని మీరు గమనించారు. నీ స్నేహితులెవరో చెప్పు, నీ వ్యక్తిత్వం ఏంటో చెబుతారు అనే సామెతను ఎప్పుడో ఒకసారి మనం వింటూనే ఉంటాం. ఎప్పుడూ ఫిర్యాదులు చేసే వ్యక్తుల మధ్య ఉంటే మీరు కూడా అలాగే తయారవుతారని చెబుతారు. మీ చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా మిమ్మల్ని ప్రోత్సహించే వారిగా ఉండాలి. అంతే కాకుండా తెలివైన వారై ఉండాలి. మీ సర్కిల్ మిమ్మల్ని ఉన్నత స్థానానికి చేర్చాలి.

రిస్క్ తీసుకోకపోవడం:
జీవితంలో రిస్క్ తీసుకోకపోవడమే అతి పెద్ద రిస్క్. ఏ ఇబ్బంది లేకుండా జీవితాన్ని కోరుకునే వారు ఎప్పటికీ సాధారణ జీవితాన్ని గడుపుతారు.విజయం సాధించాలంటే తెలివైన నిర్ణయాలతో కూడిన రిస్క్ తీసుకోవడం చాలా ముఖ్యం. అంతే కాకుండా ఓడిపోవడం వల్ల కూడా అనుభవం వస్తుంది అని మీరు గుర్తించాలి. గెలిస్తే మాత్రం చరిత్ర సృష్టించవచ్చు.

ప్లాన్ లేకపోవడం:
లక్ష్యం ఉండి ప్లాన్ లేకపోతే అది కోరికగా మిగిలిపోతుంది. మీరు ప్లాన్ చేయడంలో ఫెయిల్ అయితే ప్రణాళిక సరిగ్గా లేదని అర్ధం, ప్రతి రోజు, ప్రతి నెల, ప్రతి ఏడాది మీరు ఏం సాధించాలో స్పష్టమైన స్లాన్ ఉండాలి. ఆర్థిక పరంగా సరైన క్రమశిక్షణ లేకపోతే మాత్రం మీరు అప్పుల ఊబిలో పడతారు.

Also Read: కాఫీ, టీలకు బదులుగా హెర్బల్‌టీలు తాగితే.. ఇన్ని లాభాలా ?

అంచనా లోపం:
చాలా మంది తమను తాము తక్కువగా అంచనా వేసుకుంటారు. పెద్ద కలలు మన వల్ల కాదు అని అనుకుంటారు. ఇలాంటి ఆలోచన మానేయాలి. మీ ఆలోచన పెద్దగా ఉన్నప్పుడు మాత్రమే మీ ఎదుగుదల గొప్పగా ఉంటుంది. మిమ్మల్ని మీరు నమ్మండి. ఇలా చేయడం వల్ల మాత్రమే మీరు అసాధ్యం అనుకొన్నవి సుసాధ్యం చేయగలుగుతారు.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×