E-Paper
Advertisement

Chinese Oils: ఈ చైనా నూనెలు వాడారంటే జుట్టు పొడవుగా, ఒత్తుగా పెరగేస్తుందట

Chinese Oils: ఈ చైనా నూనెలు వాడారంటే జుట్టు పొడవుగా, ఒత్తుగా పెరగేస్తుందట
Advertisement

ఈ రోజుల్లో జుట్టు రాలడం చాలా మందికి పెద్ద సమస్యగా మారింది. చిన్న వయసులోనే జుట్టు పలుచబడటం, చుండ్రు, డ్రై స్కాల్ప్ వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. దీని వల్ల ఎలాంటి నూనెలు వాడితే జుట్టు బాగా వాడితే మంచిదో తెలుసుకునేందుకు ఎంతోమంది ప్రయత్నిస్తారు. అలాంటి వాటిలో ఇప్పుడు చైనీస్ హెయిర్ ఆయిల్స్ గురించి ఎక్కువగా మాట్లాడుతుకుంటున్నారు. చైనీస్ సంప్రదాయ వైద్య విధానంలో వాడే కొన్ని నూనెలు జుట్టు పెరుగుదలకు, స్కాల్ప్ ఆరోగ్యానికి ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు.

వేల సంవత్సరాలుగా చైనాలో హెర్బల్ ఆయిల్స్‌ను జుట్టు పెరుగుదలకు ఉపయోగిస్తున్నారు. ఇవి జుట్టును త్వరగా పెంచుతాయని కాకపోయినా, జుట్టు బలంగా పెరగడానికి అవసరమైన బలాన్ని ఇస్తాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా రక్త ప్రసరణను పెంచడం, జుట్టు వేర్లకు పోషణ అందించడం ద్వారా ఇవి పని చేస్తాయని చెబుతున్నారు.

Advertisement

చైనీస్ హెయిర్ ఆయిల్స్ ఇవే
చైనీస్ హెయిర్ ఆయిల్స్‌లో ముఖ్యంగా ఐదు నూనెలు అధికంగా వాడతారు. వాటిలో మొదటిది హీ షౌ వూ ఆయిల్ (Fo-Ti Oil). ఈ నూనెను చైనాలో జుట్టు రాలడాన్ని తగ్గించడానికి, జుట్టు నల్లగా ఉంచడానికి వాడతారు. ఇది స్కాల్ప్‌కు పోషణ ఇచ్చి, జుట్టు వేర్లను బలపరుస్తుందని చెబుతారు. దీర్ఘకాలంగా వాడితే జుట్టు ఆరోగ్యంలో మార్పు కనిపించవచ్చని నిపుణులు అంటున్నారు.

జిన్సెంగ్
జిన్సెంగ్ ఆరోగ్యానికి ఎంత ఉపయోగమో తెలిసిందే. ఇదే విధంగ, జిన్సెంగ్ ఆయిల్ స్కాల్ప్‌లో రక్త ప్రసరణను పెంచుతుంది. దీని వల్ల నిద్రావస్థలో ఉన్న హెయిర్ ఫాలికల్స్ చురుకుగా మారే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. జుట్టు పలుచగా ఉన్నవారు దీనిని ఉపయోగించవచ్చని సూచిస్తున్నారు.

Advertisement

కామెలియా ఆయిల్.
ఇది చాలా తేలికపాటి నూనె. జుట్టుకు త్వరగా పట్టి, జిడ్డుగా ఉండదు. ఇందులో మంచి ఫ్యాటీ యాసిడ్స్ ఉండటం వల్ల జుట్టు పొడిబారకుండా కాపాడుతుంది. జుట్టు తెగిపోవడం తగ్గించి, మృదువుగా మారేందుకు సహాయపడుతుంది. ముఖ్యంగా డ్రై హెయిర్ ఉన్నవారికి ఇది మంచి ఎంపికగా చెప్పుకోవాలి.

Also read: Spinach Fry: పాలకూర నువ్వుల వేపుడు రెసిపీ, తింటే ఎంతో ఆరోగ్యం పైగా రుచికి రుచి

జింజర్ ఆయిల్
అల్లం వేడి గుణం కలిగి ఉండటంతో ఇది స్కాల్ప్‌లో రక్త ప్రసరణను వేగంగా పెంచుతుంది. అయితే ఇది చాలా శక్తివంతమైన నూనె. కాబట్టి నేరుగా తలకు రాయకుండా, కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనెతో కలిపి వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. సరైన విధంగా వాడితే కొత్త జుట్టు పెరుగుదలకు అనుకూలంగా పనిచేస్తుందని అంటున్నారు.

నువ్వుల నూనె
ఇది చైనీస్ ఆయిల్స్‌లో ప్రధానమైన క్యారియర్ ఆయిల్‌గా వాడతారు. స్కాల్ప్ పొడిబారడం, చుండ్రు సమస్యలను తగ్గించడంలో ఇది ఉపయోగపడుతుంది. ఇతర హెర్బల్ ఆయిల్స్‌తో కలిపి మసాజ్ చేస్తే మంచి ఫలితం కనిపించవచ్చని చెబుతున్నారు.

ఆరోగ్య నిపుణులు చెబుతున్న ప్రకారం ఈ ఆయిల్స్ వాడితే వెంటనే ఫలితం వస్తుందని అనుకోకూడదు. క్రమం తప్పకుండా ఓపికతో వాడితే మాత్రమే జుట్టు బాగా ఎదుగుతుంది.వారానికి రెండు నుంచి మూడు సార్లు తలకు మసాజ్ చేయడం మంచిదని సూచిస్తున్నారు. అలాగే జుట్టు రాలడం ఎక్కువగా ఉంటే తప్పనిసరిగా డెర్మటాలజిస్ట్‌ను సంప్రదించాలని చెబుతున్నారు.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×