E-Paper
Advertisement

Low BP: మీ బీపీ పడిపోతే వెంటనే కనిపించే లక్షణాలు ఇవే, వెంటనే ఏం చేయాలంటే?

Low BP: మీ బీపీ పడిపోతే వెంటనే కనిపించే లక్షణాలు ఇవే, వెంటనే ఏం చేయాలంటే?
Advertisement

ఇటీవల కాలంలో చాలా మందిలో లో బీపీ (తక్కువ రక్తపోటు) సమస్య పెరుగుతున్నట్టు వైద్యులు చెబుతున్నారు. సాధారణంగా రక్తపోటు 90/60 కంటే తక్కువగా ఉంటే దాన్ని లో బీపీగా భావిస్తారు. చాలామంది దీనిని పెద్ద సమస్యగా తీసుకోరు కానీ కొన్ని సందర్భాల్లో ఇది ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా వృద్ధులు, బలహీనంగా ఉన్నవారు, సరైన ఆహారం తీసుకోని వారు ఈ సమస్యకు ఎక్కువగా గురవుతున్నారు. అందుకే లో బీపీ లక్షణాలు ఏమిటో, వచ్చిన వెంటనే ఏం చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోండి.

లో బీపీ లక్షణాలు
లో బీపీ వచ్చినప్పుడు శరీరం కొన్ని సంకేతాలు ఇస్తుంది. ముఖ్యంగా తల తిరగడం, బలహీనంగా అనిపించడం, అలసట ఎక్కువగా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొందరికి ఒక్కసారిగా కళ్ల ముందు చీకటి కమ్ముకోవడం, స్పష్టంగా కనిపించకపోవడం జరుగుతుంది. మరికొందరికి వాంతులు, చెమటలు పట్టడం, గుండె వేగం తగ్గడం లేదా పెరగడం కూడా కనిపిస్తుంది. తీవ్రమైన పరిస్థితుల్లో మూర్చ పోవడం కూడా జరుగుతుంది. ఈ లక్షణాలు కనిపించినప్పుడు శరీరానికి సరైన రక్తప్రసరణ జరగడం లేదని అర్థం.

Advertisement

Also read: Beetroot Stains: బీట్‌రూట్ కట్ చేస్తే చేతులు, బట్టలపై ఎర్ర మరకలు పడుతున్నాయా? ఇలా వదిలించేసుకోండి

కారణాలు
ఈ సమస్యకు అనేక కారణాలు ఉంటాయి. ముఖ్యంగా శరీరంలో నీరు తక్కువగా ఉండటం, రక్తహీనత (అనీమియా), పోషకాహారం లోపం, విటమిన్ B12 లేదా ఐరన్ లోపం వంటి కారణాలు లో బీపీకి దారి తీస్తాయి. అలాగే గర్భధారణ సమయంలో, గుండె సంబంధిత సమస్యలు ఉన్నప్పుడు, లేదా కొన్ని మందులు వాడినప్పుడు కూడా రక్తపోటు తగ్గే అవకాశం ఉంటుంది. ఎక్కువసేపు నిలబడి ఉండటం, ఒక్కసారిగా కూర్చున్న స్థితి నుంచి లేవడం కూడా ఈ సమస్యను పెంచుతుంది. అందుకే జీవనశైలి, ఆహారం విషయంలో జాగ్రత్తలు చాలా ముఖ్యం.

Advertisement

Also read: Goddess Lakshmi: మహిళలు చేసే ఈ తప్పులు.. ఇంట్లో డబ్బుల కష్టాలు తెచ్చిపెడతాయి

లో బీపీని నియంత్రించడానికి కొన్ని సులభమైన మార్గాలు ఉన్నాయి. రోజుకు తగినంత నీరు తాగడం చాలా ముఖ్యం. డాక్టర్ సలహా మేరకు కొద్దిగా ఉప్పు ఉన్న ఆహారం తీసుకోవచ్చు. అలాగే పండ్లు, కూరగాయలు, ఐరన్, విటమిన్లు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి. ఒక్కసారిగా లేవకుండా నెమ్మదిగా కదలాలి. శరీరానికి విశ్రాంతి ఇవ్వడం కూడా అవసరం. లక్షణాలు తరచుగా కనిపిస్తే లేదా తీవ్రంగా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది. సరైన జాగ్రత్తలు తీసుకుంటే లో బీపీ సమస్యను సులభంగా నియంత్రించుకోవచ్చు.

లోబీపీ వస్తే ఇలా చేయండి
లోబీపీ మీరు ఇంట్లో ఉన్నప్పుడు ఒక్కసారిగా తన లక్షణాలను చూపిస్తే వెంటనే కూర్చోండి. లేదా పడుకోండి. నిలబడి మాత్రం ఉండకండి. కాళ్లను కొంచెం ఎత్తుగా పెడితే మెదడుకు రక్తప్రసరణ పెరుగుతుంది. అలాగే నిమ్మరసం, ఉప్పు కలిపిన నీటిని తాగండి. ఓపిక తెచ్చుకుని గాలి తగిలే చోటుకు వెళ్లండి. వెంటనే లేవకుండా మెల్లగా నిల్చవాలి.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×