E-Paper
Advertisement

Healthy Food: మీ డైట్‌లో ఈ 3 ఉంటే.. గ్యాస్, ఎసిడిటీకి చెక్ పెట్టొచ్చు!

Healthy Food: మీ డైట్‌లో ఈ 3 ఉంటే.. గ్యాస్, ఎసిడిటీకి చెక్ పెట్టొచ్చు!
Advertisement

Healthy Food: ప్రస్తతం మారుతున్న జీవన శైలి కారణంగా జీర్ణ వ్యవస్థతో పాటు కలేయం అనేక ఒత్తిడికి లోనవుతున్నాయి. ప్రాసెస్ చేసిన ఆహారంతో పాటు అధిక చెక్కరలు మన శరీరంలో మంచి బ్యాక్టీరియాను చాలా వరకు దెబ్బతీస్తాయి. ఇదిలా ఉంటే గ్యాస్ట్రోఎంటరాలజిస్టుల ప్రకారం కేవలం మూడు రకాల ఆహారాలను మనం ప్రతి రోజు డైట్ లో భాగంగా చేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. దీని వల్ల పేగుల్లోని మైక్రోబయోమ్ ను బలోపేతం చేయడం మాత్రమే కాకుండా కాలేయంలో కూడా కొవ్వు చేరకుండా కాపాడుకోవచ్చు. ఇంతకీ ఆ 3 అద్భుతమైన ఆహారాలేంటో తెలుసుకుందామా..

ఎలాంటి ఆహార పదార్థాలు తింటే గట్ హెల్త్‌కు ప్రయోజనకరం:

Advertisement

1. పులియబెట్టిన ఆహారాలు (పెరుగు/కిమ్చీ/మజ్జిగ):

గ్యాస్ట్రోఎంటరాలజిస్టుల మొదటి ప్రాధాన్యత ఇచ్చేది పులియబెట్టిన ఆహారాలు. ఇందులో ముఖ్యంగా పెరుగు లేదా మజ్జిగ ప్రధానమైనవి.

Advertisement

ప్రయోజనం: వీటిలో ‘ప్రోబయోటిక్స్’ (మంచి బ్యాక్టీరియా) పుష్కలంగా ఉంటాయి. ఇవి పేగుల్లోని మైక్రోబయోమ్‌ను సమతుల్యం చేస్తాయి.

ప్రభావం: పేగుల్లో మంటను తగ్గించి, ఆహారం సులభంగా జీర్ణమయ్యేలా చేస్తాయి. ఇది కాలేయంపై ఒత్తిడిని తగ్గించి, శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది.

2. ఫైబర్ అధికంగా ఉండే క్రూసిఫెరస్ కూరగాయలు:

రెండవది బ్రోకలీ, క్యాబేజీ, క్యాలీఫ్లవర్ వంటి క్రూసిఫెరస్ కూరగాయలు. నిపుణులు వీటిని రోజూ ఏదో ఒక రూపంలో తీసుకుంటారు.

ప్రయోజనం: వీటిలో ఉండే సల్ఫోరాఫేన్ , ఇతర ఫైటోకెమికల్స్ కాలేయం పనితీరును మెరుగుపరుస్తాయి.

కాలేయ రక్షణ: ఇవి కాలేయంలోని సహజ నిర్విషీకరణప్రక్రియను ప్రేరేపిస్తాయి. కాలేయం చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కరిగించడానికి అంతే కాకుండా ఎంజైమ్ స్థాయిలను సాధారణ స్థితిలో ఉంచడానికి ఇవి ఎంతో మేలు చేస్తాయి.

3. బెర్రీలు,పాలీఫెనాల్స్ అధికంగా ఉండే పండ్లు:

బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్ లేదా మన దగ్గర దొరికే ఉసిరి, నల్ల ద్రాక్ష వంటి పండ్లను గ్యాస్ట్రో నిపుణులు సిఫార్సు చేస్తారు.

యాంటీ ఆక్సిడెంట్స్: వీటిలో ఉండే ఆంథోసైనిన్స్, పాలీఫెనాల్స్ శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్‌గా పనిచేస్తాయి.

లివర్ సేఫ్టీ: కాలేయం దెబ్బతినకుండా ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షిస్తాయి. ఇవి కాలేయంలో ఫైబ్రోసిస్ లేదా స్కార్ టిష్యూ ఏర్పడకుండా నిరోధించడంలో సహాయపడతాయి.

Also Read: డ్రింక్ చేశారా? మీ బాడీ నుంచి పూర్తిగా ఆల్కహాల్ బయటకు వెళ్లడానికి పట్టే సమయం ఇదే!

ఈ మూడు ఆహారాలు కేవలం పోషకాలను అందించడమే కాకుండా.. శరీరంలోని వాపునుతగ్గిస్తాయి. ఆధునిక ఆహారపు అలవాట్ల వల్ల వచ్చే ‘లీకీ గట్’ సమస్యను ఇవి నివారిస్తాయి.

కేవలం ఖరీదైన మందులు వాడటం కంటే.. మన వంటగదిలో దొరికే ఈ మూడు రకాల ఆహారాలను లైఫ్ స్టైల్‌లో భాగం చేసుకోవడం వల్ల దీర్ఘకాలిక కాలేయ వ్యాధుల నుండి రక్షణ పొందవచ్చు. సమతుల్య ఆహారం, తగినంత నీరు, వ్యాయామంతో కలిపి ఈ ఆహారాలను తీసుకుంటే మీ జీర్ణవ్యవస్థ ఎల్లప్పుడూ చురుగ్గా ఉంటుంది.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×