E-Paper
Advertisement

Winter Hydration: చలికాలంలోనూ డీహైడ్రేషన్.. మీలో ఎంతమందికి ఈ లక్షణాల గురించి తెలుసు ?

Winter Hydration: చలికాలంలోనూ డీహైడ్రేషన్.. మీలో ఎంతమందికి ఈ లక్షణాల గురించి తెలుసు ?
Advertisement

Winter Hydration: చలికాలంలో డీహైడ్రేషన్ సమస్యను చాలా మంది అంతగా పట్టించుకోరు. చలిలో చెమట పట్టదు కాబట్టి.. తక్కువ నీరు తాగాలని అనుకుంటారు. కానీ ఇది పెద్ద తప్పు. అందుకే చలి కాలంలో డీహైడ్రేషన్ ప్రమాదం పెరుగుతుంది. కానీ దాని లక్షణాలు చాలా నెమ్మదిగా కనిపిస్తాయి. దీనికి ఒక కారణం ఏమిటంటే.. చల్లని గాలిని పీల్చడం వల్ల శరీరం నుంచి తేమ వేగంగా పోతుంది. మరొక కారణం ఏమిటంటే.. చల్లని వాతావరణంలో, శరీరం నీరు తాగలన్న కోరికను అణిచివేస్తుంది. అందుకే.. మనకు తక్కువ దాహం అనిపిస్తుంది. అంతేకాకుండా.. ఈ సమయంలో చాలా మంది టీ, కాఫీ లేదా సూప్ వంటి వేడి డ్రింక్స్ కాబట్టి ఎక్కువగా ఆధారపడతారు. ఇవి నీటిని శరీరంలో భార్తీ చేయలేవు.

Advertisement

చలికాలంలో డీహైడ్రేషన్ ఎందుకు పెరుగుతుందో ఇలా  గుర్తించండి:

Advertisement

తాగే నీరు:

చలికాలంలో డీహైడ్రేషన్ పెరగడానికి అతిపెద్ద కారణం మనకు దాహం తక్కువగా అనిపించడమే. చలికాలంలో.. శరీరం వేడిని నిలుపుకోవడానికి రక్త నాళాలను సంకోచించేలా చేస్తుంది. ఈ ప్రక్రియ మెదడులో నీరు తాగాలన్న కోరికను అణిచివేస్తుంది. రెండవది, మనకు చెమట పట్టదు కాబట్టి మనం నీరు తాగాల్సిన అవసరం లేదని అనుకుంటాం.

శ్వాసకోశ నీటి నష్టం:

చలికాలంలో గాలి సాధారణంగా పొడిగా, చల్లగా ఉంటుంది. మనం చల్లని గాలిని పీల్చినప్పుడు.. మన శరీర అంతర్గత తేమను ఉపయోగించి దానిని వేడి చేసి తేమగా చేస్తాయి. మనం గాలిని వదిలినప్పుడు.. ఆ తేమ ఆవిరిగా విడుదల అవుతుంది. శరీరం నుం ఇలా పదే పదే ద్రవం కోల్పోవడాన్ని శ్వాసకోశ నీటి నష్టం అంటారు.

చలికాలంలో ఎక్కువ యూరిన్:

చల్లని వాతావరణంలో.. శరీరం రక్త నాళాలను సంకోచించేలా చేసి.. గుండె చుట్టూ రక్తాన్ని కేంద్రీకరిస్తుంది. అప్పుడు మెదడు కిడ్నీలకు ఎక్కువ మూత్రాన్ని ఉత్పత్తి చేయమని సంకేతాలు ఇస్తుంది. దీనిని కోల్డ్ డైయూరిసిస్ అంటారు. దీని వల్ల శరీరం ఎక్కువ నీటిని బయటకు పంపిస్తుంది.

యూరిన్ రంగు:

డీహైడ్రేషన్‌ను గుర్తించడానికి సులభమైన మార్గం మీ యూరిన్ రంగును చెక్ చేయడం. మీరు తగినంతగా హైడ్రేట్ అయి ఉంటే.. యూరిన్ లేత పసుపు లేదా దాదాపు పారదర్శకంగా ఉంటుంది. మూత్రం ముదురు పసుపు రంగులో ఉంటే, మీరు వెంటనే ఎక్కువ నీరు తాగాలి అనేదానికి ఇది స్పష్టమైన సంకేతం.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×