E-Paper
Advertisement

Sweet corn Kebab: స్వీట్ కార్న్ కబాబ్‌… దీన్ని ఇంట్లోనే సులువుగా చేసేయండి, రెసిపీ ఇదిగో

Sweet corn Kebab: స్వీట్ కార్న్ కబాబ్‌… దీన్ని ఇంట్లోనే సులువుగా చేసేయండి, రెసిపీ ఇదిగో
Advertisement

సాయంత్రం అయితే చాలు ఏవైనా స్నాక్స్ వేడివేడి తినాలనిపిస్తుంది. ఈ మధ్య స్వీట్ కార్న్ కబాబ్ రెసిపీ సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయింది. తక్కువ సమయంలో అద్భుతమైన రుచితో వచ్చే ఈ రెసిపీ పిల్లల నుంచి పెద్దల వరకు నచ్చుతుంది. సాధారణంగా కబాబ్ అంటే నాన్‌ వెజ్ వంటకాలే గుర్తుకొస్తాయి. కానీ స్వీట్ కార్న్‌తో తయారుచేసే వెజ్ కబాబ్ ఇది. కార్న్‌లో ఉండే ఫైబర్, విటమిన్లు, మినరల్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. దీని రెసిపీ ఎలాగో ఇక్కడ ఇచ్చాము. ఇది ఫాలో అయిపోండి.

స్వీట్ కార్న్ కబాబ్ రెసిపీకి కావాల్సిన పదార్థాలు
స్వీట్ కార్న్ గింజలు – ఒక కప్పు
ఉల్లిపాయ తరుగు – పావు కప్పు
ఉప్పు – రుచికి సరిపడా
కారం – ఒక స్పూన్
గరం మసాలా – అర స్పూను
అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక స్పూను
బంగాళదుంప – ఒకటి
బ్రెడ్ పొడి – అర కప్పు
కొత్తిమీర తరుగు – రెండు స్పూన్లు
నిమ్మరసం – ఒక స్పూను
నూనె – సరిపడినంత

Advertisement

స్వీట్ కార్న్ కబాబ్ రెసిపీ తయారీ విధానం
1. స్వీట్ కార్న్ గింజలను ఒలిచి వేడి నీటిలో వేసి అయిదు నిమిషాలు ఉడికించాలి. ఇప్పుడు వాటిని మిక్సీలో వేసి కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలి.
2. ఒక పెద్ద గిన్నెలో కార్న్ మిశ్రమాన్ని వేయాలి. అందులోనే ఉల్లిపాయ తరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరపపొడి, గరం మసాలా, ఉప్పు, కొత్తిమీర, నిమ్మరసం వేసి బాగా కలపాలి.
3. బంగాళాదుంపను ఉడికించి పొట్టు తీసి దాన్ని మెత్తగా చేత్తోనే మెదిపి కార్న్ మిశ్రమంలో కలుపుకోవాలి.
4. ఇప్పుడు చేతికి కొద్దిగా నూనె రాసుకుని, ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న కబాబ్‌లా ఆకారంలో చుట్టుకోవాలి.
5. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి. ఆ నూనె వేడెక్కాక కబాబ్ లను రెండు వైపులా వేయించాలి.
6. కబాబ్ ముదురు రంగులోకి వేగే వరకు వచ్చి తీసి టిష్యూ పేపర్ మీద వేయండి. అదనపు నూనె ఇది పీల్చేస్తుంది.
7. అంతే టేస్టీ స్వీట్ కార్న్ కబాబ్ రెసిపీ సిద్ధమైనట్టే.

కబాబ్‌ను టమోటా సాస్, పుదీనా చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటుంది. పిల్లలు ఈ కబాబ్ చాలా ఇష్టంగా తింటారు. స్వీట్ కార్న్‌లో ఉండే పుష్కలమైన ఫైబర్ జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. బంగాళదుంపలో ఉండే కార్బోహైడ్రేట్లు త్వరగా శక్తిని అందిస్తాయి. సాయంత్రం పూట ఒక్కసారి స్వీట్ కార్న్ కబాబ్ చేసి చూడండి మీరు చాలా ఇష్టంగా తింటారు.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×