// // Sunstroke Prevention Tips: ఎండలో బయటకు వెళ్తున్నారా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ పొరపాట్లు అస్సలు చేయకం -->
E-Paper
Advertisement

ఎండలో బయటకు వెళ్తున్నారా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే.. ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!

ఎండలో బయటకు వెళ్తున్నారా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే.. ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
Advertisement

Sunstroke Prevention Tips: తెలుగు రాష్ట్రాల్లో రోజు రోజుకూ ఎండలు పెరుగుతున్నాయి. పెరుగుతున్న ఎండలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ప్రస్తుతం బయట అడుగు పెట్టాలంటేనే జనం భయపడే పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉంటే సమ్మర్లో చాలా మంది ఎదుర్కునే సమస్య వడదెబ్బ. ఈ సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే కొన్ని సార్లు ప్రాణాపాయం ఏర్పడే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే వడదెబ్బ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంతకీ ఎలాంటి టిప్స్ పాటిస్తే సమ్మర్లో వడదెబ్బ బారిన పడకుండా ఉండొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

Advertisement

1. హైడ్రేటెడ్‌గా ఉండటం:

సమ్మర్లో శరీరానికి కావల్సినంత నీరు తాగడం ముఖ్యం. ఈ సమయంలో దాహం వేయకపోయినా కూడా మంచి నీళ్లు తాగుతూ ఉండాలి. రోజులో 3-4 లీటర్ల నీరు తప్పకుండా తాగాలి. అంతే కాకుండా కొబ్బరి నీళ్లు, మజ్జిగ, ఓఆర్ఎస్ వంటివి తీసుకోవడం అలవాటు చేసుకోవాలి.

Advertisement

2.సరైన బట్టలు:

ఎండాకాలంలో బయటకు వెళ్లేటప్పుడు లేత రంగు బట్టలు మాత్రమే ధరించాలి. ఇవి గాలి లోపలికి పంపి శరీరాన్ని చల్లగా ఉంచుతాయి. నలుపు, ముదురు రంగులను వాడకుండా ఉండటం మంచిది.

3.వేళాపాళా చూసుకోండి:

మధ్యాహ్నం సమయంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల లోపు వీలైనంత వరకు బయటకు వెళ్లకుండా ఉండటం మంచిది.

4. ఆహారం:

సమ్మర్‌లో నూనెలో వేయించిన పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది. అంతే కాకుండా మసాలాలు తగ్గించి, దోసకాయ, పుచ్చకాయ వంటి వాటిని తీసుకోవడం వల్ల శరీరంలో నీటి శాతం పెరుగుతుంది.

5. గొడుగు,సన్ గ్లాసెస్:

ఎండలోకి వెళ్లాల్సి వస్తే మాత్రం గొడుగు, సన్ గ్లాసెస్ , లేదా క్యాప్ వంటివి వాడటం మర్చిపోవద్దు.

వడదెబ్బ లక్షణాలు(Symptoms of sunstroke):
1. తీవ్రమైన తలనొప్పి, కళ్లు తిరగడం
2. గుండె వేగంగా కొట్టుకోవడం
3. వాంతులు, వికారం
4. చర్మం ఎర్రబడటం, పొడిబారడం
5. శరీర ఉష్ణోగ్రత 104 ∘ F లేదా 40 ∘ C కంటే పెరగడం.

ప్రాథమిక చికిత్స:
ఎవరైన వడదెబ్బకు గురైతే ప్రాథమిక చికిత్స చేయడం అవసరం.
1. బాధితుడిని వెంటనే నీడ ఉన్న ప్రాంతానికి లేదా ఏసీ గదిలోకి తీసుకు వెళ్లాలి.
2. తడి క్లాత్ తో శరీరాన్ని తుడవడం లేదా ఐస్ ప్యాక్ వంటివి వాడటం చేయాలి.
3.స్పృహలో ఉంటే మాత్రం చల్లటి నీరు లేదా ఓఆర్ఎస్ వంటివి తాగించాలి.

వడదెబ్బ ఎవరికి ఎక్కువ ప్రమాదం:
1. చిన్న పిల్లలు వృద్ధుల్లో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి వీరికి ప్రమాదం.
2. గర్భిణీలు
3. బీపీ, షుగర్ వంటి వ్యాధులు ఉన్న వారికి
4. బయట పనిచేసే కూలీలు, ట్రాఫిక్ పోలీసులు అంతే కాకుండా డెలివరీ బాయ్స్.

సమ్మర్ సూపర్ ఫుడ్స్:
రాగి జావ: సమ్మర్ లో రాగి జావ తాగడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. శరీరాన్ని తక్షణమే చల్లబరచడంలో రాగి జావ ఉపయోగపడుతుంది.

సబ్జా గింజలు: నీళ్లలో సబ్జా గింజలను నానబెట్టి తాగడం వల్ల వేడి తగ్గుతుంది.

ఉల్లిపాయ: సమ్మర్ లో మధ్యాహ్న భోజన సమయంలో పచ్చి ఉల్లిపాయ తినడం వల్ల వడదెబ్బ తగలకుండా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

గమనిక:
పైన పేర్కొన్న జాగ్రత్తలు పాటిస్తూ.. ఈ సమ్మర్లో మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా అనారోగ్య సమస్య ఉంటే.. వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం మంచిది.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×