E-Paper
Advertisement

Sugarcane Juice: చర్మ సౌందర్యానికి చెరుకు రసం ఎలా ఉపయోగపడుతుందో తెలుసా !

Sugarcane Juice: చర్మ సౌందర్యానికి చెరుకు రసం ఎలా ఉపయోగపడుతుందో తెలుసా !
Advertisement

Sugarcane Juice For Skin Beatuy: సమ్మర్ లో చెరుకు అధికంగా లభిస్తుంది. ఎండాకాలం చెరుకు రసం తాగడం వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. నిమ్మరసం, అల్లం కలిపి తాజా చెరకు రసం తాగితే నీరసం, అలసట పోయి శరీరం శక్తిని పుంజుకుంటుంది. చెరుకు రసం ఆరోగ్యానికే కాదు..అందానికి, కేశ సౌందర్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. చెరుకురసం ప్రయోజనాల ఇప్పుడు గురించి తెలుసుకుందాం.

చెరకురసంలో ముల్తానీ మట్టిని కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుంటే ముఖంపై ఉన్న నల్ల మచ్చలు తొలగిపోతాయి. అంతే కాకుండా చర్మకణాలను ఇది పునరుత్తేజితం చేస్తుంది. చెరకు రసంలో తేనె కలిపి చర్మానికి మర్దన చేసి ఇరవై నిమిషాల తర్వాత కడిగేయాలి. వారానికి 2 సార్లు ఇలా చేయడం వల్ల చర్మం మృదువుగా తయారవుతుంది.

Advertisement

కాస్త చెరకు రసంలో కాఫీ పొడి కలిపి స్క్రబ్‌లా చేసి ఉపయోగిస్తే చర్మం మెరుస్తుంది. ద్రాక్ష రసం, నిమ్మ రసం, కొబ్బరి పాలు, యాపిల్ జ్యూస్, చెరకు రసం..వీటన్నింటినీ సమపాళ్లలో తీసుకొని మిక్స్ చేయాలి. తర్వత ఈ మిశ్రమాన్ని చర్మానికి అప్లై చేయాలి. ఎలా చేయడం వల్ల చర్మంపై ఉన్న మొటిమలు, మచ్చలు తొలగిపోతాయి.

Also Read: గుండె ఆరోగ్యానికి బ్లాక్ కాఫీ..

Advertisement

చర్మం యవ్వనంగా ఉండడానికి మామూలు ఐస్‌క్యూబ్‌ల కన్నా చెరకు రసంతో తయారు చేసుకున్న ఐస్ క్యూబ్‌ లు వాడితే రెట్టింపు ఫలితాలుంటాయి. బొప్పాయి గుజ్జులో చెరకు రసం కలిపి పట్టించడం వల్ల చర్మం కాంతివంతంగా తయారవుతుంది. నాలుగు చెంచాల చెరకు రసానికి రెండు చెంచాల నెయ్యి చేర్చి, చర్మానికి మర్దన చేస్తే ఎండ వల్ల మారిన చర్మం రంగు తిరిగి మునుపటి నిగారింపు సంతరించుకుంటుంది.

లీటరు నీటిలో పావు లీటరు చెరకు రసం, గుప్పెడు పుదీనా ఆకులు కలిపి మరిగించి ఆవిరి పట్టుకుంటే చర్మం కాంతి వంతంగా మారుతుంది. అంతే కాకుండా చెరకు రసాన్ని ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు చర్మానికి అప్లై చేసినా చర్మం ఆరోగ్యంగా, మృదువుగా తయారవుతుంది.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×