E-Paper
Advertisement

Social Media: ఒకే ఇంట్లో ఇద్దరు.. కానీ జీవితం మాత్రం ఆన్‌లైన్‌లో ? సొల్యూషన్ ఇదే..!

Social Media: ఒకే ఇంట్లో ఇద్దరు.. కానీ జీవితం మాత్రం ఆన్‌లైన్‌లో ? సొల్యూషన్ ఇదే..!
Advertisement

Social Media: ఒకప్పుడు భార్యాభర్తలు అంటే ‘ఒకే ప్రాణం.. ఒకే ఊపిరి’. కానీ ఇప్పుడు? ‘ఒకే ఇల్లు.. వేర్వేరు Wi-Fi కనెక్షన్లు’! బెడ్ మీద పడుకున్నా, సోఫాలో కూర్చున్నా.. కళ్ళు మాత్రం ఫోన్ స్మాల్ స్క్రీన్‌కే అతుక్కుపోయాయి.  ఇన్‌స్టాగ్రామ్ స్క్రోలింగ్ చేస్తూ భర్త.. ఫేస్‌బుక్ రీల్స్ చూస్తూ భార్య.. మధ్యలో మాట్లాడుదామంటే ‘ఒక్క నిమిషం’ అనే విసుగు. సోషల్ మీడియా మాయలో పడి మన పక్కనున్న పార్ట్‌నర్‌ని ‘మ్యూట్’ లో పెట్టేస్తున్నామా?
అవును, నిజమే! సైకాలజీ నిపుణుల షాకింగ్ విశ్లేషణ ప్రకారం.. ఈ డిజిటల్ కాలంలో సోషల్ మీడియా భార్యాభర్తల మధ్య దూరం పెంచుతోంది. ‘ఎమోషనల్ అటాచ్‌మెంట్’ కి మొబైల్ డేటా ‘చెక్’ పెడుతోంది.

ఎమోషనల్ అటాచ్‌మెంట్ గాలిలో దీపమేనా?
సైకాలజీ నిపుణుల ప్రకారం.. మనం ఫోన్ స్మాల్ స్క్రీన్‌ని చూస్తున్నంత సేపు పక్కనున్న పార్ట్‌నర్ పెద్ద మనసుని చూడలేకపోతున్నాం.
మ్యూట్ మోడ్: ఆఫీస్ నుంచి వచ్చాక ఆ రోజంతా ఏం జరిగిందో చెప్పుకునే ‘క్వాలిటీ టైమ్’ ఇప్పుడు మొబైల్ డేటాకి బలైపోతోంది.
ఇగ్నోరింగ్ వైబ్స్: భర్త ఏదో ఇంపార్టెంట్ విషయం చెబుతుంటే భార్య ఫోన్లో ‘షాపింగ్’ చూసినా.. భార్య ఏదో బాధలో ఉంటే భర్త ‘గేమ్స్’ ఆడుతున్నా.. అక్కడ మొదలవుతుంది అసలు గ్యాప్! “నన్ను పట్టించుకోవట్లేదు” అనే ఫీలింగ్ మెల్లగా అసంతృప్తిగా మారి, చిలికి చిలికి గాలివానలా గొడవలకు దారి తీస్తోంది.

Advertisement

‘రీల్’ లైఫ్ vs ‘రియల్’ లైఫ్.. పోలికల గోల!
సోషల్ మీడియాలో అందరూ తమ లైఫ్‌లోని Best Moments మాత్రమే పెడతారు.
“వాళ్ళ మొగుడు దుబాయ్ తీసుకెళ్లాడు.. మనోడు పక్కింటి దాబాకి కూడా తీసుకెళ్లడు!”
“వాళ్ళ పెళ్ళాం ఎంత సర్ప్రైజ్ ఇచ్చిందో చూడు.. మనకు మాత్రం అన్నీ తిట్లే!”
ఇలాంటి పోలికలు మనసులో చేరితే.. ఉన్న సుఖం కాస్తా ఊడిపోతుంది. పక్కవాడి లైఫ్ ‘పర్ఫెక్ట్’ అనుకోవడం వల్లే మన రియల్ లైఫ్‌లో చిచ్చు రేగుతోంది!

లైకులు.. కామెంట్లు.. అనుమానాల మంటలు!
ఎవరో అన్ నోన్ పర్సన్ ఫోటోకి మీ పార్ట్‌నర్ ‘లైక్’ కొట్టినా, ఎవరో పాత స్నేహితురాలు ‘కామెంట్’ పెట్టినా.. ఇక మొదలవుతుంది సీఐడీ లెవల్ ఇన్వెస్టిగేషన్!
చిన్న లైక్ పెద్ద అనుమానానికి దారి తీసి, నమ్మకాన్ని దెబ్బతీస్తోంది. కమ్యూనికేషన్ గ్యాప్ ఉన్నప్పుడు ఈ సోషల్ మీడియా నోటిఫికేషన్లు బాంబుల్లా పేలుతున్నాయి.

Advertisement

మరి ఈ ‘డిజిటల్ వైరస్’ కి మందు లేదా?
ఉంది! సైకాలజీ నిపుణులు కొన్ని క్రేజీ ‘డిజిటల్ బౌండరీస్’ సూచిస్తున్నారు:
నో ఫోన్ జోన్ (No Phone Zone): భోజనం చేసేటప్పుడు, పక్కన కూర్చుని కబుర్లు చెప్పుకునేటప్పుడు ఫోన్‌ని కనీసం 5 మీటర్ల దూరంలో పడేయండి.
బెడ్ టైమ్ రూల్: నిద్రపోయే ముందు కనీసం అరగంట పాటు ఇద్దరూ ఫోన్లు పక్కన పెట్టి ‘మనుషుల్లా’ మాట్లాడుకోండి.
డిజిటల్ డిటాక్స్: వీకెండ్ వచ్చిందంటే సోషల్ మీడియాకి సెలవు ఇచ్చి, ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకునే టైమ్ కేటాయించండి.
మాట్లాడండి: ఏదైనా డౌట్ వస్తే ఫోన్ లాక్కుని గొడవ పడకుండా.. ప్రశాంతంగా కూర్చుని చర్చించండి.

సోషల్ మీడియా అనేది మనల్ని కనెక్ట్ చేయడానికి ఉండాలి కానీ, పక్కనే ఉన్న మనుషుల నుంచి విడదీయడానికి కాదు. ఫోన్ లో ఉన్నది ‘డేటా’ మాత్రమే..కానీ పక్కన ఉన్నది ‘జీవితం’! ఆ జీవితాన్ని ఎంజాయ్ చేయండి.

also read:Kushaq Facelift: స్కోడా కుషాక్ ఫేస్‌లిఫ్ట్ వచ్చేసింది బాస్! ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే.. కానీ ఆ ఒక్క విషయంలోనే ‘ట్విస్ట్’!

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×