// // Wet Hair: ఈ అలవాటు మీ జుట్టును రహస్యంగా దెబ్బతీస్తుంది? వెంటనే మార్చుకోండి -->
E-Paper
Advertisement

Wet Hair: ఈ అలవాటు మీ జుట్టును రహస్యంగా దెబ్బతీస్తుంది? వెంటనే మార్చుకోండి

Wet Hair: ఈ అలవాటు మీ జుట్టును రహస్యంగా దెబ్బతీస్తుంది?  వెంటనే మార్చుకోండి
Advertisement

Wet Hair: జుట్టుతో నిద్రపోవడం చాలా మందికి ఉన్న సాధారణ అలవాటు. ముఖ్యంగా.. రాత్రిపూట ఆలస్యంగా స్నానం చేసేవారికి లేదా జుట్టు ఆరిపోయేంత వరకు వెయిట్ చేయలేరు. అయితే.. ఈ అలవాటు మీ జుట్టుకు, తలకు రహస్యంగా తీవ్రమైన హాని కలిగించవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జుట్టు తడిగా ఉన్నప్పుడు నిద్రపోవడం వల్ల కలిగే నష్టాలు, దీనిని ఎందుకు నివారించాలో వివరంగా తెలుసుకుందాం.

Advertisement

1. జుట్టు డ్యామేజ్ అయ్యే ప్రమాదం:

జుట్టు తడిగా ఉన్నప్పుడు అత్యంత బలహీనంగా, సున్నితంగా ఉంటుంది. నీరు జుట్టు బయటి పొర (క్యూటికల్) లోపలికి చొచ్చుకుపోయి. జుట్టు నిర్మాణంపై ఒత్తిడిని పెంచుతుంది. మీరు నిద్రపోయేటప్పుడు తలగడ, తడి జుట్టు మధ్య నిరంతర రాపిడి జరుగుతుంది. ఈ రాపిడి కారణంగా జుట్టు సులభంగా సాగిపోతుంది.. చిక్కులు పడుతుంది. ఫలితంగా డ్యామేజ్ అవుతుంది.

Advertisement

చివర్లు చిట్లడం: తడి జుట్టుతో నిద్రపోవడం వల్ల జుట్టు చివర్లు చిట్లిపోయే ప్రమాదం గణనీయంగా పెరుగుతుంది. ఇది జుట్టు పొడవుగా పెరగడానికి అడ్డుపడుతుంది.

2. ఫంగల్ ఇన్ఫెక్షన్లు, డాండ్రఫ్ :

తడి జుట్టుతో నిద్రపోవడం వల్ల తలగడ , స్కాల్ప్ (తలపై చర్మం) తేమగా ఉండి, శిలీంధ్రాలు, బ్యాక్టీరియా పెరగడానికి అనువైన వెచ్చని, తేమతో కూడిన వాతావరణం ఏర్పడుతుంది.

మాలాసెజియా : తల చర్మంపై సహజంగా ఉండే మాలాసెజియా అనే ఫంగస్ తేమ వాతావరణంలో వేగంగా వృద్ధి చెందుతుంది. ఇది చుండ్రు పెరగడానికి ప్రధాన కారణం. దురద, చికాకు: స్కాల్ప్‌లో ఇన్ఫెక్షన్లు, చుండ్రు వల్ల తరచుగా దురద, ఎరుపుదనం, చికాకు కలుగుతాయి.

3. తల చర్మం వాసన:

ఫంగస్ , బ్యాక్టీరియా పెరగడం వల్ల తల చర్మం నుంచి చెడు వాసన వచ్చే అవకాశం ఉంది. తడి స్కాల్ప్ సరిగ్గా గాలి ఆడకపోవడం వల్ల ఈ సమస్య మరింత పెరుగుతుంది.

4. సమస్యలు:

తడి జుట్టుతో నిద్రపోవడం వల్ల మరుసటి రోజు ఉదయం జుట్టు వికారంగా.. చిక్కులు పడిపోతుంది. జుట్టు పొడిగా ఉన్నప్పుడు ఎలా అయితే మౌల్డ్ అవుతుందో.. తడిగా ఉన్నప్పుడు నిద్రపోతే అదే విధంగా ఆరిపోయి, జుట్టు వింత ఆకృతిలో గట్టిపడుతుంది. దీనిని స్టైలింగ్ చేయడం లేదా సరిచేయడం చాలా కష్టమవుతుంది.

5. తలగడపై బ్యాక్టీరియా :

మీ తడి జుట్టు మీ తలగడ కవర్‌ను కూడా తడి చేస్తుంది. తలగడ కవర్లలో తేమ నిలిచిపోవడం వల్ల బ్యాక్టీరియా, ధూళి కణాలు సులభంగా పెరుగుతాయి. ఇది మొటిమల వంటి చర్మ సమస్యలకు కూడా దారితీసే ప్రమాదం కూడా ఉంటుంది.

Also Read: రాగి రొట్టె ఇలా తింటే.. ఎంత బరువున్నా ఈజీగా తగ్గిపోతారు

సురక్షితమైన అలవాట్లు:

తడి జుట్టుతో నిద్రపోవడం వల్ల కలిగే నష్టాలను నివారించడానికి ఈ చిట్కాలు పాటించండి.

ముందుగానే స్నానం చేయండి: నిద్రించడానికి కనీసం 2-3 గంటల ముందు జుట్టు కడుక్కోవడానికి ప్రయత్నించండి.

పూర్తిగా ఆరబెట్టండి: సహజంగా గాలికి ఆరిపోయేలా చేయండి. వీలైతే.. తక్కువ వేడి సెట్టింగ్‌లో హెయిర్ డ్రైయర్‌ను ఉపయోగించి జుట్టు మూలాలను బాగా ఆరబెట్టండి.

సిల్క్ పిల్లో కవర్ : ఒకవేళ అత్యవసరమై తడి జుట్టుతో నిద్రపోవాల్సి వస్తే.. కాటన్ కవర్ల కంటే తక్కువ రాపిడిని కలిగించే సిల్క్ లేదా శాటిన్ తలగడ కవర్‌లను ఉపయోగించండి.

వదులుగా జడ వేయండి: జుట్టు ఆరిన తర్వాత.. చిక్కులు పడకుండా ఉండేందుకు వదులుగా జడ వేసుకోవడం మంచిది.

జుట్టు బలంగా.. ఆరోగ్యంగా ఉండాలంటే.. తడి జుట్టుతో నిద్రపోయే అలవాటుకు వీలైనంత త్వరగా స్వస్తి చెప్పడం ఉత్తమం.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×