E-Paper
Advertisement

Natural Health Tips: మాయా లేదు మంత్రం లేదు.. ఏడు పవర్‌ఫుల్ సైంటిఫిక్ ట్రిక్స్‌తో శరీరాన్ని వెంటనే రీసెట్ చేయొచ్చు!

Natural Health Tips: మాయా లేదు మంత్రం లేదు.. ఏడు పవర్‌ఫుల్ సైంటిఫిక్ ట్రిక్స్‌తో శరీరాన్ని వెంటనే రీసెట్ చేయొచ్చు!
Advertisement

Natural Health Tips: అప్పుడప్పుడూ కొంతమంది ప్రతి చిన్న పనికీ ఏదో ఒక కారణం చెబుతూ.. మన శరీరం మన చేతుల్లో లేదని కబుర్లు చెబుతుంటారు. దీనిలో నిద్ర పట్టకపోవడం, ఆందోళన చెందటం, అలసటగా అనిపించడం, ఎనర్జీ తగ్గిపోవడం.. ఇవన్నీ మనం కంట్రోల్ చేయలేని విషయాల్లా భావిస్తుంటారు. కానీ నిజానికి మన శరీరం చిన్న చిన్న సంకేతాలకు కూడా చాలా వేగంగా స్పందిస్తుంది. సరైన సమయంలో సరైన పద్ధతిని ఉపయోగిస్తే.. మెదడు-శరీరం రెండింటినీ వెంటనే రీసెట్ చేయొచ్చు. దాని కోసం ఈ 7 సింపుల్ ట్రిక్స్‌ను ఫాలో అయిపోండి చాలు.

1. నిద్ర లేవలేక పోతుంటే:

ఉదయం అలారం మోగినా శరీరం ఇంకా స్లీప్ మోడ్‌లోనే ఉంటే.. ఊపిరిని కాస్త కంట్రోల్లో పెట్టండి. దీనికోసం 10 సెకండ్లు ఊపిరిని ఆపి, ఆ తర్వాత నెమ్మదిగా వదలండి. ఇలా చేయడం వల్ల రక్తంలో కార్బన్ డయాక్సైడ్ స్థాయి కాస్త పెరుగుతుంది. తర్వాత మీరు మళ్లీ ఊపిరి తీసుకున్నప్పుడు మెదడుకు ఒక్కసారిగా ఆక్సిజన్ చేరుతుంది. దాంతో మెదడు అలర్ట్ అవుతుంది, నిద్ర మత్తు తగ్గుతుంది.

2. నిద్ర పట్టడం లేదా?

Advertisement

పడుకునే ముందు మెదడు ఎక్కువగా యాక్టివ్‌గా ఉంటే.. నిద్ర రావడం కష్టమే. అలాంటి సమయంలో 60 సెకండ్లు వేగంగా కళ్లను మూసి తెరవడం వంటివి చేయండి. దీంతో కళ్లకు అలసట రావడం వల్ల మెదడులోని అలర్ట్ సిస్టమ్ నెమ్మదిగా తగ్గుతుంది. దీంతో శాంతిని కలిగించే నర్వ్ సిస్టమ్ యాక్టివ్ అవుతుంది. అప్పుడు ప్రశాంతమైన నిద్ర మీ సొంతం అవుతుంది.

Also Read: ఆవిరి పట్టడమే ప్రధాన సమస్యగా మారిందా?.. నిపుణులు చెబుతున్న ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!

3. ఎక్కువ ఆందోళన చెందుతుంటే:

Advertisement

ఏదైనా విషయం గురించి ఎక్కువగా టెన్షన్ పడుతుంటే.. గుండె వేగంగా కొట్టుకోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటం సాధారణమే. అలాంటి సమయంలో మీ గుండె మీద చేయి పెట్టుకుని.. 4 సెకండ్ల పాటు ఊపిరి తీసుకుని, 2 సెకండ్లు ఆపండి. తర్వాత 6 సెకండ్లు నెమ్మదిగా వదిలేయండి. ఇలా చేయడం వలన మెదడుకు ‘నేను సేఫ్‌ అనే’ సంకేతం వెళ్తుంది. ఆ తర్వాత 60 నుంచి 90 సెకండ్లలో గుండె దడ తగ్గడం మొదలవుతుంది.

4. బద్దకం/ అలసటగా అనిపిస్తే:

మెదడు ఒకే రకమైన పనులకు అలవాటు పడితే బద్ధకం మోడ్‌లోకి వెళ్లిపోతుంది. కాబట్టి ఆ సమయంలో దానిని ఉత్తేజపరచడం అవసరం. దాని కోసం ఒకవేళ మీకు రైట్ హ్యాండ్‌తో పళ్లుతోమే అలవాటు ఉంటే గనుక.. ఈసారి లెఫ్ట్ హ్యాండ్‌తో పళ్లు తోమండి. దీంతో మెదడు ఆలోచించాల్సి రావడంతో న్యూరల్ యాక్టివిటీ పెరుగుతుంది. దీని వల్ల అలసట తగ్గి, శరీరం యాక్టివ్‌గా మారుతుంది.

5. ముక్కు బ్లాక్ అయిందా?

సాధారణంగా ముక్కు బ్లాకేజ్ ఎక్కువగా లోపల వాపు వల్ల వస్తుంది. చల్లని స్పూన్ లేదా ఐస్ క్యూబ్‌ని నోటి పైభాగం దగ్గర కొన్ని సెకండ్ల పాటు ఉంచితే, రిఫ్లెక్స్‌గా ముక్కులోని వాపు తగ్గడం మొదలవుతుంది. దీని వల్ల శ్వాస తీసుకోవడం సులభతరం అవుతుంది.

6. నర్వస్‌గా ఫీలవుతుంటే:

నర్వస్‌నెస్ ఎక్కువగా ఉన్నప్పుడు నెమ్మదిగా ఊపిరి తీసుకుంటూ.. ముక్కు మధ్య భాగాన్ని మెల్లగా అదిమి పట్టుకోండి. ఇది శరీరంలో స్ట్రెస్‌ను తగ్గించే నర్వ్‌లను యాక్టివ్ చేస్తుంది. ఆ తర్వాత కొద్దిసేపటిలోనే మనసు కాస్త కుదుటపడుతుంది.

7. ఎనర్జీ పెరగాలంటే:

శరీరం పూర్తిగా శక్తిని కోల్పోయినప్పుడు ముఖానికి 3 నుంచి 5 సెకండ్ల పాటు చల్లని నీటిని చల్లుకోండి. ఇది శరీరంలో ‘వేక్-అప్ రెస్పాన్స్’ని ట్రిగ్గర్ చేస్తుంది. దీంతో వెంటనే అడ్రెనలిన్ రిలీజ్ అయి, మెదడు వెంటనే అలర్ట్ అయిపోతుంది.

ఇకపోతే మన శరీరం మన మాట వినదనుకోవడం ఒక అపోహ మాత్రమే. చిన్న చిన్న ట్రిక్స్‌తోనే నిద్ర, ఆందోళన, ఎనర్జీ లెవల్స్‌ను కంట్రోల్ చేసుకోవచ్చు. రోజూ ఇవి ప్రాక్టీస్ చేస్తే.. మీ శరీరం మీద మీకే విశ్వాసం పెరుగుతుంది.

Also Read: కిక్కు కోసం పెగ్గు అవసరం లేదు.. రోజుకొక హగ్గు చాలంటున్న వైద్య నిపుణులు!

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×