// // Cheating Signs: మీ భర్త ప్రవర్తనలో ఈ మార్పులు గమనించారా? -->
E-Paper
Advertisement

మీ భర్త ప్రవర్తనలో ఈ మార్పులు గమనించారా? అయితే మిమ్మల్ని చీట్ చేస్తున్నట్టే!

మీ భర్త ప్రవర్తనలో ఈ మార్పులు గమనించారా? అయితే మిమ్మల్ని చీట్ చేస్తున్నట్టే!
Advertisement

Cheating Signs: ఏ బంధానికైనా ‘నమ్మకం’ అనేది ఆక్సిజన్ లాంటిది.అది ప్రేమ అయినా, పెళ్లి అయినా… అయితే, ఈ డిజిటల్ యుగంలో వివాహేతర సంబంధాలు, నమ్మకద్రోహం అనేవి చాలా కామన్ అయిపోయాయి.అయితే మీ భర్త మిమ్మల్నిమోసం చేస్తున్నారా? లేక మీపై ప్రేమతోనే ఉన్నారా? అనేది ఈరోజుల్లో తెలుసుకోవడం మరీ అంత కష్టమేమీ కాదు. ఈ క్రింది లక్షణాలు మీ భర్తలో కనిపిస్తే మాత్రం.. మీరు వెంటనే అలర్ట్ అవ్వాల్సిందే.

తెలీని పాస్‌వర్డ్‌లు పెట్టేస్తున్నాడా ?

Advertisement

ఎప్పుడూ అంతగా ఫోన్ ని పట్టించుకోని మీ భర్త ఒక్కసారిగా మీకు తెలీని పాస్‌వర్డ్‌లు పెట్టేస్తున్నాడా? అయితే డౌటే లేదు మీరు అనుమానించాల్సిందే.ఇక నార్మల్ గా ఉండే ఫోన్ ని తిప్పిపెట్టడం లేదా సైలెంట్‌ మోడ్ లో ఉంచడం చేస్తున్నాడా,మీరు తన దగ్గరకు వెళ్ళగానే ఫోన్ ని ఆపేయడం లేదా స్క్రీన్ మీకు కనిపించకుండా దాచడం వంటివి చేస్తున్నాడా ? అయితే ఎక్కడో తేడా కొడుతుందని గుర్తుంచుకోండి.

గంటల తరబడి చాటింగ్ చేస్తున్నాడా?

Advertisement

ఇక మీరు నిద్రపోయారని కన్ఫర్మ్ చేసుకున్నాక గంటల తరబడి చాటింగ్ చేస్తున్నాడా? గుర్తుంచుకోండి..ప్రైవసీ వేరు, సీక్రెట్స్ వేరు! ఒకప్పుడు ఆఫీస్ అయిపోగానే టైమ్ కి ఇంటికి వచ్చే మీ ఆయన ఇప్పుడు రోజూ ఏదో ఒక కారణంతో లేట్ గా వస్తున్నారా? “ఫ్రెండ్ కి యాక్సిడెంట్ అయిందని, “ఆఫీస్ మీటింగ్ ఉందని “, “ఓవర్ టైమ్ వర్క్ పడిందని “, ఎప్పుడూ చెప్పని కొత్త సాకులు చెబుతున్నాడా ? మీ ఫోన్ కాల్స్‌కు సరిగ్గా రెస్పాండ్ కాకపోవడం, అయినా ఆన్సర్ షార్ట్ గా ఇవ్వడం, ఎటైనా వెళ్దామంటే లాస్ట్ మినిట్ లో క్యాన్సిల్ చేయడం వంటివి చేస్తున్నాడా ..ఏమో .
మీ భర్త ‘డబుల్ గేమ్’ ఆడుతున్నారనే దానికి ఇవే సంకేతాలు కావచ్చు.

also read:మల్టీస్టారర్ అంటే ముచ్చట కాదు గురూ .. పక్కా ‘బిజినెస్ కాలిక్యులేషన్’!

సడెన్ గా మీమీద ప్రేమ పొంగిపోతుందా?

ఇక ఎప్పుడూ లేనిది సడెన్ గా మీమీద ప్రేమ పొంగిపోతుందా? సందర్భం లేకుండా కాస్ట్లీ గిఫ్టులు తేవడం, అనవసరంగా పొగడటం వంటివి చేస్తున్నారా? అయితే బీ కేర్ ఫుల్ ఇది నిజమైన ప్రేమ కాకపోవచ్చు.. తప్పు చేశామనే గిల్టీ నెస్ నుంచి పుట్టిన నకిలీ ప్రేమ కావచ్చు. తన తప్పును కవరప్ చేసుకోవడానికి మిమ్మల్ని మభ్యపెట్టే ప్రయత్నం కూడా కావొచ్చు.

మీతో పర్సనల్ గా గడపకపోవడం

ఇకపొతే మోసం చేసేవారు అసలు కళ్లోకి కళ్లు పెట్టి మాట్లాడలేరు. మీతో పర్సనల్ గా గడపకపోవడం , చిన్నపాటి స్పర్శని (Physical Touch)కూడా అవాయిడ్ చేయడం, మీతో మాట్లాడటం బోర్ గా ఫీల్ అవ్వడం, ఇలా ఏదో ఒక వంకతో పక్క గదిలోకి వెళ్లడం లేదా త్వరగా నిద్రపోవడం వంటివి చేస్తుంటే మాత్రం వారి మనసులో ఇంకొకరికి చోటు దొరికినట్టే.

గంటలు గంటలు అద్దం ముందు నిలబడటం

ఇక ఎప్పుడూ లేని విధంగా గంటలు గంటలు అద్దం ముందు నిలబడటం డ్రెస్సింగ్ గురించి పట్టించుకోని వ్యక్తి.. కొత్తగా జిమ్ కి వెళ్లడం, కొత్త బట్టలు కొనడం, పర్ఫ్యూమ్ లు ఎక్కువగా వాడటం చేస్తే మాత్రం ఎవరినో ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నట్టే.
సో …ఇవన్నీ మీ భర్తలో కనిపిస్తే మీరు ఇప్పటికైనా లేట్ చేయకుండా ఆ ‘ఎవరో’ తెలుసుకోవాల్సిన టైమ్ వచ్చేసిందన్న మాట !

also read:Aliabad Budget: అలియాబాద్ అభివృద్ధికి 10 కోట్ల వార్షిక బడ్జెట్..!

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×