E-Paper
Advertisement

Raw milk Effects: పచ్చిపాలు తాగకూడదా? తాగితే ఏమవుతుంది?

Raw milk Effects:  పచ్చిపాలు తాగకూడదా? తాగితే ఏమవుతుంది?
Advertisement

పాలు మన ఆహారంలో భాగం. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ పాలు అవసరం. పాలల్లో కాల్షియం, ప్రోటీన్, విటమిన్ D, విటమిన్ B12 వంటి అనేక పోషకాలు ఉంటాయి. కానీ చాలా మంది పాలు మరిగించకుండా పచ్చిగా తాగడం మంచిదని అనుకుంటారు. నిజంగా పచ్చిపాలు తాగడం ఆరోగ్యానికి మేలా? ప్రమాదమా?

పచ్చిపాలు అంటే ఏమిటి?
గేదె లేదా ఆవు నుంచి నేరుగా తీసిన పాలను పచ్చిపాలు అంటారు. వాటి ఎలాంటి వేడి చేయకుండా, మరిగించకుండా పచ్చిపాలు తాగే అలవాటు కొంతమంది ఉంటుంది. ఈ పాలను మరిగించకపోవడం వల్ల అందులో ఉన్న సూక్ష్మక్రిములు, బ్యాక్టీరియా చనిపోవు. పచ్చిపాలు సహజమైనవని అనుకుంటారు.. కానీ అందులో ఉండే సూక్ష్మజీవులు ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం.

Advertisement

పచ్చిపాలలో ఉండే సూక్ష్మక్రిములు

పచ్చిపాలలో సాల్మొనెల్లా, ఈ.కోలి, లిస్టీరియా, క్యాంపిలోబాక్టర్ వంటి హానికర బ్యాక్టీరియా ఉండే అవకాశం చాలా ఎక్కువ. ఇవి మన శరీరంలోకి వెళ్లిన తర్వాత ఫుడ్ పాయిజనింగ్ కు కారణం అవుతాయి. వీటి వల్ల కడుపు నొప్పి, విరేచనాలు, వాంతులు, జ్వరం, శరీర బలహీనత వంటి సమస్యలు వస్తాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు, గర్భిణీలు, వృద్ధుల్లో తీవ్రమైన ఇన్‌ఫెక్షన్లకు కారణం అవుతుంది. కొన్ని సందర్భాల్లో లిస్టీరియా వంటి సూక్ష్మజీవులు గర్భిణీలలో గర్భస్రావానికి కూడా కారణమవుతాయి.

Advertisement

పచ్చిపాలను తాగిన తర్వాత కొందరికి వెంటనే జీర్ణ సమస్యలు వస్తాయి. విరేచనాలు, కడుపు నొప్పి, జ్వరం, వాంతులు రావచ్చు. పిల్లలు, వృద్ధులు, గర్భిణీలు, తక్కువ రోగనిరోధక శక్తి ఉన్నవారికి ఇవి మరింత ప్రమాదకరం. చాలా సందర్భాల్లో ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. కొంతమంది పచ్చిపాలలో ఎంజైములు, మంచి బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటాయని అనుకుంటారు. కానీ ఆ ప్రయోజనాలు కంటే ప్రమాదాలు చాలా ఎక్కువ. పాలను మరిగించినా కూడా అందులో ఎక్కువ పోషకాలు అలాగే ఉంటాయి. కాబట్టి మరిగించడం వల్ల నష్టం ఏమీ లేదు.

పాలు సురక్షితంగా తాగాలంటే
పాలను కనీసం 5–10 నిమిషాలు మరిగిస్తే ప్రమాదకర సూక్ష్మజీవులు చనిపోతాయి. శుభ్రమైన పాత్రలోనే వీటిని నిల్వ చేయాలి. పాలు ఫ్రిజ్ లోనే నిల్వ ఉంచాలి. పాలు చల్లగా ఉంచితే బ్యాక్టీరియా పెరగడం తగ్గుతుంది. మార్కెట్లో లభించే పాశ్చరైజ్డ్ పాలు కొంటేనే మంచిది.

పచ్చిపాలు సహజమైనవి కాబట్టి ఆరోగ్యానికి మేలు చేస్తాయని అనుకోవడం తప్పు. వాటిలో దాగి ఉన్న సూక్ష్మజీవులు తీవ్రమైన వ్యాధులకు కారణమవుతాయి. కాబట్టి పచ్చిపాలను ఎప్పుడూ మరిగించకుండా తాగకండి. మరిగించిన పాలు తాగితేనే మీరు నిజమైన పోషకాలను సురక్షితంగా పొందగలుగుతారు.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×