E-Paper
Advertisement

Sensitive Teeth: సెన్సిటివ్ పంటి సమస్యా ? అయితే బ్రషింగ్ టెక్నిక్ మార్చండి

Sensitive Teeth: సెన్సిటివ్ పంటి సమస్యా ? అయితే బ్రషింగ్ టెక్నిక్ మార్చండి
Advertisement

Sensitive Teeth: మనం రోజూ ఉదయం లేవగానే చేసే మొదటి పని బ్రష్ చేయడం. కానీ చాలా మంది దీనిని ఒక బాధ్యతగా కాకుండా.. కేవలం ఏదో ఒకలా ముగించే పనిగా భావిస్తారు. గట్టిగా రుద్దడం వల్ల పళ్లు తెల్లగా మారుతాయని అనుకోవడం ఒక పెద్ద అపోహ. వాస్తవానికి, తప్పుడు పద్ధతిలో బ్రష్ చేయడం వల్ల పళ్లపై ఉండే రక్షణ పొర దెబ్బతిని, పళ్లు పసుపు రంగులోకి మారడమే కాకుండా సెన్సిటివిటీ సమస్యలు తలెత్తుతాయి. సరైన టూత్ బ్రష్‌ను ఎంచుకోవడం నుంచి, బ్రష్ చేసే విధానం వరకు డెంటిస్టులు సూచిస్తున్న ప్రామాణిక పద్ధతులు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

సరైన బ్రషింగ్ విధానం:
1. సరైన బ్రష్ ఎంపిక :
చాలా మంది ‘హార్డ్’ లేదా ‘మీడియం’ బ్రిజిల్స్ ఉన్న బ్రష్‌లను ఎంచుకుంటారు. కానీ డెంటిస్టులు ఎల్లప్పుడూ ‘సాఫ్ట్’ బ్రష్‌లను మాత్రమే వాడమని సూచిస్తారు. హార్డ్ బ్రిజిల్స్ చిగుళ్లను గాయపరుస్తాయి. ఎనామిల్‌ను అరగదీస్తాయి. అలాగే.. బ్రష్ హెడ్ చిన్నదిగా ఉంటే నోటిలోని చివరి పళ్ల వరకు సులభంగా చేరుకోగలదు.

Advertisement

2. 45 డిగ్రీల కోణం :
చాలామంది బ్రష్‌ను పళ్లపై అడ్డంగా రుద్దుతారు. ఇది తప్పు. బ్రష్‌ను చిగుళ్ల రేఖకు 45 డిగ్రీల కోణంలో ఉంచాలి. చిన్న చిన్న వృత్తాకార కదలికలతో లేదా పై నుంచి కిందకు బ్రష్ చేయాలి. ఇలా చేయడం వల్ల చిగుళ్లలో దాగి ఉన్న పాచి సులభంగా బయటకు వస్తుంది.

3. రెండు నిమిషాల సూత్రం :
మనం బ్రష్ చేయడానికి కేవలం 30 నుంచి 40 సెకన్లు మాత్రమే కేటాయిస్తాము. కానీ నోటిలోని అన్ని భాగాలను శుభ్రం చేయడానికి కనీసం 2 నిమిషాల సమయం అవసరం. నోటిని నాలుగు భాగాలుగా (పై కుడి, పై ఎడమ, కింద కుడి, కింద ఎడమ) విభజించి.. ప్రతి భాగానికి 30 సెకన్లు కేటాయించాలి.

Advertisement

4. నాలుక శుభ్రత :
దుర్వాసన రావడానికి 90% కారణం నాలుకపై పేరుకుపోయిన బ్యాక్టీరియా. పళ్లు తోమడం పూర్తయ్యాక నాలుకను కూడా బ్రష్‌తో లేదా టంగ్ క్లీనర్‌తో సున్నితంగా శుభ్రం చేయాలి. దీని వల్ల నోరు తాజాగా ఉంటుంది.

Also Read: చర్మం కాంతి కోల్పోయిందా ? ఈ 5 విటమిన్లు మీలో తక్కువ ఉండొచ్చు!

5. బ్రష్ ఎప్పుడు మార్చాలి ?
మీ బ్రష్ బ్రిజిల్స్ పక్కకు వంగిపోయినా లేదా రంగు మారినా వెంటనే మార్చేయాలి. సాధారణంగా ప్రతి 3 నెలలకు ఒకసారి కొత్త బ్రష్ తీసుకోవడం ఆరోగ్యకరం. అలాగే.. జ్వరం లేదా ఏదైనా ఇన్ఫెక్షన్ సోకి తగ్గిన తర్వాత కూడా పాత బ్రష్‌ను మార్చడం మంచిది.

ముఖ్యమైన చిట్కాలు:
ఫ్లోసింగ్ : బ్రష్ చేయలేని పళ్ల మధ్య సందులను శుభ్రం చేయడానికి రోజుకు ఒకసారి ఫ్లోసింగ్ చేయండి.

అతిగా వద్దు: రోజుకు రెండు సార్లు (ఉదయం, రాత్రి పడుకునే ముందు) బ్రష్ చేయడం సరిపోతుంది. అంతకంటే.. ఎక్కువ సార్లు తోమడం వల్ల పళ్లు అరిగిపోయే ప్రమాదం ఉంది.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×