E-Paper
Advertisement

Soft idli tips: ఇడ్లీలు గట్టిగా కాకుండా మెత్తగా పువ్వుల్లా రావాలంటే ఈ చిన్న చిట్కాలు పాటించండి

Soft idli tips: ఇడ్లీలు గట్టిగా కాకుండా మెత్తగా పువ్వుల్లా రావాలంటే ఈ చిన్న చిట్కాలు పాటించండి
Advertisement

ఇంట్లో ఇడ్లీలు చేస్తే చాలా మందికి ఒకే సమస్య ఎదురవుతుంది. ఇడ్లీలు గట్టిగా వస్తూ ఉంటాయి. బయట హోటల్‌లో తింటే మాత్రం ఇడ్లీలు చాలా సాఫ్ట్‌గా, నోట్లో కరిగేలా ఉంటాయి. ఇదే తేడా ఎందుకు వస్తుంది అని చాలామంది ఆశ్చర్యపడతారు. అసలు కారణం మనం చేసే చిన్న చిన్న తప్పులు. ఒక సౌత్ ఇండియన్ కేటరర్ చెప్పిన కొన్ని సింపుల్ టిప్స్ పాటిస్తే ఇంట్లో కూడా అదే రుచితో సాఫ్ట్ ఇడ్లీలు సులభంగా చేసుకోవచ్చు.

ఈ తప్పులు చేయకండి
మొదటగా సరైన పదార్థాలు ఎంచుకోవడం చాలా ముఖ్యం. చాలా మంది సాధారణ బియ్యం వాడుతారు. అలా చేస్తే ఇడ్లీలు గట్టిగా అవుతాయి. అందుకే ఇడ్లీ కోసం ప్రత్యేకంగా ఉండే ఉప్పుడు బియ్యం వాడితే మంచి ఫలితం వస్తుంది. మినప పప్పు కూడా ఫ్రెష్‌గా ఉండాలి. పాత పప్పు వాడితే పిండి సరిగ్గా అవదు. ఇడ్లీలు సాఫ్ట్‌గా రావు. మంచి క్వాలిటీ పదార్థాలు వాడితే ఇడ్లీ టేస్టీగా వస్తుంది. బియ్యం, మినప ప్పు ఎంత తీసుకోవాలి అనేది చాలా కీలకం. సాధారణంగా రెండు భాగాలు బియ్యం, ఒక భాగం మినప పప్పు తీసుకోవడం బెస్ట్. ఈ నిష్ఫత్తి తప్పితే ఇడ్లీలు సరైన రుచి రావు. కొందరు పప్పు ఎక్కువ వాడతారు, మరికొందరు తక్కువ వాడతారు. సరైన కొలతలు పాటించడం తప్పనిసరి.

Advertisement

Also read: Migraine: మైగ్రేన్ నొప్పి తట్టుకోలేకపోతున్నారా? ఈ ఆకులను వాడారంటే వెంటనే తగ్గుతుంది

ఇంకా ఒక పెద్ద కారణం ఫర్మెంటేషన్. పిండి బాగా పులిస్తేనే ఇడ్లీలు సాఫ్ట్‌గా వస్తాయి. పిండి కనీసం 8 నుంచి 10 గంటలు వేడి ప్రదేశంలో ఉంచాలి. చల్లటి ప్రదేశంలో ఉంచితే ఫర్మెంటేషన్ సరిగ్గా జరగదు. బ్యాటర్ పైకి ఎగిసి బబుల్స్ కనిపిస్తే అది రెడీ అయినట్టు అర్థం. అప్పుడే ఇడ్లీలు వండుకోవాలి. రుబ్బే పద్ధతి కూడా చాలా కీలకం. మినప పప్పును స్మూత్‌గా, క్రీమీగా గ్రైండ్ చేయాలి. పిండి చాలా గట్టిగా ఉంటే ఇడ్లీలు కూడా గట్టిగా అవుతాయి. స్టీమింగ్ కూడా ఎక్కువసేపు చేయకూడదు. ఎక్కువగా ఉడికిస్తే ఇడ్లీలు డ్రై అవుతాయి.

Advertisement

Also read: Dates with Milk: పాలు ఖర్జూరం కలిపి తింటే అద్భుత ప్రయోజనాలు.. తెలిస్తే ఇప్పుడే తినడం ప్రారంభిస్తారు

ఈ చిన్న చిన్న టిప్స్ కూడా చాలా ఉపయోగపడతాయి. కొద్దిగా మెంతులు కలిపితే ఇడ్లీలు మరింత సాఫ్ట్‌గా వస్తాయి. కొందరు పోహా లేదా సగ్గుబియ్యం కూడా కలుపుతారు. ఇవి ఫ్లఫీనెస్ పెంచుతాయి. ఈ చిన్న మార్పులు చేస్తే ఇంట్లో చేసిన ఇడ్లీలు కూడా హోటల్ స్టైల్‌లో సాఫ్ట్‌గా, టేస్టీగా వస్తాయి. కాబట్టి ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయితే ఇక గట్టి ఇడ్లీలు సమస్య ఉండదు.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×