E-Paper
Advertisement

Manicure at Home: చేతులు గరుకుగా మారాయా? ఓట్‌మీల్, చక్కెరతో ఇలా మృదువుగా మార్చుకోండి!

Manicure at Home: చేతులు గరుకుగా మారాయా? ఓట్‌మీల్, చక్కెరతో ఇలా మృదువుగా మార్చుకోండి!
Advertisement

Manicure at Home: రోజూ ఇంట్లో అంట్లు తోమడం, బట్టలు ఉతకడం వంటి పనులు చేయడం వల్ల చేతులు తరచూ నీళ్లలో నానుతుంటాయి. దీంతో చేతులపై ఉండే సహజసిద్ధమైన నూనెలు తగ్గిపోయి, చర్మం పొడిగా మారి దురద, మంట వంటి సమస్యలు వస్తుంటాయి. అయితే, వీటి కోసం బ్యూటీ పార్లర్లకు వెళ్లాల్సిన అవసరం లేకుండా వంటింట్లో దొరికే సహజ పదార్థాలతోనే సాఫ్ట్ చేతులను సొంతం చేసుకోవచ్చు. అదెలాగో చూసేద్దాం రండి..

ఓట్‌మీల్ అద్భుతం..

ఓట్‌మీల్ పొడి చర్మానికి మంచి తేమను అందిస్తుంది. ఒక స్పూన్ ఓట్‌మీల్ పొడిలో అర స్పూన్ కొబ్బరి నూనె కలిపి మణికట్టు వరకు మాస్క్‌లా వేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేస్తే చర్మం మృదువుగా మారుతుంది. ఒకవేళ మీకు చర్మంపై ట్యాన్ ఎక్కువగా ఉంటే.. టొమాటో ముక్కను ఓట్‌మీల్ పొడిలో ముంచి చేతులపై మర్దన చేసుకోవచ్చు.

Advertisement

Also Read: పాలకూరను పచ్చిగా తింటే ప్రమాదమా? నిపుణులు ఏం చెబుతున్నారంటే?

సహజమైన షుగర్ స్క్రబ్..

చర్మాన్ని రిపేర్ చేయడంలో విటమిన్ ఇ ఆయిల్ బాగా పనిచేస్తుంది. రెండు స్పూన్ల చక్కెరలో ఐదారు చుక్కల విటమిన్ ఇ ఆయిల్ కలిపి చేతులపై మృదువుగా స్క్రబ్ చేయాలి. ఇది చర్మంపై ఉన్న మృతకణాలను తొలగించి, చేతులు ప్రకాశవంతంగా మెరిసేలా చేస్తుంది.

అరటి పండుతో మ్యాజిక్..

Advertisement

తేనె, కొబ్బరి నూనె, చక్కెర, ఉప్పు, కొద్దిగా నిమ్మరసం కలిపిన మిశ్రమాన్ని ఒక గాజు సీసాలో భద్రపరచండి. రోజూ స్నానం చేసే ముందు కొద్దిగా తీసుకుని మణికట్టు వరకు మృదువుగా రుద్దుకుంటే చేతులు సాఫ్ట్‌గా మారుతాయి. అలాగే ఇంట్లో బాగా పండిన అరటిపండు తొక్కలు ఉంటే.. వాటిని చక్కెరలో ముంచి చేతులపై రుద్దుకోవడం ద్వారా కూడా ఇన్‌స్టంట్ గ్లో లభిస్తుంది.

Also Read: బరువు తగ్గడం నుంచి గుండె ఆరోగ్యం వరకు.. బొప్పాయితో కలిగే అద్భుత ప్రయోజనాలివే!

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×