E-Paper
Advertisement

Weekend Tips: పని ఒత్తిడితో సతమతమవుతున్నారా? ఈ వీకెండ్ టిప్స్‌తో స్ట్రెస్‌ను దూరం చేసుకోండి!

Weekend Tips: పని ఒత్తిడితో సతమతమవుతున్నారా? ఈ వీకెండ్ టిప్స్‌తో స్ట్రెస్‌ను దూరం చేసుకోండి!
Advertisement

Weekend Tips: వారంలో వరుసగా ఐదు రోజులపాటు చదువు, ఉద్యోగ ఒత్తిడి అంటూ గడిపిన తర్వాత వచ్చే వీకెండ్‌ను చాలామంది ఇంటికే పరిమితం చేస్తున్నారు. శని, ఆదివారాలను సరైన విధంగా ఉపయోగించుకోవడం లేదు. ఇంట్లోనే ఎక్కువసేపు నిద్రపోవడం లేదా రొటీన్ పనులతో వీకెండ్‌ను గడిపేస్తున్నారు. ఇలా చేయడం వల్ల శరీరం మీద ఒత్తిడి పెరుగుతుందే తప్ప.. ఎలాంటి ఉపయోగం ఉండదు. ఈ క్రమంలో నిపుణులు ఏమంటున్నారంటే.. వీకెండ్‌ను సరైన ప్లానింగ్‌తో గడిపితే పని ఒత్తిడి తగ్గడమే కాక.. వ్యక్తిగత జీవితానికి కొత్త ఉత్సాహం లభిస్తుందని చెబుతున్నారు.

మీతో మీరు గడపండి:

వీకెండ్ కదా అని ఆలస్యంగా నిద్రలేవకుండా.. ఉదయాన్నే లేచి కిటికీలు, తలుపులు తెరిచి స్వచ్ఛమైన గాలిని ఆస్వాదించాలి. దీనివల్ల మానసిక ప్రశాంతత ఎంతో మెరుగుపడుతుందని చెబుతన్నారు నిపుణులు. అలాగే ఉదయం పూట వేడివేడి కాఫీ లేదా మీకు ఇష్టమైన పానీయంతో రోజును ప్రారంభించడం శరీరాన్ని ఉత్సాహంగా ఉంచుతుందని సూచిస్తున్నారు. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్‌కు దూరంగా ఉండి, మీ కోసం మీరు సమయం కేటాయించుకోవడం అవసరమని అంటున్నారు.

Advertisement

Also Read: చేత్తో అన్నం తినడంలో ఇంత సైన్స్ ఉందా? అరచేతిలో దాగున్న పంచభూతాల రహస్యం ఇదే!

వీకెండ్ వారియర్స్‌గా:

వారాంతపు రోజున మీకు దగ్గర్లోని పార్క్‌లో వాకింగ్ లేదా సైక్లింగ్ చేయడం ద్వారా శారీరక వ్యాయామంతో పాటు ప్రకృతిని ఆస్వాదించినట్లూ ఉంటుంది. అలాగే.. ఇంటికి వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేయడం, వారితో కలిసిమెలిసి ఉండటం వల్ల కుటుంబ అనుబంధాలను బలోపేతం చేసుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు.

ఆత్మీయులను కలవండి:

Advertisement

థియేటర్‌కు వెళ్లి మంచి సినిమా చూడటం లేదా ఏదైనా పార్కులో కూర్చొని పుస్తకం చదవడం, చిత్రలేఖనం వంటి హాబీలకు సమయం కేటాయించడం మానసిక సంతృప్తిని ఇస్తుంది. సాయంత్రం వేళ వాకింగ్, స్నేహితులతో గడపడం ద్వారా వీకెండ్ మరింత ఆనందంగా మారుతుందని చెబుతున్నారు. అలాగే ప్రతి వారం కాకపోయినా అప్పుడప్పుడైనా వీకెండ్‌ను ట్రిప్స్ ప్లాన్ చేసుకుంటే.. పని ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. దీంతో మరో వారాన్ని ఉత్సాహంగా ప్రారంభించవచ్చు.

Also Read:  అతిగా మల్టీ విటమిన్ ట్యాబ్లెట్స్ మింగుతున్నారా? అనారోగ్యం కొని తెచ్చుకున్నట్లే!

 

 

 

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×