E-Paper
Advertisement

Pregnant Women Health Tips: కాబోయే అమ్మలూ.. శీతాకాలంలో తప్పకుండా ఈ జాగ్రత్తలు పాటించాల్సిందేనట!

Pregnant Women Health Tips: కాబోయే అమ్మలూ.. శీతాకాలంలో తప్పకుండా ఈ జాగ్రత్తలు పాటించాల్సిందేనట!
Advertisement

Pregnant Women Health Tips: మిగతా సీజన్లలో కంటే శీతాకాలంలో గర్భిణీ స్త్రీలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ కాలంలో చలి గర్భిణుల శరీర రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుందని, ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని పెంచుతుందని హెచ్చరించారు. రోజురోజుకీ ఉష్ణోగ్రతలు పడిపోవడంతో గర్భిణీ స్త్రీలలో రక్తపోటు హెచ్చ తగ్గులుంటాయని, ఇది తల్లితో పాటు బిడ్డకు కూడా ప్రమాదమని చెబుతున్నారు. అలాగే చల్లని గాలులు శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తాయని, దీనివల్ల అలసట, తలతిరుగుడు, బలహీనత ఏర్పడుతాయని చెప్పారు. ఈ నేథ్యంలో శీతాకాలంలో గర్భిణులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఓసారి చూసేద్దాం..

వైరల్ ఇన్ఫెక్షన్లతో ప్రమాదం:

చలికాలం కాబోయే తల్లులను అనేక రకాల అనారోగ్య సమస్యలకు గురిచేస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. గర్భధారణ సమయంలో రోగనిరోధక శక్తి బలహీనంగా ఉంటుందని, ఈ సమయంలో ఫ్లూ, జలుబు, న్యుమోనియా వంటి వైరల్ ఇన్ఫెక్షన్లు అనేవి గర్భిణుల్లో అతిపెద్ద ప్రమాదంగా చెబుతున్నారు. అలాగే చల్లని ఉష్ణోగ్రతలు రక్త ప్రసరణను ప్రభావితం చేస్తాయి. దీంతో గర్భిణుల చేతులు, కాళ్లు చల్లబడటం, తిమ్మిరి, రక్తపోటులో హెచ్చుతగ్గులు వస్తాయి. ఈ సమయంలో కొంతమంది మహిళలు కీళ్ల నొప్పులు, అలసట, శ్వాస సమస్యలతో కూడా బాధపడవచ్చన్నారు. కాబట్టి.. శీతాకాలంలో గర్భిణులు క్రమం తప్పకుండా వెచ్చని దుస్తులు ధరించాలి. అలాగే ఎప్పటికప్పుడు శరీర ఉష్ణోగ్రతను కాపాడుకోవాలని వైద్యులు వెల్లడించారు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

Advertisement

* శీతాకాలంలోని చల్లని గాలి గర్భిణుల చర్మాన్ని పొడిగా చేసి తేమ కోల్పోయేలా చేస్తుంది. పొట్టపెరిగే క్రమంలో చర్మం పగులటం, స్ట్రెచ్ మార్క్స్ వచ్చే సమస్యలు మొదలవుతాయి. కాబట్టి.. గర్భిణీ స్త్రీలు తరచూ లోషన్లు, క్రీములు రాసుకోవాలి. దీంతో చర్మాన్ని తేమగా ఉంచుకోవచ్చు.
* చలికాలంలో దాహం వేయనప్పటికీ.. రోజుకి సరిపడా నీరు తాగడం తప్పనిసరి. శరీరంలోని తేమ స్థాయిని నిలబెట్టడం ద్వారా డీహైడ్రేషన్‌ను నివారించవచ్చు. ఈ డీహైడ్రేషన్ కారణంగా శిశువుకు అవసరమైన ఉమ్మనీరు తగ్గిపోయి ప్రీమెచ్యూర్ డెలివరీ అవ్వొచ్చు. అలాగే తల్లి పాలు కూడా తగ్గే అవకాశం ఉంటుంది.
* శీతాకాలంలో బాడీలోని రక్త ప్రసరణను ప్రభావితం చేస్తుంది. చేతులు, కాళ్లలో వాపు, దురద సమస్యలు రావచ్చు. ఈ క్రమంలో పాదాలను గోరువెచ్చని నీటిలో నానబెట్టి, బాగా కప్పుకోవడం ద్వారా ఈ సమస్యలను తగ్గించవచ్చు.
* అలాగే గర్భిణీ స్త్రీలు ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవడం చాలా ముఖ్యం. ఇది తల్లి, బిడ్డలను ఫ్లూ నుండి రక్షిస్తుంది. బిడ్డ పుట్టిన తర్వాత 6 నెలల వరకు ఫ్లూ బారిన పడకుండా ఉంటుంది. అలాగే ఈ ఫ్లూ వ్యాక్సిన్ శ్వాసకోశ సమస్యలను కూడా తగ్గిస్తుంది.
* చలికాలంలో గర్భిణీ స్త్రీలు సమతుల ఆహారం తీసుకోవడం అవసరం. సి విటమిన్ పుష్కలంగా ఉండే ఉసిరికాయలు, ఇతర పండ్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. దీంతోపాటు బచ్చలికూర, మెంతి ఆకు, ఉల్లిపాయ ఆకులు వంటి కూరగాయలు కూడా ఆహారంలో చేర్చుకోవాలి.
* ఈ సీజన్లో గర్భిణీ స్త్రీలు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండేందుకు పైన తెలిపిన సూచనలు పాటించడం చాలా ముఖ్యం. ప్రతీ గర్భిణీ స్త్రీ డాక్టర్ల సలహా తీసుకుంటూ అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×