E-Paper
Advertisement

Dementia: ప్రతిరోజూ సంగీతం వింటే మతిమరుపుకు కళ్లెం.. తాజా అధ్యయనం ఏం చెబుతోందంటే?

Dementia: ప్రతిరోజూ సంగీతం వింటే మతిమరుపుకు కళ్లెం.. తాజా అధ్యయనం ఏం చెబుతోందంటే?
Advertisement

Dementia: ఇంట్లోని పెద్దల వయస్సు పెరిగీ కొద్దీ డిమెన్షియా(మ‌తిమ‌రుపు) రావడం సర్వసాధారణం. ఈ డిమెన్షియా వల్ల.. కొంతసేపు క్రితం తామేమి చేశారో కూడా గుర్తుండదు. ఏదైనా పనిచేసినా చేయలేదని అనుకుంటారు. చేసిన పనినే మళ్లీ మళ్లీ చేస్తుంటారు. కొన్నిసార్లు బాగా తెలిసిన వాళ్లను కూడా గుర్తుప‌ట్ట‌లేరు. ఇలాంటి లక్షణాలనే డిమెన్షియా అంటారు. ఇది వృద్ధాప్యంలో చాలామందిని వేధించే సమస్య. అయితే, ఈ మతిమరుపు ప్రమాదాన్ని తగ్గించడంలో సంగీతం ఒక మహత్తర ఔషధంలా పనిచేస్తుందని ఒక అంతర్జాతీయ అధ్యయనం తేల్చింది. 70ఏళ్లు పైబడిన వృద్ధులు క్రమం తప్పకుండా.. మ్యూజిక్ వినడం/ వాయిద్యాలు వాయించడం ద్వారా, డిమెన్షియా వచ్చే ప్రమాదాన్ని 39% వరకు తగ్గించుకోవచ్చని పరిశోధకులు కనుగొన్నారు.

అధ్యయనం ఏం చెబుతోంది?

ఆస్ట్రేలియాలోని మోనాష్ యూనివర్సిటీ నేతృత్వంలో 10,800 మందికి పైగా వృద్ధులపై సుదీర్ఘకాలం పరిశోధన చేసిన తర్వాత ఈ వివరాలను ‘ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ గెరియాట్రిక్ సైకియాట్రీ’ లో ప్రచురించారు. ఈ అధ్యయనంలో పాల్గొన్న వృద్ధులను వారి సంగీత అలవాట్ల ఆధారంగా.. మూడు విభాగాలుగా విభజించి పరిశీలించారు. ఎప్పుడూ సంగీతం వినేవారిలో, అస్సలు సంగీతం వినే అలవాటు లేని లేదా అరుదుగా సంగీతం వినేవారితో పోలిస్తే.. డిమెన్షియా(మతిమరుపు) వ్యాధి వచ్చే ప్రమాదం 39 శాతం తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అంతేకాదు.. ప్రతిరోజూ క్రమం తప్పకుండా ఏదైనా సంగీత వాయిద్యాన్ని వాయించే అలవాటు ఉన్నవారిలో కూడా డిమెన్షియా ముప్పు 35 శాతం వరకు తగ్గినట్లు పరిశోధకులు తెలిపారు.

రెండూ చేసే వారిలో..

Advertisement

వృద్ధులపై చేసిన పరిశోధనలో పాల్గొన్న వారిలో సంగీతం వినడం, వాయిద్యం వాయించడం రెండింటిలో చురుకుగా పాల్గొనేవారిలో డిమెన్షియా ముప్పు 33 శాతం తగ్గింది. అంతేకాకుండా.. వారిలో జ్ఞానపరమైన బలహీనత వచ్చే ప్రమాదం కూడా 22 శాతం వరకు తక్కువగా ఉందని ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ గెరియాట్రిక్ సైకియాట్రీలో ప్రచురించారు.

 

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×