E-Paper
Advertisement

Parijat Benefits: పారిజాత పువ్వుల్లో దాగున్న ఆరోగ్యం.. ఒత్తిడి, డయాబెటిస్, కీళ్ల నొప్పులకు చెక్ పెట్టండిలా!

Parijat Benefits: పారిజాత పువ్వుల్లో దాగున్న ఆరోగ్యం.. ఒత్తిడి, డయాబెటిస్, కీళ్ల నొప్పులకు చెక్ పెట్టండిలా!
Advertisement

Parijat Benefits: మంచు కురిసే తెల్లవారుజామున.. ఆ దోసెడంత పారిజాత పూల పరిమళం మనల్ని పలకరిస్తే వచ్చే ఆ హాయే వేరు. వెన్నెల రంగు రేకులు, సంధ్యారాగం అద్దినట్లున్న ఆ నారింజ రంగు తొడిమలు.. రాత్రంతా వికసించి, సూర్యోదయానికి ముందే నేలను ముద్దాడుతూ రాలిపోయే ఈ పుష్పాలను చూస్తుంటే, ప్రకృతి మనకు ఇస్తున్న కానుకలా అనిపిస్తాయి కదా. నిజానికి పారిజాతం అంటే.. కేవలం దేవుడి పూజకు వాడే పూలు మాత్రమే కాదు.. మన అమ్మమ్మ, తాతయ్య కాలం నాటి సహజ సిద్ధమైన ఓ దివ్యౌషదం.

రోగాల బారిన పడ్డప్పుడు పదే పదే మందుల షాపుల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా.. మన పెరట్లోనే ఆరోగ్య రహస్యాలను దాచుకున్న ఈ పారిజాత వనం గురించి, దాని వెనుక ఉన్న ఆశ్చర్యకరమైన ఔషధ గుణాల గురించి ఒక్కసారి లోతుగా తెలుసుకుందాం పదండి..

సువాసనతో ప్రశాంతత:

Advertisement

పారిజాత పువ్వుల సువాసనకు మనసును ప్రశాంతపరిచే అద్భుత శక్తి ఉంది. రోజంతా పనుల ఒత్తిడితో అలసిపోయిన వారు ఈ చెట్టు వద్ద కాసేపు గడిపితే, ఆ పరిమళం నేరుగా మెదడుపై ప్రభావం చూపి ఒత్తిడిని తగ్గిస్తుంది. నిద్రలేమితో బాధపడేవారికి ఇదొక సహజమైన థెరపీలా పనిచేస్తుంది.

Also Read: గ్లాసు పసుపు నీటితో మీ రోజును స్టార్ట్ చేయండి.. ఎనర్జీతో పాటు మెరిసే చర్మం మీ సొంతం!

ఒత్తిడి దూరం:

Advertisement

ఆయుర్వేదంలో పారిజాత ఆకులకు ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా తరచూ వచ్చే జ్వరాలు, కీళ్ల నొప్పులతో బాధపడేవారికి ఈ ఆకుల కషాయం ఎంతో ఉపయోగకరం. ఈ ఆకుల్లో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు నరాల ఒత్తిడిని తగ్గించి, శరీరానికి ఉపశమనాన్ని ఇస్తాయి. పరగడుపున ఈ ఆకుల రసాన్ని తీసుకుంటే రక్తప్రసరణ మెరుగుపడటమే కాకుండా, రక్తంలో చక్కెర స్థాయిలు కూడా అదుపులో ఉంటాయి.

సహజ సౌందర్యం:

ప్రస్తుతం చాలామంది వాడుతున్న కెమికల్స్ ఉన్న క్రీముల కంటే.. పారిజాతం ఇచ్చే మెరుపు చాలా స్వచ్ఛమైనది. ఈ పువ్వుల మిశ్రమాన్ని లేదా ఆకుల పేస్టును ముఖానికి రాసుకోవడం వల్ల మొటిమలు తగ్గి, చర్మం సహజమైన కాంతితో మెరుస్తుంది. జుట్టు రాలే సమస్య ఉన్నవారు ఈ ఆకులు మరిగించిన నీటితో తలస్నానం చేస్తే కుదుళ్లు దృఢంగా మారుతాయి.

పెంచడం సులభం:

పారిజాత మొక్కను పెంచడం పెద్ద కష్టమేమీ కాదు. తక్కువ నీరు, కాస్త సూర్యరశ్మి ఉంటే చాలు.. మీ పెరట్లోనే చక్కగా పెరుగుతుంది. ఆధ్యాత్మికంగా కూడా ఈ మొక్క ఇంట్లో ఉంటే పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుందని చాలామంది నమ్ముతారు. ఈ మొక్కను వారా అటు ఇంటికి అందం, ఇటు మనసుకి ప్రశాంతత, ఒంటికి ఆరోగ్యం.

Also Read: మీ ఫ్రిజ్ ఐస్ ఫ్యాక్టరీలా మారిపోయిందా? ఈ ఒక్క పని చేస్తే ఇంకెప్పుడూ అలా జరగదు!

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×