E-Paper
Advertisement

Palm Toddy vs Date Toddy: తాటికల్లు Vs ఈతకల్లు:ఏది తాగితే మీ బాడీ ఏసీలా మారుతుందో తెలుసా!

Palm Toddy vs Date Toddy: తాటికల్లు Vs ఈతకల్లు:ఏది తాగితే మీ బాడీ ఏసీలా మారుతుందో తెలుసా!
Advertisement

Palm Toddy vs Date Toddy:

ఒకవైపు ఎండలు దంచుతున్నాయి.. మరో వైపు బాడీలో హీట్ పెరిగిపోతోంది!

Advertisement

ఈ టైమ్‌లో థమ్స్ అప్‌లు, స్ప్రైట్‌లు తాగితే రిలాక్సేషన్ కొంతవరకే కానీ, మన పల్లెటూరి ‘నేచురల్ బీర్లు’ ఇచ్చే కిక్కు, హెల్త్ బెనిఫిట్స్ వేరే లెవల్ అంటే నమ్ముతారా .

అవును ..తాటికల్లు, ఈతకల్లు! వీటిని కేవలం పానీయాలు అనుకుంటే పొరపాటే.. ఇవి నేచర్ మనకిచ్చిన యాంటీబయోటిక్స్.

Advertisement

మరి మన బాడీ బాడీ కూల్ అవడానికి తాటికల్లు బెస్ట్ ఆప్షనా ..లేక ఈతకల్లు బెస్ట్ ఆప్షనా ..?

అసలు ఈ రెండింటి మధ్య నడుస్తున్నఆ  ‘కోల్డ్ వార్’ ఏంటో..ఏది తాగితే మీ బాడీ ఏ రేంజ్ కిక్ అండ్ హెల్త్ ఇస్తుందో ఓసారి చూసేద్దాం .

also read:అఖండ 2 దెబ్బకి రూటు మార్చిన బాలయ్య ..!

 తాటికల్లు.. బాడీకి ఇది ఇన్-బిల్ట్ ఏసీ బాస్..

 విపరీతమైన వడదెబ్బ, ఒంట్లో వేడి , కళ్ళలో మంట ..ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నారా? అయితే మీకు తాటికల్లే  పర్ఫెక్ట్ మెడిసిన్ .ఎందుకంటే.తాటికల్లులో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల ఇది బాడీని వెంటనే హైడ్రేట్ చేస్తుంది. అందుకే దీన్ని తాగిన వెంటనే బాడీ  కూల్ అవడమే కాకుండా, మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది.ఇక కిడ్నీలో రాళ్లు ఉన్నాయని భయపడేవారికి అయితే తాటికల్లు ఒక నాచురల్ మెడిసిన్ అనే చెప్పాలి. ఇది బాడీని క్లీన్ చేయడమే కాదు, మూత్రపిండాల్లో పేరుకుపోయిన రాళ్లను కరిగించడంలో అద్భుతంగా పనిచేస్తుందని గ్రామీణ వైద్యం నమ్మడం విశేషం.ఇక తిన్నది అరగకపోయినా, గ్యాస్ సమస్యలు వేధిస్తున్నా తాటికల్లు తాగితే చాలు.. పొట్ట క్లీన్ అయిపోతుందట . ఇక జీర్ణక్రియను మెరుగుపరచి, మలబద్ధకం నుంచి ఇది  విముక్తిని ఇస్తుందంటే ఇంతకు మించిన నేచురల్ మెడిసిన్ ఏముంటుంది.

 ఈతకల్లు..ఇది పక్కా హెల్త్ డ్రింక్ గురూ ..

 ఇక రుచికి తీయగా ఉండే ఈతకల్లు కేవలం కిక్కు  మాత్రమే కాదండోయ్ ..ఇందులో అంతకు మించిన పోషకాలు ఉన్నాయి .అవును ..తాటికల్లు కంటే ఈతకల్లులో ఐరన్, పొటాషియం, , మెగ్నీషియం వంటి మినరల్స్ చాలా ఎక్కువ.ముఖ్యంగా కంటి చూపు మందగిస్తున్న వారికి, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి ఈ ఈతకల్లు ఒక టానిక్ లా పని చేయడం విశేషం. సో స్వీట్ గా ఉంటూనే బాడీకి ఇన్స్టెంట్ ఎనర్జీ ఇస్తుంది.అంటే బాడీని కూల్ చేయాలంటే తాటికల్లు (Palm Toddy)ని  కొట్టాల్సిందేన్న మాట కానీ..ఇక్కడ  ఒక చిన్న కండిషనండోయ్..

అయితే  అమృతం లాంటి కల్లు విషం అవ్వకూడదంటే కొన్ని జాగ్రత్తలు తప్పవు మరి .ముఖ్యంగా పొద్దున్నే సూర్యోదయానికి ముందే తీసిన ‘నీరా’ తాగితేనే అది హెల్త్ డ్రింక్ లా పని చేస్తుంది.అదే  ఎండ ముదిరే కొద్దీ అది పులిసి ‘కిక్కు’ ఇస్తుంది.ఇక అదే పులిసిన కల్లును ఎక్కువగా లాగిస్తే  కాలేయం మీద ఎఫెక్ట్ పడటం పక్కా .

 ఇక కల్లు తెల్లగా ఉండాలని క్లోరల్ హైడ్రేట్ లాంటి కెమికల్స్ కలిపే బ్యాచ్ ఎలాగూ ఉంటుంది.. కాబట్టి కాస్త కేర్ ఫుల్ గా స్వచ్ఛమైనది దొరికితేనే తాగడం ఉత్తమం.ఇప్పటికైనా ఆరోగ్యాలని నాశనం చేసే  సాఫ్ట్ డ్రింక్స్ ని పక్కన పెట్టండి.. మన తాటి చెట్టు, ఈత చెట్టు ఇచ్చే నేచురల్ డ్రింక్స్ ని ఎంజాయ్ చేయండి. మరింకెందుకు లేటు ఈ సమ్మర్లో మీ బాడీకి ఏది కావాలో మీరే డిసైడ్ చేసుకోండి!

 

also read:Tollywood March box office: బాక్సాఫీస్ బ్యాడ్ టైమ్: టాలీవుడ్‌ని ముంచేసిన మార్చ్!

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×