E-Paper
Advertisement

Sweet Hangover: ముందు రోజు రాత్రి స్వీట్లు అధికంగా తిన్నారా? స్వీట్ హ్యాంగోవర్ నుంచి ఇలా తప్పించుకోండి

Sweet Hangover: ముందు రోజు రాత్రి స్వీట్లు అధికంగా తిన్నారా? స్వీట్ హ్యాంగోవర్ నుంచి ఇలా తప్పించుకోండి
Advertisement

గత రాత్రి మద్యపానం అధికంగా చేస్తే మరుసటి రోజు ఏ పనీ చేయలేరు. హ్యాంగోవర్ లో ఉన్నట్టే ఉంటుంది. దేనిమీద శ్రద్ధ పెట్టలేరు. అలాగే ముందు రోజు రాత్రి స్వీట్లు అధికంగా తిన్నా కూడా మీకు స్వీట్ హ్యాంగోవర్ వస్తుంది. అప్పుడు మీ శరీరం పనిచేసేందుకు సిద్ధంగా ఉండదు. దేని మీద దృష్టి కేంద్రీకరించలేరు. అలాంటప్పుడు స్వీట్ హ్యాంగవర్ నుంచి కూడా తప్పించుకోవడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి.

అమెరికన్ హార్ట్ అసోసియేషన్ చెబుతున్న ప్రకారం చాలామంది వ్యక్తులు ప్రతిరోజూ కావాల్సిన దాని కన్నా మూడు రెట్లు అధికంగా స్వీట్‌గా ఉండే పదార్థాలను తింటున్నారు. ఇలా ఎక్కువ తీపి ఉండే పదార్థాలను తినడం చాలా హానికరం.

Advertisement

స్వీట్లు అధికంగా తినడం వల్ల శరీరం ఎంతో కష్టపడుతుంది. ఉదాహరణకు మీరు ఒక పెద్ద కేక్ ముక్క తిన్నారనుకోండి అప్పుడు అందులో ఉండే చక్కెరంతా రక్తంలో చేరుతుంది. ఇది రక్త ప్రవాహంలో తెలియాడే అదనపు చక్కెరగా మారుతుంది. దాన్ని బయటికి పంపించడానికి శరీరం ఇన్సులిన్ ని అధికంగా పంపు చేయాల్సి వస్తుంది. ఆ సమయంలో రక్తంలో చక్కెర స్థాయిలు సాధారణం కంటే తక్కువకి పడిపోతాయి. దీంతో మీలో శక్తి అకస్మాత్తుగా తగ్గిపోయినట్టు నీరసంగా మారిపోతారు.

మీరు ముందు రోజు రాత్రి అధికంగా చక్కెర ఉన్న పదార్థాలు తిని ఉంటే మరుసటి రోజు కొన్ని పనులు చేయండి. దీనివల్ల స్వీట్ హ్యాంగోవర్ తగ్గుతుంది.

Advertisement

మీరు ముందు రోజు రాత్రి తీపి పదార్థాలు అధికంగా తింటే మరుసటి రోజు నీరు అధికంగా తాగండి. నీరు ఎంత ఎక్కువగా తాగితే అంతగా మీ హ్యాంగోవర్ నుంచి బయటకు వస్తారు. అలాగే పుచ్చకాయలు, దోసకాయలు, స్ట్రాబెర్రీలు, పెరుగు వంటివి అధికంగా తినడం వల్ల శరీరంలో నీటి సమతుల్యత సాధారణంగా మారిపోతుంది. అలాగే కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, సోడియం వంటివి  తినడం వల్ల శరీరం డిహైడ్రేషన్ కు గురి కాకుండా ఉంటుంది. స్వీట్ పదార్థాలు అధికంగా తింటే శరీరం డీహైడ్రేటెడ్ అయ్యే అవకాశం ఉంది.

వ్యాయామం చేయడం
స్వీట్ పదార్థాలు తిన్నాక వీలైనంత వరకు తేలికపాటి వ్యాయామాలు చేసేందుకు ప్రయత్నించండి. వాకింగ్ వంటివి చేసినా చాలు రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరగకుండా నెమ్మదిగా పెరగడం మొదలవుతాయి. దీనివల్ల శరీరానికి ఎలాంటి హాని కలగదు. అలాగే ఇన్సులిన్ ఒకేసారి పెరగదు. కాబట్టి సమస్యలు రావు.

స్వీట్ పదార్థాలు తిన్న తర్వాత ఇతర ప్రాసెస్ చేసిన ఆహారాలను మానేయండి. అలాగే మద్యం, ధూమపానం వంటి వాటికి కూడా దూరంగా ఉండాలి. ఈ రెండింటి వల్ల హ్యాంగోవర్ మరింతగా పెరిగిపోయే అవకాశం ఉంది.

యోగా, ధ్యానం వంటివి చేయడం వల్ల శరీరంలోనే షుగర్ స్థాయిలు సాధారణ స్థితికి రావచ్చు. యోగా ప్రతిరోజు చేసే వారిలో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు గణనీయంగా తగ్గినట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. ఒక దగ్గర నిశ్చలంగా కూర్చుని యోగా, ధ్యానం వంటివి చేయడం వల్ల మీకు ఒత్తిడి, ఆందోళన కూడా తగ్గుతాయి.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×