E-Paper
Advertisement

ఉల్లి పాయను ఇలా కోస్తే.. అసలు కళ్లే మండవు, మీరు చేస్తున్న తప్పు ఇదే!

ఉల్లి పాయను ఇలా కోస్తే.. అసలు కళ్లే మండవు, మీరు చేస్తున్న తప్పు ఇదే!
Advertisement

Onion Cutting Tips: సాధారణంగా కిచెన్‌లోకి వెళ్లి ఏ వంటకం చేయాలన్నా చాలామంది భయపడే ఒకే ఒక్క పని ఉల్లిపాయలు కోయడం. ఎందుకంటే.. కూర ఏదైనా సరే ఉల్లిపాయ పడాల్సిందే. కానీ, దాన్ని కట్ చేయాలంటే మాత్రం కళ్ల వెంట నీళ్లు రావాల్సిందే. వంటింట్లో ఎంతటి అనుభవం ఉన్నవారైనా ఈ సమస్యను ఎదుర్కోవాల్సిందే. అసలు ఉల్లిపాయ కట్ చేస్తుంటే మన కళ్లు ఎందుకు అంతలా మండుతాయో తెలుసా? అలాగే ఆ మంట రాకుండా వంటను ఈజీగా మార్చే కొన్ని సహజమైన చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

కన్నీళ్లు ఎందుకు వస్తాయంటే?

దీని వెనుక ఒక చిన్న సైన్స్ దాగి ఉంది. ఉల్లిపాయ లోపలి పొరల్లో కొన్ని ఎంజైమ్‌లు, సల్ఫర్ సమ్మేళనాలు వేర్వేరుగా ఉంటాయి. మనం కత్తితో దాన్ని కోసినప్పుడు ఆ కణాలు దెబ్బతిని, ఈ రెండూ కలిసి ఒక ఘాటైన వాయువుగా మారి గాల్లోకి విడుదలవుతాయి. ఈ గ్యాస్ నేరుగా వచ్చి మన కళ్లలోని తడిని తాకగానే స్వల్పంగా యాసిడ్‌లా మారుతుంది. ఆ మంటను తట్టుకోలేక మన కళ్లు రక్షణ కోసం కన్నీళ్లను బయటకు పంపుతాయి.

కోయడానికి ముందు ఇలా చేయండి:

Advertisement

ఉల్లిపాయ నుంచి వచ్చే ఘాటు మన కళ్లకు చేరకుండా ఉండాలంటే వాటిని కోయడానికి ఒక అరగంట ముందు ఫ్రిడ్జ్‌లో పెట్టడం మంచిది. అంత టైం లేదనుకుంటే ఐస్ ముక్కలు వేసిన చల్లటి నీళ్లలో పది నిమిషాల పాటు ఉంచినా సరిపోతుంది. ఇలా చేయడం వల్ల ఉల్లిపాయలోని రసాయన చర్యల వేగం తగ్గి, ఆ ఘాటైన గ్యాస్ అంత త్వరగా గాల్లోకి రాదు.

Also Read: యువతలో పెరుగుతున్న బాడీ పెయిన్స్.. వైద్యులు చెబుతున్న షాకింగ్ కారణాలు ఇవే!

పదునైన కత్తితోనే ఎందుకు కోయాలి?

Advertisement

మనం చేసే అతి పెద్ద తప్పు మొద్దుబారిన కత్తిని వాడటం. మొద్దు కత్తితో కోసినప్పుడు ఉల్లిపాయ కణాలు ఎక్కువగా నలిగిపోయి ఘాటు ఎక్కువగా బయటకు వస్తుంది. అదే బాగా పదునైన కత్తిని వాడితే ముక్కలు సాఫీగా కట్ అవుతాయి. దీనివల్ల కణాలు తక్కువగా దెబ్బతిని గ్యాస్ రావడం తగ్గుతుంది. అలాగే పొట్టు తీసిన తర్వాత ఉల్లిపాయను కాసేపు నీళ్లలో ఉంచితే ఆ ఘాటు నీటిలోనే కరిగిపోతుంది.

ఉల్లిగడ్డను కట్ చేసే విధానం ఇది:

ఉల్లిపాయను కట్ చేసే పద్ధతిలోనే అసలైన ట్రిక్ ఉంది. ఉల్లిపాయకు కింద ఉండే వేరు భాగంలోనే ఈ ఘాటైన రసాయనాలు ఎక్కువగా దాగి ఉంటాయి. అందుకే మొదట పైభాగాన్ని మాత్రమే కోసి, ఉల్లిపాయను నిలువుగా రెండు ముక్కలు చేయాలి. ఆ తర్వాత కింద ఉన్న వేరు భాగాన్ని తాకకుండా మిగతా ఉల్లిపాయను ముక్కలుగా కోసుకోవాలి. చివర్లో ఆ వేరు భాగాన్ని తీసి పక్కన పడేస్తే చాలా వరకు మంట తగ్గిపోతుంది.

ఈ ట్రిక్స్ ట్రై చేస్తే:

ఉల్లిపాయ కోసేటప్పుడు కళ్లలో నీళ్లు రావడం సహజమే అయినా.. మనం వాడే కత్తి పదునుగా ఉంచుకోవడం, కోసే ముందు కాసేపు నీటిలో ఉంచడం, వేరు భాగాన్ని చివర్లో తీసేయడం వంటి చిన్న చిన్న మార్పులు చేసుకుంటే ఈ సమస్యను సులభంగా దాటేయవచ్చు. ఈసారి వంటింట్లోకి వెళ్లినప్పుడు ఈ పద్ధతిని ట్రై చేసి చూడండి.. మీ పని ఎంత తేలికవుతుందో మీకే తెలుస్తుంది.

Also Read: వాస్కులర్ డిసీజ్ అంత ప్రమాదకరమా? కాళ్ల నొప్పులు, మధుమేహంతో దీనికి ఉన్న లింక్ ఏంటి?

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×