// // Sugar cravings: తరచూ స్వీట్ తినాలనిపిస్తోందా? కారణాలివే కావొచ్చు ! -->
E-Paper
Advertisement

తరచూ స్వీట్ తినాలనిపిస్తోందా? కారణాలివే కావొచ్చు !

తరచూ స్వీట్ తినాలనిపిస్తోందా?  కారణాలివే కావొచ్చు !
Advertisement

Sugar cravings:  చాలా మందికి భోజనం చేసిన తర్వాతో లేదా సాయంత్రం వేళల్లోనో ఏదైనా తీపి పదార్థం తినాలని బలంగా అనిపిస్తుంటుంది. దీనిని కేవలం అలవాటుగానో లేదా ఆకలిగానో భావిస్తే పొరపాటే. తరచుగా తీపి తినాలనే కోరిక కలగడం వెనక మీ శరీరంలో కొన్ని ముఖ్యమైన విటమిన్లు, ఖనిజ లవణాల లోపం ఉండే అవకాశం ఉంది. మీ శరీరం తనకు అవసరమైన శక్తి లేదా పోషకాలు అందనప్పుడు.. తక్షణ శక్తి కోసం చక్కెరను డిమాండ్ చేస్తుంది.మన శరీరంలోని జీవక్రియలు సక్రమంగా జరగడానికి సూక్ష్మ పోషకాలు అవసరం. వాటిలో లోపం ఏర్పడినప్పుడు మెదడుకు తప్పుడు సంకేతాలు అందుతాయి. ఇంతకీ తరచూ చెక్కర తినాలని అనిపించడానికి కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. మెగ్నీషియం లోపం:
చాక్లెట్లు తినాలనిపిస్తోందంటే.. మీ శరీరంలో మెగ్నీషియం తగ్గిందని అర్థం. మెగ్నీషియం శరీరంలో.. 300 కంటే ఎక్కువ ఎంజైమ్ చర్యలలో పాల్గొంటుంది. ముఖ్యంగా గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో.. శక్తి ఉత్పత్తిలో ఇది కీలకం. మెగ్నీషియం తక్కువగా ఉన్నప్పుడు శరీరం గ్లూకోజ్‌ను సమర్థవంతంగా ఉపయోగించుకోలేదు. ఫలితంగా తీపి తినాలనే కోరిక పుడుతుంది.

Advertisement

2. క్రోమియం లోపం :
క్రోమియం ఒక ముఖ్యమైన ఖనిజం. ఇది ఇన్సులిన్ పనితీరును మెరుగు పరుస్తుంది. అంతే కాకుండా రక్తంలోని చక్కెర కణాల్లోకి చేరడానికి ఇది సహాయపడుతుంది. క్రోమియం లోపిస్తే రక్తంలో చక్కెర స్థాయిలు హెచ్చుతగ్గులకు లోనవుతాయి , దీని వల్ల మీ శరీరం తక్షణమే చక్కెరను కోరుకుంటుంది.

3. జింక్ లోపం :
జింక్ ఇన్సులిన్ నిల్వ కోసం సహాయపడుతుంది. జింక్ తక్కువగా ఉన్నప్పుడు, ఇన్సులిన్ సరిగ్గా పనిచేయదు, ఇది ఆకలిని పెంచుతుంది. ముఖ్యంగా కార్బోహైడ్రేట్లు, చక్కెర పదార్థాల మీద వ్యామోహాన్ని కలిగిస్తుంది.

Advertisement

Also Read: మీ హార్మోన్లు మీ చేతుల్లోనే.. ఆహారంతో హార్మోన్ల అసమతుల్యతకు చెక్!

4. ఐరన్ :
శరీరంలో ఐరన్ తక్కువగా ఉంటే.. రక్తహీనత కలుగుతుంది. దీనివల్ల కణాలకు ఆక్సిజన్ సరఫరా తగ్గిపోయి మీరు అలసటగా అనిపిస్తారు. ఆ అలసటను అధిగమించి తక్షణ శక్తిని పొందడానికి మీ మెదడు తీపి పదార్థాలను ఆశ్రయిస్తుంది.

ఇతర కారణాలు- లైఫ్ స్టైల్
పోషకాలతో పాటు మరికొన్ని అంశాలు కూడా ఈ కోరికలకు కారణమవుతాయి.

నిద్రలేమి: నిద్ర సరిగ్గా లేనప్పుడు ‘గ్రెలిన్’ (ఆకలిని పెంచే హార్మోన్) పెరిగి, ‘లెప్టిన్’ (కడుపు నిండినట్లు తెలిపే హార్మోన్) తగ్గుతుంది.

ఒత్తిడి: ఒత్తిడిలో ఉన్నప్పుడు కార్టిసాల్ హార్మోన్ విడుదలవుతుంది. ఇది మనల్ని ‘కంఫర్ట్ ఫుడ్స్’ అంటే తీపి పదార్థాల వైపు మళ్ళిస్తుంది.

ప్రోటీన్ లేకపోవడం: ఆహారంలో ప్రోటీన్ తక్కువగా ఉంటే రక్తంలో చక్కెర త్వరగా తగ్గిపోయి ఆకలి వేస్తుంది.

Also Read: మీరు ఏం తింటున్నారన్నది కాదు.. ఎలా తింటున్నారన్నదే ముఖ్యం!

జాగ్రత్తలు: 

నీరు ఎక్కువగా తాగండి: ఒక్కోసారి దాహాన్ని కూడా మనం ఆకలిగా లేదా తీపి కోరికగా భ్రమపడతాం.

సరైన నిద్ర: రోజుకు 7-8 గంటల నిద్ర తప్పనిసరి.

సహజ చక్కెరలు: వైట్ షుగర్‌కు బదులుగా పండ్లు, ఖర్జూరాలు లేదా బెల్లం పరిమితంగా తీసుకోవడం అలవాటు చేసుకోండి.

తీపి కోరికలు అనేవి మీ శరీరం పంపే హెచ్చరిక సంకేతాలు. సమతుల్య ఆహారం, సరైన వ్యాయామం, ఒత్తిడి లేని లైఫ్ స్టైల్ ద్వారా ఈ కోరికలను నియంత్రించవచ్చు. ఒకవేళ సమస్య తీవ్రంగా ఉంటే.. డాక్టర్‌ను సంప్రదించి అవసరమైన విటమిన్ పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×